Others

మొక్కుబడులుగా సిమెంట్ బొమ్మలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆపద మొక్కులు, సంపద ముడుపులు’ అంటారు. వాంఛలు రుూడేరిన భక్తులు దేముళ్లకి రకరకాల- చిత్ర విచిత్ర రీతులో మొక్కులు చెల్లిస్తూంటారు.
పుదుచ్చేరికి పడమరగా కడలూరు జిల్లాలో తేనాం పాక్కమ్ గ్రామంలో గుబురు అడవిలో అయినార్ సామి గుడి వుంది. ప్రక్కనే అళగర్ సిద్ధార్ సాధువు మందిరం కూడా వుంది. ఈ అయినార్ సామి- శివ, నారాయణుల సంగమ సంతానంగా, గ్రామ దేవతగా ఆరాధింపబడుతున్నాడు. రాత్రి తెల్లార్లూ ‘అయినార్ సామి’ గుఱ్ఱంమీద ఎక్కి గ్రామంలో గస్తీ తిరుగుతాడనీ, భక్తుల కోరికలు తప్పక రుూడేరుస్తారనీ- అక్కడి వారి గొప్ప నమ్మకం.
సింగపూర్ అంతటి దూరం నుంచి వచ్చి, ఒక జంట మ్రొక్కు తీర్చుకున్నారు. వారికి సంతానం లేదు. హతాశులు అయిన దశలో అయినార్ సామి కనికరించాడు. అందుకని ఒక సిమెంటు పాపాయి బొమ్మని గుడి ప్రాంగణంలో సమర్పించుకున్నారు.
ఆ గుడి ప్రాంగణం నిండా వందల సంఖ్యలో నూతన దంపతుల సిమెంటు విగ్రహాలు, బొమ్మలూ వుంటాయి. ఎందుకంటే, అయినార్ సామికి సిమెంట్ విగ్రహాలు ఇష్టం. కంప్యూటర్లు, మోటారు సైకిళ్లు లాంటి వాటి బొమ్మలు, అక్కడే చేయించి మొక్కు చెల్లించుకుంటారు భక్తులు. వారానికో వెయ్యిమంది దాకా దూర దూర ప్రాంతాలనుంచి భక్తులు వస్తారు. పెళ్లికూతురూ, పెళ్లికొడుకూ వాళ్ల బొమ్మలను రంగు రంగులలో ముస్తాబు చేసి, మ్రొక్కుగా చెల్లిస్తారు. అవే ఎక్కువ.
ఇంక గుఱ్ఱం బొమ్మలకయితే లెక్కే లేదు. లాప్‌టాప్‌లు, మానిటర్లు, మవుసులూ కూడా సిమెంట్ బొమ్మల రూపంలో అక్కడ దేవుడు అందుకుంటాడు. మ్రొక్కును బట్టి సైనికుల బొమ్మలు, పోలీసు బొమ్మలు కూడా చేయగలడు శిల్పి. అజయ్‌కుమార్ చెప్పాడు- ‘‘అచ్చం మీ పోలికలుగల సిమెంట్ బొమ్మలయితే వారం పది రోజులు పడుతుంది. పైకం కూడా జాస్తీ అవుతుంది’’. గోపుర నిర్మాణంలో నిపుణుడు అయిన రుూ శిల్పి అజయ్‌కుమార్ ఆదాయం- అయనార్ సామి కృపవల్ల అపారం. కాగా- అయిదు తరాలుగా, యిక్కడ అర్చకుడుగా వున్న యస్.కుమార్ చెప్పినదానిని బట్టి, పూర్వం జంతు బలులుండేవి గానీ, కొంతకాలం క్రితం ఒక సాధువు అక్కడికొచ్చి, తపస్సు చేసుకుంటూ- భక్తులకు- ‘జంతు బలులకు బదులు సిమెంట్ స్వరూపాలు సమర్పించుకోమని’ ఆదేశించాడుట. వెంకన్నగారి హుండీలో వెండి, బంగారు రూపులు వేసినట్లు- యిక్కడ పెద్ద పెద్ద సిమెంటు స్వరూపాలే స్వామికి సమర్పిస్తారు భక్తులు. కోరికలు నెరవేరుతాయి కనుకనే- ఎటు చూస్తే అటు యిన్ని సిమెంటు బొమ్మలు దర్శనమిస్తాయి అని చెప్తారు భక్తులు!

-వీరాజీ