Others

వచ్చిందీ పండుగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చిందీ పండుగ
అన్నీ ఉన్నాయి అన్నీ కానీ
ఏదో వెలితి యెదలో
పోదీ భావన మదినుండి
గడి గడియకూ
గతం తాలూకు తలుపులు
పంట చేనుల్లో పచ్చదనం
మనిషి మనస్సులో పసితనం
అనుభవాల అనుభూతుల వెచ్చదనం
నాటినాటికీ నీటి పాలవుతూ
కాలెండర్‌లో
ఎర్రటి అంకెలు గుర్తు చేయాలీ
పండుగ ఈరోజే సుమా అంటూ
ఉత్సాహం ఉబలాటం
కాలంతో బాటు కరిగిపోయింది
చేసుకోకపోతే అయ్యో
అంటూ ఏదో కానిస్తున్నాం
చేలలో ధాన్యలక్ష్మికి కొదవు
ఇంట ధనలక్ష్మికి కొదవు
పిండి వంటకు ఓర్పు కొదవు
పట్నవాసపు పిల్లలకు శలవు కొదవు
రెడిమేడ్ షాపులొచ్చాక దర్జీకి గిరాకీ కొదవు
స్వగృహ మిఠాయి బండారులొచ్చాక
బామ్మల లడ్డు తినేవారు కొదవు
సమ్ క్రాంతే తప్ప సంక్రాంతి కొదవు
సమ్ తృప్తే తప్ప సంతృప్తికి కొదవు
మార్పు ఆశిస్తే మార్పుకూ కొదవు
బాధపడాలి అంటే సమయానికి కొదవు
అయినా ..
ఆశకు మాత్రం లేదు కొదవు
అందుకే ఎఱ్ఱబస్సులు, పచ్చబస్సులు
అన్నీ కిక్కిరిసిన జనంతో
కికకికలు పకపకలూ
మరి ఇంతేగా సమ్‌క్రాంతి సంక్రాంతి..

షేక్ జానేద్ అహమద్ 9885242006