Others

పౌష్యలక్ష్మికి స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. ముగంగిళ్ల ముత్యాల ముగ్గుల పందిళ్లు
ముదితల హాసాలు మురువు సూప
చామంతి బంతు సరస సల్లాపాలు
డబుడక్క మ్రోతలు డాబుఁ జూప
భుగభుగ మండేటి భోగిమంటలలోనఁ
జీడపీడలు కాలి బూడిదనగ
చిడతలఁ జేఁ బట్టి చిందులాడెడి హరి
దాసులాగమనంబు దాదిఁ జూప
హేమంతమందున శ్రీమంతురాలైన
పౌష్యలక్ష్మియు రాక పండుగనగ

తే.గీ. తెలుగువారలు చైతన్య దీప్తితోడ
నీకు సుస్వాగతముఁ బలక్క నిలిచివలచి
ధాన్య ధనరాశులనుఁ గూర్చు దండి తల్లి
వమ్మ సంక్రాంతి లక్ష్మమ్మ వడిగ రావె

భావోం: ఓ సంక్రాంతి లక్ష్మీ స్వాగతం. సుస్వాగతం. నీకోసమై భోగిమంటలు వేస్తున్నాం. ఇంటి ముంగిట రంగు రంగుల ముగ్గులను తీర్చిదిద్దాం. వాటిమధ్యలో నీరూపుగా గొబ్బెమ్మను నెల కొల్పాం. చిడతల పట్టుకుని హరిలోరంగ హరి అంటూ వచ్చే నారాయణమూర్తులకు నీ విచ్చిన ధనధాన్యాదులనిచ్చి గౌరవించాం. తెలుగు వారిలో చైతన్యదీప్తినితీసుకొచ్చే ఓ పౌష్యలక్ష్మీ రావమ్మ. ఘనస్వాగతం నీకు.

- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం