Others

అక్షరం ఎపుడూ అసమూహమే !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరి గమ్యం ఒక్కటే
అక్షరంగా మొదలెట్టి
ఇతిహాసంగా ఎదిగిపోవాలని
వాళ్లంతా నీళ్లను, నక్షత్రాలను, నేలను చూపిస్తారు
బిందువు సింధువుగా -విత్తనం మహా వృక్షంగా
మట్టి దేశాలుగా నక్షత్రం గెలాక్సీలుగా మారిన వైనాన్ని వర్ణిస్తారు
అలెగ్జాండర్, అశోకుడు, అక్బర్, అంబానీలను
బ్రిటన్ బిల్ గేట్స్, బిర్లా , బెజోస్ లనూ కీర్తిస్తారు
ఒక్క అడుగు కోటి అడుగుల తోడు తెచ్చినందుకు హర్షిస్తారు
మేధావులు తమ వాదాన్ని సమర్ధించేవారు పెరగాలని
కవులు తమ కార్యధోరణిలో అనుచరులు చేరాలని
జ్ఞానలు తమకు తెల్పిన సత్యం లోకంలో చెలామణీ కావాలని
ఆస్తికులు దైవవిశ్వాసం లోకాన్ని ఏలాలని
నాస్తికులు పదార్థత్వం ప్రపంచాన్ని శాసించాలని
ఒక్కొక్కరిది ఒక్కో సామాజిక చిహ్నం
ఒక్కోసామూసిక స్వప్నం
నా అంతర్లోకమూ
నేను మాత్రం ప్రత్యేకం
అందరితో కలుస్తాను - నన్ను నేను వదులుకోను
అన్నింటితో చరిస్తాను నన్ను నేను పోగొట్టుకోను
అన్నింటినీ ధరిస్తాను నన్ను నేను కోల్పోను
అన్నింటినీ భరిస్తాను నాలో నేను జీవిస్తాను
అన్నింటినీ వరిస్తాను నాతో నేను బ్రతుకుతాను
అక్షరంగా మొదలై అక్షరంగానే ఎదిగి
అక్షరంగానే అదృశ్యం అవుతాను
నా అంతరంగమూ
మరో అక్షరంతో కలిసి పదం కాలేను
నేను ఒంటరిని
వాక్యంగానో, కావ్యంగానో విస్తరించలేను
నేను ఏకాకిని
ఇతిహాసంగా అస్సలు రూపు మార్చుకోలేను
నేను ఏకాక్షరాన్ని
ఇది నేను నిరంతర అశాంతిని
ఇదే నేను నిత్య అసమూహాన్ని

- మామిడి హరికృష్ణ, 9908844222