Others

ఆబాలగోపాలానికి ఆనందహేల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌరమానం అనుసరించి తెలుగువారు జరుపుకునే పండుగ సంక్రాంతి. దసరా, దీపావళి సరదాలకు పరాకాష్ట. ఆనంద సంరంభంతోపాటు, ఆధ్యాత్మికత, సంస్కృతీ సంప్రదాయాలు వెల్లివిరిసే పండుగ. భారతీయులందరూ జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఖగోళ శాస్తర్రీత్యా సూర్యుడు ఒక రాశినుంచి మరొక రాశిలోనికి ప్రవేశించడం సంక్రమణం అంటారు. సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోనికి ప్రవేశించడం మకర సంక్రమణం. దీనినే 3మకర సంక్రాంతిగా వ్యవహరిస్తారు. ఈనాటి నుంచి సూర్యుడు భూభ్రమణం కారణంగా ఉత్తరాభిముఖుడై సంచరిస్తున్నట్లు కానవస్తాడు. ఈ సంక్రమణం ఎంతో పవిత్రమైనది. పుణ్యకాలంగా దేశీయులంతా భావిస్తారు. మూడు రోజులపాటు పండుగలు చేసుకుంటారు. ఇవి భోగి, మకర సంక్రాంతి, కనుమలు.
వాస్తవానికి మకర సంక్రాంతికి ముందు ముప్ఫైరోజులు తెలుగు లోగిళ్ళలో పండుగ వాతావరణం నెలకొంటుంది. సూర్యుడు ధనూరాశిలో ఉన్న ముప్ఫై రోజులు ధనుర్మాసంగా పరిగణిస్తారు. మకర సంక్రాంతికి నాంది ధనుర్మాసం. ఈ నెల రోజులు తెల్లవారు జామున నగర సంకీర్తనలతో ప్రజలను మేల్కొల్పుతూ భక్తిపారవశ్యంలో తరిస్తారు. మహిళలు, కనె్నపిల్లలు వేకువనే లేచి ఇంటి ముంగిట ఆవుపేడ నీళ్ళతో కళ్లాపి జల్లి రంగు రంగుల రంగవల్లికలతో ముంగిళ్ళు తీర్చిదిద్దుతారు. ముగ్గుల మధ్య పేడముద్దలు పెట్టి వాటికి పసుపు కుంకుమలు, బంతి, చామంతి, గుమ్మడి పూలతో అందంగా అలంకరిస్తారు. కనె్నపిల్లలు తప్పెటలు తరుస్తూ వలయాకారంలో గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ సంబురాలు తలపుకు తెస్తాయి. ఈ నెల రోజులు వేకువ జామునుంచే హరిలో రంగ హరీ అంటూ హరిదాసులు, గంగిరెద్దులు నాడించేవారు, శివుని కీర్తిస్తూ గంట వాయిస్తూ జంగమయ్యలు, పురాణ గీతాలు పాడుతూ బుడబుక్కులవారూ, వివిధ పౌరాణిక, ఇతిహాస ఘట్టాలను ప్రదర్శిస్తూ పగటి వేషధారులు ఆనందోత్సాహాలను అందిస్తారు. మూడు రోజుల సంక్రాంతి పర్వంలో మొదటి రోజు భోగి. ఈ రోజుతో దక్షిణాయనం ముగుస్తుంది. ధనుర్మాసంలో చివరి రోజు వేకువనే భోగి మంటలు ఇంటి ముంగిట వేస్తారు. ఇళ్ళల్లోని నిరుపయోగ వస్తువులను మంటలలో వేసి 3పీడ2 విరగడైందని ఆనందిస్తారు. నెల రోజులపాటు స్నానవ్రతం ఆచరించిన వైష్ణవ సంప్రదాయకులు వ్రత సమాప్తి చేస్తారు. వైష్ణవాలయాల్లో శ్రీరంగనాథ గోదాదేవిల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కనె్నపిల్లలు మూడు రోజులపాటు బొమ్మలకొలువులు పెట్టి బంధు మిత్రులను పిలిచి ఆనందంగా గడుపుతారు. ఆ సాయంత్రం చిన్నపిల్లలకు పెద్ద ముతె్తైదువులచే భోగిపళ్ళు పోసి పేరంటం చేస్తారు.
రెండవ రోజు ముఖ్యమైన పండుగ మకర సంక్రమణం. పుణ్యకాలం. పెద్దల పండుగగా దేశంలో అనేవారు. ఇప్పుడది సంక్రాంతిగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజంతా పెద్దలకు (గతించినవారికి) తర్పణాలు వదలడం, దానధర్మాలు, ముతె్తైదువులు పసుపు, కుంకుమ నోములు వంటివి చేస్తారు. కొత్త అల్లుళ్ళకు సత్కారాలు ఉంటాయి.
మూడవ రోజు కనుమ. ఇది పూర్తిగా వ్యవసాయదారులకు సంబంధించినది. సంక్రాంతి నాటికి పుష్కలంగా పంటలు ఇంటికి చేరి ఆనందంతో గడుపుతున్న కృషీవరులకు బాసటగా నిలిచిన గోసంతతికి, వ్యవసాయ కూలీలకు కృతజ్ఞత తెలియజేసే పండుగ. పశువుల కొట్టాలను శుభ్రపరిచి, ముగ్గులు పెట్టి పచ్చ తోరణాలతో అలంకరిస్తారు. పశువులను కడిగి, పసుపు కుంకుమలనద్ది, కొమ్ములకు రంగులు, మెడలో గంటలు అలంకరించి, కొత్త బియ్యంతో పొంగలి వండి, దేవుడికి నివేదించి గోసంతతికి బెల్లంతోపాటు తినిపిస్తారు. ఆ పొంగలిని తమ కల్లాలలో జల్లుతారు. వరికంకులను గుత్తులుగా కట్టి, ఇంటి వసరాలో కట్టి పిచ్చుకలు తినేలా ఏర్పాటుచేసి భూతదయను సాకారం చేస్తారు. నాల్గవ నాడు చాలా ప్రాంతాల్లో ముక్కనుమ పేరిట పండగ చేసుకుంటారు. ఈనాడు మాంసాహారులకు నిషిద్ధం లేదు.
ఇలా మూడు రోజుల సంక్రాంతి పర్వం తెలుగువారికి సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబిస్తూ ఆనందోత్సాహాలతో ముగింపుకు రావడం స్మృతి పథాలలో చిరకాలం వాసం చేస్తుంది.

-ఏ.సీతారామారావు