Others

చెక్కిన చలి శిల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశం అంచున
పరిచిన చీరె
పొగమంచు చాటున
చలి శిల్పాన్ని
చెక్కుతూ ఉంటుంది.
ఉలిపడ్డప్రతిసారీ
సూర్యుడి కిరణాల తాకిడి
కన్నీళ్లు చుక్కలుగా
మారి కంబళి కోసం
వెతుకుతాయి!
వెనె్నల కురుస్తున్న
సంధ్యాకాలం మబ్బుల గాలుల
పుప్పొడి రాలుస్తోంది!
బద్దకంగా ఉదయిస్తున్న
మనసు పొరలు
ఏ రంగుల గాలికి
ఆకర్షణగా మారి
జారిపోతూ కొత్తబాధలను
ప్రవేశింప చేస్తోందో!!
తట్టుకోలేని తనువులు
చెప్పుకోలేని బాధలు
చలిపై ఉలి పడి
తంటాలు తెస్తోంది
చెక్కిన శిల్ప సుందరీ
చెక్కిన చలి శిల్పం

- పగిడిపల్లి సురేందర్ పూసల 8280701508