Others

రసాకృతి.. ఉమర్ ఖయ్యామ్ కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ఉమర్ ఖయ్యామ్ జయంతి
*
భావ కవితాయుగపు మలి నాళ్ళలో మధురమైన మనోజ్ఞమైన పద్య కవిత్వాన్ని రచించిన కవులలో ఉమర్ ఆలీషా ఒకరు. బహుభాషా కోవిదుడు ఐన ఈ కవి ప్రతిభావంతుడైన భాషావేత్త. సంస్కృతాంధ్ర భాషలలో విశారదుడు. ఉమర్ ఆలీషా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 23 జనవరి 1945లో జన్మించారు. ఛాంద్‌బీబి, మహర్షి మొహియొద్దీన్ బాషా ఆయన జననీజనకులు. తండ్రియైన మొహియొద్దీన్ బాషా అరబ్బీ, పార్సీ, సంస్కృతాంధ్రాలలో పండితుడు. ఆధ్యాత్మిక విద్యాపీఠం ఆచార్యుడు ఉమర్ ఆలీషా బాల్యంలోనే సంస్కృతాంధ్రాలను చదువుకున్నాడు. అరబ్బీ, పార్శీ, ఆంగ్ల భాషలను అభ్యసించిన ఆలీషా పదునాలుగో ఏటనే తెలుగులో పద్య కవిత్వాన్ని రచించారు. పద్దెనిమిదో ఏట ‘మణిమాల’ అనే నాటకాన్ని వ్రాశారు. విశేషమేమంటే ఆయనకు ఉద్యోగాలు వచ్చినా, వద్దనుకొని భాషాసేవ, దేశసేవ చేయాలని నిశ్చయించుకున్నారు.
మాతృభాష ఉర్దూ ఐనా తెలుగులో మధురంగా సరస కవిత్వాన్ని చెప్పిన కవి. ఏభై గ్రంథాలు రచించారు. కవిగా, నాటక రచయితగా ప్రసిద్ధులైన ఉమర్ ఆలీషా కావ్యాలలో ఉమర్ ఖయ్యూమ్, మహమ్మదు ప్రవక్త చరిత్రము, సర్గమాత, ఖండకావ్యము, బర్హిణీదేవి సాహిత్యాభిమానుల ప్రశంసలను పొందిన కృతులు. ఉమర్ ఖయ్యూమ్ కవిత్వాన్ని ఎందరో తెలుగులోకి అనువదించారు. వందదాకా అనువాదాలు వచ్చినా ఉమర్ ఖయ్యూమ్ అనగానే రసజ్ఞులకు వెంటనే గుర్తుకు వచ్చేది కవికోకిల, దువ్వూరి రామిరెడ్డి పానశాల, ఈ కృతి ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇందలి పద్యాలు ప్రజల నోళ్ళకెక్కినై. దాదాపు ఇరవైఐదు పద్యానువాద గ్రంథాలను చదివిన నేను ఉమర్ ఆలీషా ఉమర్ ఖయ్యామ్ పద్యాలను చదివి పొంగిపోయాను. దువ్వూరి రామిరెడ్డి, పానశాల అనువాదం కన్నా మిన్నగా ఉమర్ ఆలీషా పద్యాలు హృద్యంగా ఉండడం గమనించాను. రసరమ్యంగా సాగింది ఉమర్ ఖయ్యామ్ పద్య రచన. కొన్ని పద్యాలలోని స్వారస్యాన్ని పరిశీలిద్దాం.
‘ఎక్కడినుండి వచ్చితిమో యెక్కడికేగుటకౌనొ, యెవ్వరీ
నిక్కమెరింగి చెప్పుటకు నేర్చినవారలు గారు, ధాత్రియం
దక్కట దీనికిన్ మొదలునంతము నిట్టిదయించుదోచదీ
ఫల్కిని జీవయాత్రకయి వచ్చుచు బోవుచు నుంటిమెంటియున్
అన్న ఈ పద్యంలోని భాష ఎంత సరళ సుందరమో పఠిత వెంటనే గ్రహిస్తాడు. జన సామాన్యానికి అర్థమయ్యే పదాలను ప్రయోగించిన తీరు ఆలీషా అభివ్యక్తి సరళ్యాన్ని తెలుపుతుంది.
