Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ వృద్ధులనఁ బిల్లలను భావమిద్ధరిత్రి
మిగుల జీర్ణించుకున్నచో తగులుకొనును
సకల సంపత్తులెన్నియో సంబరాన
తరతరంబులు సౌఖ్యంబులరయఁ బొందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: వయోభారంతో అల్లల్లాడిపోతున్న వృద్ధ జనాలను పసిపిల్లలుగా భావిస్తూ సేవలందించాలన్న సద్భావనను కలిగియున్న పక్షంలో ఆనందంగా సకల సంపదలు వచ్చి చేరుతాయి. అంతేకాదు రానున్న మన ముందు తరాలవారుకూడా ఆ పుణ్య ఫలాలనుభవిస్తారన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు స్వామీ!
తే.గీ వృత్తి ధర్మమ్ము నిత్యమ్ము విడిచిపెట్టి
ధర్మబద్ధులమనునట్లు తాము కార్య
స్థలములందునఁ గన్పట్లుఁ దప్పుఁ జేయు
వారినధిపులు గమనింపవలయు సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: నేటి కాలంలో చాలామంది తాము చేపట్టిన వృత్తుల విషయంలో వృత్తి ధర్మాన్ని విడిచిపెట్టేస్తూ తాము పనిచేస్తున్న కార్యస్థలాల్లో వృత్తి ధర్మబద్ధులము అన్నట్లు కనబడుతున్నారు. వాస్తవాన్ని మరుగునపడేస్తూ నటనకు ప్రాణం పోస్తున్నారు. పెద్దలు, అధికారులు, ప్రభువులు అలాంటివారిని గమనిస్తుండాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియజేయుమయ్యా స్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262