Others

ఇంతవాడు.. అంతై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి రోజున వామన చరిత్ర, రాముని చరిత్ర స్మరించడం వల్ల దానాది గుణాలు, ధర్మం పట్ల దీక్షా పట్టు దలలు కలుగుతాయని పెద్దలంతా ఈ రెండింటిని వినడానికి ఆసక్తి చూపుతారు.
బలిచక్రవర్తి భక్తప్రహ్లాదుని మనుమడు. గొప్ప విష్ణ్భుక్తుడు. ధార్మికుడు. పైగా దాత. ఇంద్రుని కారణంగా అవమానించబడిన బలి, శుక్రాచార్యుని సహాయంతో తిరుగులేని వైభవాన్ని గెలుచుకున్నాడు. బలి పరాక్రమం వల్ల దేవేంద్రుడు పదవీభ్రష్టుడై అయ పోయాడు. అడవుల పాలయ్యాడు. దేవతలందరికీ వారి వారి స్థితిగతులన్నీ మారి పోయాయ. దేవేంద్రవైభోగాలను అనుభవించాల్సిన వారంతా పరాయ పంచల పట్టుకు తిరుగుతున్నారు. వారు ఈ దుస్థితిని సహించలేక శ్రీ మహావిష్ణువును ప్రార్థిం చారు. ఆయన వారికి అభయం ఇచ్చాడు. మీకు శుభకాలం వస్తుందని పలికాడు.
బ్రాహ్మణులను, దేవతలను, సన్మార్గులను రక్షించడానికై శ్రీమహావిష్ణువు అదితిగర్భాన జన్మించాడు. ఆ శిశువుకు కశ్యప ప్రజాపతి మహర్షి మండల సముదాయంతో సముచితోపనయన కర్మలు శాస్తవ్రిధిన జరిపించాడు. సవిత్ర సావిత్రిని ఉపదేశించగా బృహస్పతి యజ్ఞోపవీత ధారణ చేస్తాడు. కశ్యపుడుముంజియను, అదితి కౌపీనమును, ధరణి కృష్ణాజనయిను, సోముడు దండంబును, గగనాధిష్టాన దేవత చత్రంబును, కమండలమును బ్రహ్మదేవుడు, సరస్వతి యక్షమాలికను ఇవ్వగా కుబేరుడు భిక్షాపాత్రను అందించాడు. అక్షయమగు గాక అని పూర్ణ్భిక్షను పార్వతీ దేవి ప్రసాదించింది. ఈ విధంగా వామనునికి ఉపనయన సంస్కారం జరిగింది. అపుడు దేవతలంతా కలసి వారికి వచ్చిన కష్టాన్ని వామనుడికి చెప్పుకున్నారు. వారికి ఆయన అభయం ఇచ్చాడు. బలి చక్రవర్తి వైభవం గురించి కూడా చెప్పారు. మహావిష్ణువు భక్తుడైన బలిచక్రవర్తిని గురించి ఇంకా వామనుడికి దేవతలు చెప్పలా? వామనావతారుడైన మహావిష్ణువు దేవతలు చెప్పేదంతా విని చిరునవ్వు నవ్వాడు.
ఆ తరువాత భక్తజనోద్ధరణకు ఆడిన మాట నిలుపుకునేందుకు లక్ష్మీపతి అయిన వామనుడు బలిచక్రవర్తి వద్దకు దానం అడగడానికి బయలుదేరాడు. బలి సాధారణంగా వామనుని ఆహ్వానించి అతని వృత్తాంతం తెలుపమని కోరాడు. బలి తాను ఎవరి బిడ్డడినో చెప్పాడు.బలిని చూసిన శుక్రాచార్యుడు మహావిష్ణువే ఈ రూపంలో బలిని నిర్జించడానికి వచ్చాడని తెలుసుకొన్నాడు. వెంటనే తన శిష్యుడిని అప్రమత్తం చేయాలని అనుకొన్నాడు.
అంతలో బలి చక్రవర్తి వామనుడిని ఏం కావాలో కోరుకొమ్మని అడిగాడు. సుజనుల హృదయమే నా నివాసమ్మని వామనుడు బదులిచ్చి, బలినుద్దేశించి మీ వంశం వాళ్లందరూ పుణ్యచరిత్రులు. మీ తాత ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు. నీ దానగుణ శీలతను గురించి విని మూడడుగుల నేల కోసం వచ్చానని అంటాడు. అందుకు బలి వెంటనే అంగీకరిస్తూ ఇంత చిన్న కోరికను కోరావేమిటంటూ ఆశ్చర్యపడుతాడు. అపుడు శుక్రాచార్యులు వచ్చింది వామనుడు వటువు కాదని మహావిష్ణువు అని అతనికి దానం ఇవ్వద్దు అని చెప్పాడు. గురువు చెప్పినా అఖిలాండ కోటి నాయకుడు, చరాచర సృష్టికి కారణభూతుడు అయన శ్రీమన్నారాయణుడే నా దగ్గరకు వచ్చి చేయ చాచి దానం అడిగితే ఎందుకు ఇవ్వకూడదని అనుకొన్నాడు. అదే మాట తన గురువు కు చెప్పాడు. మూడు అడుగులే ఎందుకు అని అడిగిన బలితో వామనుడు - పేరాశలేక దుఃఖపడక లభించినదానితో తృప్తినొందనివాడు, సప్తద్వీపములనిచ్చినా తృప్తిపడడు అని తనకు మూడడుగుల నేల స్థలం చాలునని వామనుడు బలికి చెప్పాడు. అది విని బలి చక్రవర్తి ఎంతో సంతోషించాడు.
