Others

సంప్రదాయాలకు దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణమే సంబురాల సంక్రాంతి. ఈ ఫండుగ ఆ బాల గోపాలాన్ని అలరిస్తుంది. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించినపుడు వచ్చేదే మకర సంక్రాంతి. దీనికి ముందురోజు భోగి, మధ్యన సంక్రాంతి, ఈ పండుగకు వెనుక రోజు కనుమ, ఆ తరువాతిరోజు ముక్కనుమగా నాలుగు రోజులు జరుపుకుంటారు. భోగిమంటల కోసం కుర్రకారు హుషారుగా బయలుదేరి ‘ఇచ్చినమ్మకు పుణ్యం ఇవ్వనమ్మకు పాపం’ అంటూ ఇంటింటికీ తిరిగి, పాత సామాన్లు, కలప, పిడకలు వగైరా సేకరించి పోటా పోటీగా వీధుల్లో భోగి మంటలు వేస్తారు. భోగి మంటల కాంతిలో పల్లెలు నూతన ‘క్రాంతి’ని సంతరించుకుంటాయి.
మేడలకు మిద్దెలకు రకరకాల రంగులు వేస్తారు. పేడతో అలికిన పూరిపాకల మట్టిగోడల చుట్టూ తెల్లని చుక్కల బొట్లు పెడతారు. పల్లెపడుచులు తెల్లవారముందే, మంచు తెర వీడకముందే మేల్కొని ఇంటి వాకిళ్ళ ముందు కళ్ళాపి జల్లి, ముత్యాల ముగ్గులు వాటిపై గొబ్బెమ్మలు పెడతారు. గుమ్మాలకు మామిడి తోరణాలు, పూలమాలలు కట్టి సంక్రాంతి లక్ష్మికి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతారు. పట్టణాల్లోను ఇంటి వాకిటకు మామిడి, బంతి తోరణాలు కట్టి వాకిట రంగు రంగుల ముగ్గులను తీరుస్తారు. ముగ్గుల మధ్యలో గౌరీదేవిగా గొబ్బెమ్మలను తీరుస్తారు. పిల్లలంతా లింగభేదం లేకుండా గాలి పటాలను ఎగుర వేయడం, వాటిని చూడడంలో ఆనందం అను భవిస్తారు. ఈ సంక్రాంతినాడు శ్రీమద్భగవద్గీత పఠనం, గంగాస్నానం, త్రికాల గాయత్రి సంధ్యావందనం, గోవిందనామ స్మరణం వంటి నాలుగు విధులను ఆచరిస్తే పునర్జన్మ వుండదని శాస్త్రం చెప్తోంది. దేవ, రుషి, భూత, మనుష్య అనే పంచ రుణాల నుండి జప, తప, ధ్యానాధి ఆధ్యాత్మిక సాధనలు, పురాణ పఠనాదులు, దాన ధర్మాలు మొదలైన సత్కర్మల ద్వారా విముక్తి లభింపజేసే శక్తి సంక్రాంతికి అధికంగా ఉందని నిర్ణయసింధు, ధర్మసింధువులు చెప్తున్నాయ. ఈ రోజున స్నాన, దాన, జపాదులు, పితృదేవతలకు చేసే తర్పణాలు విశేష ఫలాన్నిస్తాయి. ఈరోజున చేసే గోసేవ అటు పితృలోకాన్ని, ఇటుఈలోకంలో ఉన్నవారిని తరింపచేస్తుంది.
బూడిదగుమ్మడికాయను దానంచేసిన వారికి భూదానం చేసిన ఫలం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయ. పెరుగును దానం చేయడం వల్ల అనారోగ్యబాధలు తీరుతాయ. బుద్ధివికాసం కలుగుతుంది. ఈరోజున కూష్మాండం, కంబళి, ధాన్యాదులు, లోహాలు, తిలలు, వస్త్రాలు, తైలదీపదానాలు చేస్తే మంచిదని శాస్త్ర వచనం.
హరిదాసులు, నుదుటిపై విభూతి కట్లు దిద్దుకొని, గణ గణ గంట మోగిస్తూ శంఖమూదుతూ జంగమదేవర పరమాత్మ ప్రత్యక్షరూపాలుగా ప్రతిఇంటికీ వస్తారు. బుడబుక్కల వాళ్ళు వారి వారి కళలను ప్రదర్శించి, ఇంటి యజమానులిచ్చే కానుకలు అందుకొని వారిని దీవిస్తారు. ఇలా కర్మచారులంతా వారి వారి కళలను, వృత్తి నైపుణ్యా లను ప్రదర్శించి సంబారాలను అందుకునే రోజు సంక్రాంతి. మహిళలంతా ఇంటిల్లిపాదికి, బంధువులకు, స్నేహితులకు నోరు తీపు చేయాలని పండుగ సంతోషాన్ని పంచాలని పాలు పొంగించి పొంగలి తయారుచేస్తారు. పాల తాలికలు, బొబ్బట్లు, అరిసె జంతికలు, పాయసం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి అందరికీ పంచి, వారు తిని ఆ ఈ పండుగ ఆనందాన్ని ఆస్వాదిస్తారు.. సంక్రాంతి మరునాడు జరుపుకునే పండుగ కనుమ. వ్యవసాయ పనిముట్లను, ఎడ్లబండ్లను రంగులతో అందంగా ముస్తాబు చేస్తారు. వ్యవసాయ పనిమట్లను, ఎడ్లబండ్లను రంగులతో అందంగా ముస్తాబు చేస్తారు.
వ్యవసాయంలో తమకు చేదోడుగా ఉండే ఎడ్ల మెడలలో కొత్తదండలు వేసి జేగంటలు తగిలిస్తారు. పచ్చగడ్డి, తెలకపిండి, అరటిపళ్ళు నైవేద్యంగా తినిపిస్తారు. కనుమ తరువాతి రోజైన ముక్కనుమను నాడు కూడా పశువులను అలంకరించి మేళ తాళాలతో ఊరేగిస్తారు. ముగ్గులు నిండిన ఇంటివాకిళ్లు, గాదెలలో నిండిన ధ్యానపు రాశులతో ఉండే సంక్రాంతి అందరికీ సంతోషదాయకమైన పండుగ.

- వాణి ప్రభాకరి