Others

జూలు పెంచిన ఆడ సింహాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అడవికి రాజు సింహం’ అన్న మాటకి నూకలు నిండుతున్నాయి అనిపిస్తోంది. ఆఫ్రికా- బోత్సవానా జంతు ప్రదర్శనశాలలోని ఐదు ఆడ సింహాలు (సివంగి) బ్రహ్మాండంగా జూలు పెంచుతున్నాయి ‘‘అడవికి రాణిని నేనే!’’ అన్నట్లుగా. ఒక ఆడసింహం జూలు విదిలించింది, గర్జించింది. వీటిలో ఒకటి మరీ బ్రహ్మాండంగా గర్జించి, అన్నీ మగవేషాలు వేస్తూంటే దానితోపాటు మరో నాలుగు ఆడసింహాలు కూడా మగసిరిని పెంచేసుకుని- ‘మగవాసన’ కొట్టుకుంటూ, మిగతా ఆడసింహాలవైపు శృంగార చేష్టా విలాసాదులు ప్రదర్శిస్తున్నాయిట! అయితే యివి ఆడసింహాల మీద కనే్నసినట్లే- వీటి మీద జంతు శాస్త్ర ప్రావీణ్యతగల శాస్తజ్ఞ్రులు నిఘా వేసి- 2014 నుంచీ పరిశోధనలు చేస్తున్నారు.
బ్రిటిష్ సైంటిస్ట్ ‘జియోఫ్రీగిల్ ఫెల్లాగ్’ అనే ఆయన ఆధ్వర్యంలో ఒక ‘ఆడ మగ’ సింహానికి- ‘సాఫ్ జీరోఫైవ్’ అనే సంకేత నామం పెట్టి స్టడీ చేస్తున్నారు.
‘‘దాందుంపదెగ- అది, ఆడ, మగ సింహాల్ని రెండిటినీ కూడా ఒకేలాగా కన్నుగీటి వెంటాడుతూంది’’. పురుషాండాశ్రయం (టెస్టికిల్స్)లో వుండే లక్షణాలన్నీ రుూ ఆడ మగ సింహం చూపెడుతోంది.
దీనికి టెస్టోస్టిరాన్ అనే హార్మోను జాస్తీగా ఊరుతోంది. ఈ సింహం ఒక జీబ్రాని కొట్టి తెచ్చుకుంది. దీంతో ఉగ్రమై, అచ్చం మగ సింహంలాగా గర్జించి- పాపం! ఆ ఆడ సింహం కన్న పిల్లల్లో రెండింటిని చంపేసిందిట యిది. దీంతో జూ అధికారులు హడలి ఛస్తున్నారుట. దీనే్న అంటారు ‘జంతుకోటిలో మానవ లక్షణాలు’ అని.

-వీరాజీ