Others

దేవీశ్రీకి సుక్కూ టాస్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటలతోనే సినిమాను సక్సెస్‌వైపు నడిపించగల సత్తా -దేవీశ్రీ ప్రసాద్‌ది. గతంలో ఎన్నో సినిమాలకు -్ఫల్ ఆల్బమ్ హిట్టు రిక్డార్డునిచ్చి ప్రాజెక్టులను సక్సెస్‌వైపు నడిపించాడు. అలాంటి దేవిశ్రీ నుంచి ఇటీవలి కాలంలో చర్చించుకోతగినంత గొప్ప ఆల్బమ్స్ ఏమీ రాలేదు. ఎలాంటి మ్యాజిక్‌లేని రొటీన్ మ్యూజిక్ ఇస్తున్నాడన్న అపవాదు ఎదుర్కొంటున్నాడు దేవిశ్రీ. గత ఏడాది సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ చిత్రాన్ని మాత్రం ప్రత్యేకంగా చూడాలి. పల్లె వాతావరణంలో సాగే కంటెంట్‌కు తగిన బిజీఎం మాత్రమే కాదు, పాటలకీ చక్కటి బాణీలిచ్చి సినిమా విజయానికి తనవంతు ప్రయత్నం చేశాడు. ఇప్పుడు సుకుమార్ మరోసారి దేవిశ్రీని దగ్గర కూర్చోబెట్టుకుని -రంగస్థలాన్ని మించిన మ్యూజిక్ కోసం వర్కౌట్స్ చేయిస్తున్నాడట. సుకుమార్ ఇచ్చిన టాస్క్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి దేవిశ్రీ సైతం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. ఈ సీజన్ మొత్తం తమన్ మ్యూజిక్‌కు ఆడియన్స్ కనెక్టవుతుండటంతో -దేవిశ్రీలో పస తగ్గిందా? అన్న చర్చ లేకపోలేదు ప్రతిరోజూ పండగే కథకు సంగీత బలాన్ని జోడించిన తమన్, ప్రస్తుతం థియేటర్లలోవున్న అల.. వైకుంఠపురములో చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేసేశాడు. రవితేజ హీరోగా వస్తోన్న డిస్కోరాజా చిత్రానికీ మంచి మ్యూజిక్‌నిచ్చి తమన్ టాప్ రేంజ్‌కి వెళ్లిపోయాడు. అయితే దేవీశ్రీ బౌన్‌బ్యాక్ కావడం కష్టమైన పనేం కాదు. సత్తా వున్న సంగీత దర్శకుడి చేతిలో సుకుమార్-బన్నీ ప్రాజెక్టు ఉంది. ఈ ముగ్గురూ గతంలో హిట్లు కొట్టిన కాంబినేషనే. సో, మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేయడంలో దేవిశ్రీ ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూద్దాం.