Others

అలా.. అన్నమాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాస్య రసాధిదేవతకు హారతి పళ్లెం పట్టిన హాస్య నట చక్రవర్తి -రేలంగి. వెకిలి చేష్టలు, వికృత సంభాషణలకు తావివ్వకుండా ఆరోగ్యకరమైన హాస్యాన్ని చక్కని టైమింగ్‌తో విందు భోజనంలా ప్రేక్షకులకు అందించిన నవ్వులరేడు. రేలంగి లేకపోతే తెలుగు సినిమా లేదన్నంత స్థాయికి చేరి పద్మశ్రీ అందుకున్న తొలి తెలుగు హాస్యనటుడు. సి పుల్లయ్య దర్శకత్వంలో ‘శ్రీకృష్ణతులాభారం’ (1935) ద్వారా పరిచయమైన రేలంగి కీలుగుర్రం (1949), గుణసుందరికథ (1949), షావుకారు (1950), సంసారం (1950), పాతాళభైరవి (1951), బ్రతుకుతెరువు (1953), చండీరాణి (1953) వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన తరువాత, ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీపై సి పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘పక్కింటి అమ్మాయి’ (1953)లో హీరో పాత్ర ధరించారు. ఆయన సరసన అంజలీదేవి నటించింది. హీరో సుబ్బారాయుడు పక్కింటి లీలను ఆకర్షించే ప్రయత్నంలో ‘గణగణ ఆకాశంలో గంటలు మ్రోగాయి’ అంటూ వెనుక ఎయం రాజా పాడుతుండగా తాను రాజా పాటకి పెదవులు కదిలిస్తూ అది తన పాటేనని భ్రమింపజేస్తూ చేసిన రేలంగి అభినయం అందరినీ తెగ నవ్విస్తుంది. ఈ రేలంగి మిత్రబృందంలో దర్శకులు సియస్ రావు కూడా కనిపిస్తారు. ‘పాషేర్‌బరి’ అనే బెంగాలీ చిత్రం ఆధారంగా ‘పక్కింటి అమ్మాయి’ నిర్మించారు. సంగీతం అశ్వత్థామ. ఈ చిత్రం ఆధారంగానే హిందీలో కిషోర్‌కుమార్, మెహమూద్‌లతో ‘పడోసన్’ తయారై విజయవంతమైంది. ఈ హిందీ చిత్రాన్ని అనుసరించి మార్పులు చేర్పులతో ఆ తర్వాత ‘పక్కింటి అమ్మాయి’ పేరుతోనే జయసుధ, చంద్రమోహన్‌లతో నాగార్జున ప్రొడక్షన్స్ కె వాసు దర్శకత్వంలో నిర్మించి విడుదల చేశారు. రేలంగి హీరోగా నటించిన రెండో చిత్రం ‘మామకుతగ్గ అల్లుడు’ (1960). రేలంగి సరసన సావిత్రి నటించింది. ‘సంతానం’ (1955) చిత్రంలో సావిత్రికి తండ్రిగా నటించిన రేలంగి, ఈ సినిమాలో సావిత్రికి కథానాయకుడిగా నటించడం విశేషం. ఆనాడు అగ్రనటిగా వెలుగొందుతున్న సావిత్రి, రేలంగిని హీరోగా ఒప్పుకోవటం ఆమె సంస్కారానికి నిదర్శనం. రేలంగి వేసిన ఆడ వేషం, డైలాగులు చిత్రానికి హైలైట్. ‘మనసు వుయ్యాలలూగె’, ‘సోగ్గాడా సోగ్గాడా’ అనే డ్యూయెట్లలో రేలంగి, సావిత్రిల నటన అందరినీ అలరించింది. ‘నాణెమైన చినవాడా చూడరా నా సొగసు’ పాట పాపులరైంది. దర్శకుడు వేదాంతం రాఘవయ్య. రచన సదాశివబ్రహ్మం. సంగీత దర్శకుడు యంయస్ ప్రకాష్. అంతగా వెలుగులోకి రాకపోయినా మంచి సంగీతాన్నందించడం విశేషం.

-పూజారి నారాయణ