Others

అలా.. అన్నమాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో తొలి సోషియో ఫాంటసీ చిత్రం ‘దేవాంతకుడు’ (1960). ‘జుమాలయే జీచంతో మానుష్’ అనే బెంగాలీ కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. భార్గవి బ్యానర్ మీద సి పుల్లయ్య స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రమిది. పురాణ పురుషులు భూమిమీద సంచరించడం తెరపై చూసి తెలుగు ప్రేక్షకులు ఒక కొత్త అనుభూతికి లోనయ్యారు.
హీరో సుందర్ పాత్రలో యన్‌టిఆర్ హుషారుగా నటించాడు. ఆయన సరసన కృష్ణకుమారి నటించింది. యమధర్మరాజుగా యస్‌వి రంగారావు, చిత్రగుప్తునిగా వంగర నటించారు. విష్ణువుగా కాంతారావు, నారదునిగా రఘురామయ్య కొద్దిసేపు కనిపిస్తారు. రఘురామయ్య పాడిన ‘శ్రీతజనపాలా’ పాట అమోఘం. పిబి శ్రీనివాస్ పాడిన ‘గోగోంగూర జైజై ఆంధ్ర’ చిత్రానికి హైలైట్. మాటలు సదాశివబ్రహ్మం. సంగీతం అశ్వత్థామ. మామూలుగా పౌరాణిక చిత్రాలు నిర్మించే సి పుల్లయ్య ఇటువంటి చిత్రాన్ని ఎన్నుకోవడం, హీరోగా యన్టీఆర్ పరిచయమైన తర్వాత ఆయనతోనే తదుపరి చిత్రాలు సి పుల్లయ్య నిర్మించడం విశేషం. చిత్రం శత దినోత్సవాలు జరుపుకుంది. ఈ చిత్రం ఇన్‌స్పిరేషన్‌తో తదుపరి యమగోల, యమలీల, యముడికి మొగుడు వంటి సోషియో ఫాంటసీ చిత్రాలు నిర్మాణమైనాయి.

-పూజారి నారాయణ