Others

గొబ్బిళ్లు.. గోవిందుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన .. తెలుగు పండుగల్లో విశిష్టమైన పండుగ సంక్రాంతి. జనజీవనంలోనూ ప్రకృతిలోనూ , వ్యవసాయ కార్యకలపాలతోను ముడిపడి ఉన్న పండుగే సంక్రాంతి!! ప్రతినెలా సూర్య భగవానుడు ఒక రాశిలోనుంచి మరొక రాశిలోని మారుతూ ఉంటాడు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే జోరు సంక్రాంతి.
సంక్రాంతి పండుగ మూడురోజుల్లో మొదటి రోజు భోగభాగ్యాలనిచ్చే భోగి, సంబరాలు చేసుకొనే సంక్రాంతి, పశువులను పూజించే కనుమ ఇలా మూడురోజులు అత్యంత సంతోషదాయకం జరుపుకొనే పర్వమే సంక్రాంతి.
పుష్యమాసంలో వచ్చేసంక్రాంతి పండుగ ప్రారంభానికి ఒక నెల ముందు నుంచే పండుగ శోభ మొదలౌతుంది. ధనుర్మాసం ప్రారంభంలోనే వేడుకలు, సంబరాలు ప్రారంభమవుతాయి. తెలుగు ముంగిళ్లు రంగు రంగుల రంగవల్లులతో కళకళలాడుతూ ఉంటాయి. ముద్దులొలికే ముగ్గుల్లోనే సంక్రాంతి శోభ కాంతులీనుతుంది. ఈ రంగవల్లుల మధ్య గోమయంతో గొబ్బిళ్లను చేసి వాటిని గుమ్మడి,బంతి, చామంతి వంటి పూలతో అలంకరించి పసుపుకుంకుమలతో గౌరమ్మగా పూజించి పెడతారు. కనె్నపిల్లలంతా వాటి చుట్టూ తిరుగుతూ గొబ్బిపాటలను పాడుతారు. సంధ్య గొబ్బెళ్లనూ చాలామంది పెడతారు.
గొబ్బి అనే మాట గర్భా అనే మాట నుంచి ఉద్భవించిందని డాక్టర్ తూమాటి దోణప్ప, డాక్టర్ బిరుదురాజు రామరాజు వంటి జానపద పరిశోధకులు చెప్పారు.ఈ గొబ్బిపాటలు తెలుగింటి సంస్కృతి సంప్రదాయాలను చాటుతుంటాయి. గొబ్బిపాటల్లో ఎక్కువగా గోవిందుని గురించిన పురాణ కథలు ఉంటాయ. వాటితోపాటుగా సామాజిక దృక్పథం ఉంటుంది. సమాజంలోని రకరకాలైన వ్యక్తుల మనస్తత్వాలను పట్టిచూపుతాయి. కొందరిలో కరుడుగట్టిన మూఢాచారాలవ్ఢ్యౌన్నీ బయటపెడతాయి. మనుష్యుల మధ్య ఉండాల్సిన సంబంధబాంధవ్యాల విలువలను చెబుతాయి. అత్తకోడళ్లు, మామాఅల్లుళ్లు, అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లు వియ్యపురాళ్ల పరువులు పట్టుదలలు ఇలా ఎన్నో విషయాలు ఈ గొబ్బిపాటల్లో చురుకుపుట్టించే విధంగా తేటతెల్లం అవుతాయ.
గోమయపు విశిష్టతలు గోసంరక్షణను తెలిపే పాటలూ ఉన్నాయి. గోమయంతో చేసే గొబ్బిని గౌరీదేవిగా భావిస్తారు. అందుకే గొబ్బెమ్మగా గౌరవిస్తూ పసుపుకుంకుమలతో పూజించి సంక్రాంతివరకు ప్రతిరోజు పెట్టి ముక్కనుమ తరువాత ఏటిలో గొబ్బెమ్మలను వాలాడిస్తారు. అంటే గౌరీదేవిని అత్తగారింటికి సాగనంపుతారు. అపుడూ అనుబంధాల్లో ఉండాల్సిన అప్యాయతానురాగాలను ఈపాటలు చూపుతాయి. కొత్తకోడలు అత్తవారింటి వస్తూ కోటి ఆశలేకాక బాధ్యతలబరువునూ మోయడానికి తయారై వస్తుందన్న సంగతిని తెలుపుతాయ.
సుబ్బీ గొబ్బెమ్మా సుఖములీయవే
చామంతి పువ్వంటి చెల్లిల్నియ్యవే
తామర పువ్వంటి తమ్ముడ్నీయ్యవే
మొగలీ పువ్వంటీ మొగుడ్నియ్యవే అంటూ సాగే గొబ్బి పాట కనె్న పిల్లల కోరికలను, వారి భవిష్యత్తు జీవితాన్ని కళ్లకు కట్టిస్తుంది. పుట్టినిల్లు, మెట్టినిళ్ల సౌభాగ్యాన్ని కోరుకునే ఆడపడచుల మనసును తెలియపరుస్తుంది.
