Others

దాన ధర్మాలు మోక్షద్వారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషి తాను సుఖంగా ఉండాలను కొంటారు. ఈ సుఖం అనేది మాత్రం ప్రతి మనిషికి వేరు వేరుగా ఉంటుంది. కొందరు డబ్బు , భోగాలు సుఖమనుకొంటే మరికొందరు తిని తిరగడం సుఖమనుకొంటారు. ఇంకొందరు చేతనైనంత పనిని చేస్తూ దాని వలన వచ్చిన మంచి ఫలితాన్ని అనుభవించడమే సుఖమనుకొంటారు.
వీరు కాక ఇంకొందరు మానవజన్మ లభించింది కనుక వివేక విచక్షణాలు ఉన్నాయ కనుక అసలు దైవం అంటే ఎవరో కనుక్కుని చర్మ చక్షువుల ద్వారా భగవంతుని చూడడమే సుఖం అనుకొంటారు. మరికొందరు ఆ దేవుని సన్నిథిలో కాలం గడపడమే సుఖమని ఇదే మోక్షమని ఈ మోక్షసాధన కన్నా మించిన సుఖం లేదని అనుకొంటారు.
పూర్వకాలాల్లో మోక్షాపేక్ష ఉండేవారు యజ్ఞాలు చేసేవారు. తపస్సులు ఆచరించేవారు. ముక్కుమూసుకుని ఏకాంత ప్రదేశంలో కూర్చుని అహోరాత్రాలు తపస్సు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకొని ఆయన సన్నిధిలో ఉండాలన్న తమ కోరికను తెల్పేవారు.
కానీ ఇపుడు కాలం మారింది. తపస్సు ఆచరించి మోక్షం సంపాదించే వీలు కలుగడం లేదని కొందరు అనుకొంటారు. కానీ మోక్షాపేక్ష ను మాత్రం వారు వదలక పట్టుకునే ఉంటున్నారు. ఎలాగైనా మోక్షం సంపాదించాలని ఏ మార్గం ద్వారా సులభంగా మోక్షం లభిస్తుందని అనే్వషించేవారు ఈలోకంలో ఎందరో కనిపిస్తారు.
అన్నదానం, వస్తద్రానం, జలదానం గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవన్నీ చాలా విశిష్టమైనవి. మనిషిని సంతృప్తిపరచేది అన్నదానము. దాహార్తిని తీర్చేది జలదానం. ముఖ్యంగా వేసవికాలంలో బాటసారుల దాహాన్ని తీర్చటం ద్వారా వారికి మనమెంతో మేలుచేసిన వారమవౌతాం. వస్తద్రానం చేస్తే సాక్షాత్తూ ఆ భగవంతుడికే వస్త్రాన్నిచ్చిన పుణ్యం కలుగుతుంది. ఎండా, వానా చలినుండి పేదలకు కాపాడిన తృప్తీ మనకు దక్కుతుంది. ఇక కన్యాదానం చేయటం ద్వారా- ఆ కన్య ద్వారా ఒక వంశం వృద్ధి చెందుతుంది. తద్వారా కొన్ని తరాల పరంపర కొనసాగుతుంది. గోదానం మహిమ చెప్పనలవికానిది. గోవును దూడను కలిపి దానం చేస్తే, మన పితృదేవతలను వైరతరణీనదిని దాటించి స్వర్గలోక గతులను చేసిన పుణ్యం దక్కుతుంది. దానాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది భూదానం. భూమిని మన పెద్దలు రత్నగర్భ అని పిలిచారు. సువర్ణ, జల నవరత్న ఖచిత, మణి మణిక్యాదులన్నీ భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి భూమిని దానం చేయటంవల్ల భూమితోపాటుగా, పైవాటినన్నింటినీ కూడా దానం చేసిన ఫలితం ఉంటుంది ఆ భూమిలో పొందే పంటల వలన మానవులకే కాక పశుపక్ష్యాదులకన్నింటికి ఆహారం చేకూర్చినవాళ్లవుతాం. పేదలకు జీవన భృతి దొరుతుంది చేసిన దానధర్మాలవలన ఆజన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రత్యుపకారము నాశింపక ఈయబడు దానము కానీ ప్రతిఫలాన్ని ఆశించి దానం చేస్తే అది దానంగా గ్రహించబడదు. అంటే ఇదిగో ఈ దానం చేస్తున్నాం కనుక ఈ ఫలం తప్పక రావాల్సిందే అని కాక ఎదుటివారి అవసరం ఎరిగి వారికి కావాల్సిన వస్తువులను దానం చేయడం ఉత్తమం. దాని వల్ల మంచి ఫలితమే వస్తుందని పురాణాలు చెబుతాయ. మంచి చేస్తే మంచి కలుగుతుందనేది ఈ కలియుగంలో కూడా అనుకోవడం సహజమే కదా. ఏమి చేస్తామో ఏమి ఆలోచిస్తామో అవే ఎదురవుతుంటాయ. ఆకలిగొన్నవారికి అనాధలకు, రోగులకు, అసమర్థులకు, అన్నవస్త్ర ఓషదులు మొదలైనవి లేనివారికి, విద్వాంసులకు బ్రాహ్మణులకు ధనాదులచే సత్కరించుట కూడా దానమనే చెప్పవచ్చు.
అయతే దానం చేస్తే ఈ ఫలితాలు వస్తాయ కదా అని పాత్ర తెలుసుకోకుండా అంటే ఎవరికి ఎందుకు దానం చేస్తున్నామో తెలుసుకోకుండా దానం చేస్తే మాత్రం దానం పుచ్చుకున్నవారు చేసేకర్మలో ఫలం అనుభవించాల్సి వస్తుంది.
ఇంకో మార్గం ద్వారా మోక్షాన్ని అందుకోవచ్చు. అదే దైవారాధన, నామ పారాయణ, నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్షమార్గాన్ని అనుసరించవచ్చు. అన్నింటికన్నా విశిష్టమైన దానం మాత్రం మానవసేవయే. మానవ సేవే మాధవ సేవగా ఎంచి చేసే శ్రమదానం అయనా ధనదానమే అయనా ఆ దానం మంచిని కలుగుచేస్తుంది.

- చివుకుల రామమోహన్