Others

మురళీనాదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాంత వీధుల్లో విహరించు గిరిధారి ద్వాపరయుగ పరిపూర్ణఅవతారునిగా ఆవిర్భవించి, కృష్ణావతారియై సర్వేశ్వరుడైనప్పటికీ ఆవులను మేపుతూ అరణ్యంలో సంచరిస్తూ యదునందనునిగా గోచరించేవాడు. ఆ మురళీ మోహనుని రూపం వర్ణింప నలవిగానిది. మధురనాధం పలికే ఆ మురళి వైశిష్ఠ్యాన్ని , బాలగోపాలుడు ధరించి వీనుల విందు చేశాడు. మురళిని పిల్లన గ్రోవి అన్నారుకదా. మురళిని ధరించి యశోదమ్మ కొడుకు మురళీ కృష్ణుడయ్యాడు.
ఈ విషయాలను నారాయణ శతకంలో కవి మనోహరంగా వర్ణించాడు. ఆయన రూప వర్ణనం ఎంతో ప్రాభవాన్ని సంతరించుకున్నది ‘‘ఉల్లోలంబులుగా గురుల్ నుదిటిపై నుప్పొంగ మో మెత్తి ధమ్మిల్లంబల్లలనాడ... ’’అంటూ ఓ నారాయణా! నీ ముంగురులు పైకి ఎగురుతూ నొసట చెలరేగుతుంటే మొగమెత్తి - నీకొప్పు కేశపాశం జారి అల్లలనాడుతూ ఉంటే ప్రేమసింగారం కలబోసినట్లు నీవు వ్రేపల్లెలో సంచరిస్తుంటే ఆలమందలు ఆలకాపరులు ఆభీర యువతులు మనసు పడి నీ పిల్లన గ్రోవి చుట్టూ చేరి తిరిగే రీతిగా మ్రోగించే నీ ప్రాభవం పెంపు ఎంతో ప్రశంసనీయం.
గోపాల కృష్ణుని లీలా విహారానికి గోకులమంతా అంటే ఆబాల గోపాలం ఆకర్షితులైనారు. వీధుల్లో సంచరించే వేళ నుదుటిపైన ముంగురులు, అలకలు పదే పదే పైకి చెలరేగాయి. ముంగురులు ముఖాన్ని కప్పి వేయకుడా మధ్యలో మొగం ఎత్తుతూ ఉంటాడు. అతని కొప్పు వీడి పోయి నర్తిస్తున్నట్లుగా సంచరిస్తాడు. అందుకే అన్నమయ్య ఆ బాల మురళీ మనోహరుని వర్ణిస్తూ ఒక కీర్తనలో.. తోయం పుకురులతోడ తూగేటి శిరస్సు ..చింతకాయవంటి జడల గములతో డ మ్రోయుచున్న కనకపు మువ్వలపాదాలతోడ.. అని మనోజ్ఞంగా కీర్తించాడు.
పిల్లనగ్రోవికి సప్త స్వరాలను పలికించే రంధ్రాలుంటాయి. వాటిపైన మృదువుగా ఉన్న చిన్న వ్రేళ్ల నానించి మూస్తూ తెరుస్తూ ఉంటే జగన్మోహనమైన నాదం ఉదయిస్తున్నది.
మురళీ మోహనుని దివ్యరూపం ప్రేక్షకులకు ప్రేమను జనింప చేస్తే ఆయన సుతారంగా మ్రోగించిన వేణునాదం రసరంజితమైనది. రాగ రసమిశ్రమంగా కన్నయ్య మురళిని మ్రోగిస్తుంటే గోవుల గోపాలకుల గోపస్ర్తిల చెవుల దాకా సోకి, ఆనాదామృతం హృదయంగా పలుకుతుంది. వారి ఎదలు మురళీ లోలుని చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటుంది.
అధర్వణిక‘‘ కృష్ణోపనిషత్తు’లో వంశస్తు భగవాన్ రుద్రః అన్నట్లు గా రుద్రుడు శ్రీకృష్ణుని చేత పిల్లన గ్రోవిగా ఆవిష్కృతుడన్నది పోతనగారు తమ భాగవతంలో చెప్తారు.
నీరుత్రాగి వృద్ధిపొందిన వేణువు శ్రీకృష్ణుని అధర సుధాపానం చేత తమకూ ధన్యత్వాన్ని సంపాదించినది నదులు పులకించాయట. వృక్షాలు కూడా ఆనంద భాష్పాలు విడిచాయట. కారణం ఆ వెదురు వేణువు తమ వంశంలోనే పుట్టి తమ కులానికంతకూ ధన్యతను సంతరించి పెట్టిందని పోతనగారు మనోహర రూపకల్పన చేసి తరించారు. గోపాలుని వేణునాదం వల్ల తరువుల మకరందవ్యాజంతో అశ్రువులను కరుపిస్తాయట. ఇలా స్థావర జంగమాలను వేణునాదంతో వశపరుచుకొనే శ్రీకృష్ణుని తత్వమును ఆబాలగోపాలం ప్రస్తుతించినది. మురళీలోలుని ఎందరో భక్తులు యుగ యుగాల జనుల ఆ మురళీ నాదంతో పులకించేవారు. ఎందరో కవులు వేణుగాన లోలుని దర్శనం కొరకు పలురకాలుగా గద్య పద్య శ్లోకాలలో వర్ణించి తరించారు.
వేణుగానం వింటూ గోకులంలో ని గోవులు తమ పొదుగులో పాలు నిండిపోయి సలుపుతూ ఉంటే ఉండలేక తమంతతామే నేల మీద పాలను స్రవించేవట. గోవులాంటి స్వభావం కలవాడు గోవిందుడు. ఆ యనే నారాయణుడు. గోపాలుడు మురళీ వాయించే వేళ ఆయన దివ్య శరీరం త్రిజగన్మోహనమైన నీలకాంతితో దేదీప్యమానంగా విరాజిల్లేదట. ఆబాల మురళీ లోలుడు యమునా నదీతీరంలో ఆలమందలు మేత మేస్తుంటే వనంలో దట్టంగా ఉన్న పెరిగిన చెట్టుకొన కొమ్మల్లో కూర్చుని శోభనరాగం లో మురళీనాదాన్ని వినిపించేవాడట.
మురళీ నాద మాధురి ఆపాత మధురమై మనస్సుకు మధురమైన అనుభూతిని కల్గించి కృష్ణుని వైపు మరలిస్తుంది. దైవ భావన ఆధ్యాత్మికతను అందించి ముక్తి మార్గంవైపు పయనిస్తుంది. ఆ దివ్య మంగళ విగ్రహుని మురళీ నాదం విని తరించి యాదవులు, ద్వాపర యుగం ధన్యమైనాయ. ఆ భావనలో మనమూ కూడా మురళీగానం విందాం. తరిద్దాం. బాల గోపాలుని మురళీలోలుని నిరంతరం స్మరిద్దాం. పులకితులవౌదాం. ఓం నమో వేణునాదాయనమః

- పి.వి. సీతారామమూర్తి 9490386015