ఇక దానమివ్వటానికి సిద్ధపడిన బలి చక్రవర్తికి, శుక్రాచార్యుడు మళ్లీ అడ్డుపడ్డాడు. ఈ బాలుడు పేదవాడు కాదని ఇతను శ్రీహరి అయి వుంటాడనీ, మూడడుగుల స్థలంతో నిన్ను పూర్తిగా అణగదొక్కేస్తాడనడంలో అతిశయం లేదు కనుక నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ దానమివ్వవద్దని హెచ్చరించాడు శుక్రాచార్యుడు. కాని ఇస్తానని మాట తప్పితే నరకానికిపోతాననీ ఆడిన మాట తప్పితే చచ్చినవానితో సమానమని బలి బదులిచ్చాడు. ఎన్నో విధాలుగా శుక్రాచార్యునికి నచ్చచెప్పి వామనునికి దానమిచ్చేందుకే బలి సిద్ధపడ్డాడు.
బలి చక్రవర్తి భార్య వింధ్యావళి బంగారు కలశంతో పవిత్ర జలాన్ని ఇవ్వగా, బలి, నారాయణుని పాదాలను కడుగుతాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణురూపాయ వేద ప్రామాణ్య విధేత్రి పాదదరణించాస్యాయి అని బలి చక్రవర్తి వామనునకు మూడడుగులనేల భూమిని దానమిస్తాడు. ఎలాగైనా ఈ హరినుంచి తన శిష్యుడిని కాపాడుకోవాలని దానమిచ్చు సమయంలో నీటిధారకు అడ్డుపడిన శుక్రాచార్యుని వామన మూర్తి దర్భతో కంటిలో గుచ్చుతాడు. శుక్రాచార్యుని ప్రయత్నం విఫలమైంది. వామన మూర్తి ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపై ... అన్నట్టు గా పెరిగి ఒక అడగు ధరణిని, మరొక అడుగు గగనతలాన్ని ఆక్రమించాడు. అపుడు ఒక పదము కింద పద్మమున నంటికొన్న పంకలనము కొమరుదాల్చె... అంటే పద్మానికి అంటిన పంకిలం వలె భూమండలం కనిపించిందట. అట్లా ఆక్రమించిన వామనుడు బలిని ఉద్దేశించి మూడవ అడుగు కోసం స్థలం చూపమనగా బలిచక్రవర్తి వినయంతో తల వంచుతాడు.
ఆ సమయంలో దేవతలతో పాటు అక్కడికి భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదుడు కూడా వచ్చాడు. బలి చక్రవర్తి పరమసంతోషంగా వామనునికి అర్పించిన సంపదను చూసి ఆనందించి ఇతడు నా మనుమడు కదా అనుకొన్నాడు. తనకున్నదంతా నిర్మలమనస్సుతో దానమిచ్చిన బలిచక్రవర్తితో వామనుడు ఇలా చెప్పాడు. నేను ఎవరినైతే కరుణించదల్చుకొన్నానో వాని సంపదనంతా ముందుగా హరించి వేస్తాను. కనుక ఇపుడు నీ సంపదను నేను గైకొన్నాను. నేను నిన్ను సావర్ణి మనువుకాలంలో దేవతలకు అధిపతిని దేవేంద్రుడిని చేస్తాను. నిన్ను నేనే కాపాడుకుంటూ ఉంటాను.
ఆ వామనావతార మాటలకు వింధ్యావళి, బలి ఎంతో సంతోషించారు. వామనుని ఆజ్ఞ మేరకు తన పరివారంతో పాటు సుతల లోకానికి బలి చక్రవర్తి వెళ్లాడు.
ఏ దానం ఇచ్చినా అది పరమాత్మునికే చెందుతుంది. వస్తువును కల్పించింది పరమాత్మనే తిరిగి తీసుకొనేది పరమాత్మే కనుక మనమూభగవంతుని సృష్టిలోని వారిమే అని, ఆ పరమాత్మునిలోని అంశలమేనని తెలుసుకొని భౌతిక సంపదకు మిడిసి పడక ఆధ్యాత్మిక సంపదను సంపాదించడానికి ముందుకు వెళ్లాలని ఈ వామన చరిత్ర చెబుతుంది.

- కూచి బొట్ల వెంకటలక్ష్మి