నీవాకాశమునెక్కి నిక్కిన వ్రజల్
నిన్ భూమిపై ద్రోతురిం
దీవెంతో సొగసైన వాడవని
గర్వింపన్ గడుక్కన్‌దీనుగా
గావించున్ బ్రడు, కాన నీవు ప్రజతో గయ్యయి
వర్జించి యో
తో వారింగని తోడూనీడగుము
నీతో వారు తోడౌనటుల్, అన్న ఈ వృత్తం ఎంత తేటతెలుగు పదాలతో సాగింది? పాఠక హృదయాలను తన వెంట తీసుకొనిపోయే నడక. అక్కన వలె అలతి అలతి పదాల కూర్పు.
ఉమర్ ఖయ్యాం మూలానికి విధేయంగా సాగినఈ పద్య రచన స్వతంత్ర కావ్యమా అనిపిస్తుంది.
కలువలె కల్గునో వెతలె కల్గునొ జీవితం సౌఖ్యతే
కలుగునొ, లేక దుఃఖములే కల్గునొ యేమని చెప్పనేర్తు?లో
పలికిన బీల్చుగాలి విడువంబడునో? తెగియంతరించును
తెలియదుగాన గాన మధ్యమునుదెమ్మిటు పాత్రల నింపునెచ్చెలీ!
అంత తాత్త్విక వైరాగ్య భావాన్ని ఇంతే తేలిక పదాలతో పొదగడం ఉమర్ ఆలీషా కవిశిల్పం
ఏనుపిపాస జేడ్పడి తపించుచు నీళ్ళకు
జేయిసాచినన్
గాని లభింపదయ్యె నెద కామ్యఫలాప్తికి
జొక్కిసోయినన్
గాన లభింపదయ్యె తుది గమ్య తలంబు;
వయస్సునాశనం
దేనశియంచెగాన యొక రుూప్సితిమైన
పఠింపదం తక్కువే
పైన పద్యం ఆలీషా ధారాశుద్ధికి తార్కాణం.
ఖయ్యామ్ కవితకే మెరుగుపెట్టిన అనువాద సరళి. పాఠకుల గుండెలను కుదిపే పద్యం
.. ఏదియొ కోర్కెతోడనె మసీదునకు జనుచాటిమతె యా
మోదముతో నమాజునకు బోవుటలేదొకనాడు, నేను మ
స్జీదు కవాటమందు నొకచెప్పును దొంగిలించబోయి యిప్పుడా
పాదుక ప్రాతగిల్లెనని వచ్చితి రెండవసారియర్ధివై
ఖయ్యామ్ భావాన్ని రసరమ్యంగా..
తెలుగు చేసిన వైనం కవి పద్య రచనా కళ నైపుణ్యాన్ని ఎత్తిచూపుతుంది.
మరొక్క పద్యం
‘క్షమ యాను నశ్వమెక్కిన దిగంబరి జూచిరి. వానికిన్ నిష
ధములును, శౌచ శిలములు, ధర్మమధర్మము
క్రమములు లేవు, లేవిహ పదంబునస్తినాస్తిక
లహో యిటువంటి ధీరసం
యెమిగలడే జగత్రయమునందు
యధార్థము చెప్పవచ్చినన్
ఈ పద్యమొక్కటి చాలు ఉమర్ ఆలీషా సాహితీ ప్రతిభను ఎత్తిచూపడానికి.
ఇంత గొప్ప అనువాదం ఎందుకో సాహితీలోకం దృష్టిలో లేదు.
లాలిత్యం మాధుర్యం పద్య పద్యంలో నిండిన రసాకృతి ఉమర్ ఆలీషా ఉమర్ ఖయ్యామ్ కృతి

- డా. తిరునగరి 9392465475