Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. తల్లడిల్లెడి వారల యుల్లములకు
దూరటయుఁ గల్గ ఁ జేయంగ నుంటి మనుచు
నొక్క యడుగైనఁ గదపరే యుర్వికేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అనేకానేక సమస్యలతో తల్లడిల్లిపోతున్న దీన జనాల మనసులకు ఊరట కలిగించడానికి మేమున్నామంటూ ఒక్క అడుగైనా కదపని వారు ఈ భూమికి ఎంతో భారమన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు స్వామి.!

తే.గీ. చీకటులఁ జీల్చి వెలుగులు లోకమునకుఁ
బంచనెంచియు జాగృత పరచవలయుఁ
గొలువు దీరు దురప్పుడే గుండెలందు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అజ్ఞానమనెడి చీకట్లను చీల్చేసి, లోకానికి జ్ఞానమనే వెలుగులను పంచాలనే దృక్పథంతో అందరినీ జాగృతం చేయాలి. అప్పుడే ప్రజల గుండెగుడుల్లో ఎల్లపుడూ కొలువుదీరి ఉంటారన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించుమయ్య ప్రభాకరా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262