ఎక్కవగా గొబ్బిపాటల్లో కృష్ణకథ విశేషంగా కనిపిస్తుంది. గొబ్బిపాటల్లో పౌరాణికతకు అద్దం పట్టే పాటలు అనేకం కనిపిస్తాయి. వీటిల్లో గోదాదేవి పాశురాల్లోని విషయమూ దోబూచులాడుతుంది. సాయంవేళ, పొద్దున పూట కనె్నపిల్లలంతా గొబ్బెళ్ల చుట్టూ గొబ్బియల్లో గొబ్బియలు అని పాడుతూ వలయాకారంలో తిరుగుతారు. ఈపాటల్లో ముఖ్యంగా ‘‘గొబ్బియల్లో రాగాకు రాసేటి రాజుకోడలు..’’.అనే పాట రాయలసీమ ప్రాంతంలో బహుళ ప్రచారంలోని పాట. గాజలు అమ్ముకునే వ్యాపారి కంచికి వెళ్లి గాజులు తెచ్చి వీధుల్లో అమ్ముతుంటే మహిళలంతా చేరి గాజులు గాజుల మలారం నుంచి తీసి ధరింప చేసుకొంటూ కంచి కామాక్షమ్మ గురించి అడిగి తెలుసుకోవడమే ఈ గొబ్బిపాటలోని ఇతివృత్తంగా కనిపిస్తుంది.
గంగమ్మ గౌరమ్మ అప్పసెల్లెండ్రూ .. గొబ్బియళ్లో ..
ఒక తల్లి బిడ్డలకు వైరమూ లేదు.. గొబ్బియళ్లో
మంచి మంచి పూలేరి రాసులు పోసిరి...గొబ్బియళ్లో ...
అనే పాట ఎటువంటి వైరాలు వైషమ్యాలు లేకుండా కలిసి మెలిసి జీవనం సాగించాలనే ధర్మాన్ని బోధిస్తుంది.
గొబ్బియల్లో కంచికి పోయేటి గాజులశెట్టి
గొబ్బియల్లో...
గొబ్బయళ్ళో గొబ్బియని పాడరమ్మ
కంచి వరదరాజునే గొబ్బియళ్లో
గొబ్బియళ్లో అంచులంచురగుల మద
పంచవనె్న ముగ్గుల్లో గొబ్బియళ్లో... అనే పాటలో ముంగిట్లోని ముగ్గుల ప్రాముఖ్యాన్ని వాటికి దైవత్వాన్ని ఆపాదించడమూ కనిపిస్తుంది.
గొబ్బిపాటల్లో కథాగేయాల పొడ కూడా కనిపిస్తుంది. పంటపొల్లాల్లో ఈ కథాగేయ ఛాయలున్న గొబ్బిపాటలు ఎక్కువగా పాడుతారు.
చందమామ చందమామా నేల చందనుమామ గొబ్బిళ్ళో
చందమామా కూతురు నీలార కనె్నల్లు గొబ్బిళ్ళో
అని ప్రారంభమయ్యే ఈకథాగేయ గొబ్బిపాట కామన్న అనే వ్యక్తి. అక్క ఇంటికి వెడతాడు. అక్క కూతురి పట్ల ఆకర్షితుడై ఆమెను పట్టుకుంటాడు. ఆ వార్తఆమె అన్న భీమన్నకు చెప్తేఅతను మారు వేషంతో కామన్న దగ్గరకు రాగా, కామన్న కవ్విస్తూ మాట్లాడితే కోపం వచ్చిన భీమన్న కామన్నను వధిస్తే
అమ్మరావమ్మ మముగన్న తల్లో గొబ్బిళ్ళో
నీ ముద్దుతమ్మునకు పాటగట్టెమ్మ గొబ్బిళ్ళో
.....................
భీమన్న ఇంటి ముందర నెత్తుటి కాలువలె గొబ్బిళ్ళోఅంటూ సాగి ముగుస్తుంది గేయం
ముఖ్యంగా సంక్రాంతి సమయంలో గ్రామీణులు పాడుకునే ఈ గొబ్బిపాటలు ప్రముఖ వాగ్గేయకారును సైతం ఆకర్షించాయి. వారు రచించిన గేయాల్లో కూడా అవి చోటు చేసుకొన్నాయి. పదకవితా పితామహులు అయిన తాళ్లపాక అన్నమయ్య సైతం గొబ్బిపాట రాశారు. మృదుమధురమైన పదజాలంతో శ్రీకృష్ణుడు గోవర్థన గిరిని గొడుగా పట్టి గోవులను, గోపాలురను రక్షించడం, కంసుని వధించడం వంటి సాహసాలను వివరించడమే కాకుండా ఏడుకొండలపై కొలువైన శ్రీవేంకటేశ్వరుడిని కూడా ఈ పాటల్లో అన్నమయ్య కీర్తించారు.
కొలని దోపరికి గొబ్బిళ్లో యదు
కులస్వామికిని గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన
కొండుక శిశువుకు గొబ్బిళ్లో
...
వెండి బైడి యగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో
సంస్కృతిసంప్రదాయాలను విడమర్చి చెప్తూసామాజికబాధ్యతనుగుర్తుచేసే ఈపాటలను రక్షించుకోవడం, భావితరాలకు అందివ్వడం మన ందరిబాధ్యత.

-ఐ.ఎల్. ఎన్. చంద్రశేఖర్ రావు 9491946070