Others

నిత్య నూతన నృత్యోత్సాహి ‘పసుమర్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవంతమైన సుక్షేత్రంలో నాణ్యమైన రసాలపు విత్తనం పడితే.. అది మధుర రసఫలాలు అందించే మహావృక్షం కావటంలో ఆశ్చర్యం ఉండదు కదా.
అలాంటి కూచిపూడి సుక్షేత్రంలో, నాట్యకుటుంబాల్లో ప్రముఖులైన ‘పసుమర్తి’ వారింట ప్రభవం - ఓ సుకృతం!
నాట్య వేదాంతాలనాసాంతం ఆస్వాదించి, తాండవ లాస్య ప్రతీకలైన పార్వతీశ్వరుల పేరు దాల్చిన నాట్యఋషులు బ్రహ్మశ్రీ వేదాంతం పార్వతీశం గారి శిష్యరిక భాగ్యం పొందటం ఓ మహాద్భాగ్యం.
ఈ రెండూ జన్మతః సంక్రమించిన, సమకూరిన అదృష్టవంతులు శ్రీ పసుమర్తి రామలింగ శాస్ర్తీ. కూచిపూడి లో నిష్ణాతులైయ్యాక ఇంకా కళాస్వాదన చేయాలన్న తపన ఆయనని కృష్ణాతీరం నుంచి అడయార్ గట్టుకు చేర్చింది.
‘కళాక్షేత్ర’లో భరతం...
మద్రాసులో భరత నాట్య శిక్షణాలయం ‘కళాక్షేత్ర’ లో ప్రసిద్ధ నాట్య పరిశోధక గురువు శ్రీమతి రుక్మిణీ అరెండల్ నేతృత్వంలో భరత నాట్యంలో డిప్లమో చేశారు. ఆమె వివిధ నృత్యాల మేళవింపుని భరత నాట్య రీతిలో చేస్తున్న అద్భుతమైన రూపకల్పనా విధానాన్ని ఆకళింపు చేసుకొన్నారు.
అక్కడ ఆనాడు రూపొందించిన రామాయణం, అభిజ్ఞాన శాకుంతలం లాంటి ఎన్నో ప్రదర్శనల్లో ముఖ్యమైన పాత్రలు సమర్థవంతంగా నటించి గురువులు మెప్పుపొందారు. ఆ సందర్భంలో ‘కథాకళి’ బేసిక్స్ కూడా అవగతం కావటం పసుమర్తి వారి కళాతృష్ణకి దర్పణం అయింది.
భరతనాట్యంలో డిప్లమో పూర్తయ్యాక మద్రాసులో కూచిపూడి నాట్యంలో అనేక ఒరవడుల్ని ప్రవేశ పెడుతూ ప్రఖ్యాతులయిన పద్మభూషణ్ వెంపటి చిన సత్యంగారి సిద్ధేంద్రకళాక్షేత్రంలో మెలుకువలు నేర్చుకున్నారు. వారి పర్యవేక్షణలో రూపొందే .. సంగీత సాహిత్య నవీన సమ్మేళన రూపకాల్లో నర్తించారు. భామాకలాపంలో సత్యభామగా సంప్రదాయం బాణీలో రక్తి కట్టించారు. క్షీర సాగర మథనంలో శివుడు, శ్రీనివాస కళ్యాణంలో నారదుడు పాత్రలో వీరు అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
నర్తన నుండి నట్టువాగం ...
పసుమర్తివారి జీవన రంగంలో ఉద్యోగ పర్వం, హైదరాబాదులో 3దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. నట్టువాగం చేపట్టి గురువుల వద్ద నేర్చినదీ.. తన సృజనా సామర్థ్యంతో శిష్యులకి బోధిస్తూ, క్లాసుల నుంచి కళాశాల దాటి యూనివర్సిటీల దాకా విస్ఫారితమైంది. తన గురువుల వద్ద తాను నేర్చుకున్నది మరొకరికి బోధించడం, విద్యని కాపాడటం గురుఋణం తీర్చుకునే క్రమంలో ఆయనికి ఎందరో శిష్య శిష్యులు తయారౌతున్నారు.
ఉద్యోగ విజయాలు...
పసుమర్తి వారి క్లాసులు సిలబస్సు కి మించి అనుభవపాఠాలుగా నడుస్తాయి. ఆయన ప్రసంగాలు డిమాన్ స్ట్రేషన్ క్లాసుల్లా ఉంటాయి. దేశ విదేశాల్లో వివిధ సంస్థలో ఆయన సమర్పించిన పత్రాలు సిద్ధాంత గ్రంథాల్లో ఉంటాయి.
ఆయన సమర్పించిన పత్రాలు సిద్ధాంత గ్రంథాల్లా ఉంటాయి.
సెంట్రల్ యూనివర్సిటీలో లెక్చరర్ ప్రారంభమైన ఆయన బోధనా ద్యోగం ప్రొఫెసర్ డీన్ వగైరా పదోన్నతులతో కొనసాగుతోంది.
కల్పనా కౌశలం ....
పసుమర్తి రామలింగ శాస్ర్తీగారు రూపొందించిన నృత్య రూపకాలు విశిష్టంగానూ వినూత్నంగానూ ఉంటాయి. 42 ప్రదర్శనలు చేసిన గజాననీయం, 22ప్రదర్శనలు జరుపుకున్న శ్రీరామ కథాసారం, 15 ప్రదర్శనలు పూర్తి చేసుకొన్న శశిరేఖా పరిణయం, త్రిపాది గంగ ఎన్నిసార్లు ప్రదర్శించినా,.. ఒకేలా ఉండవు. సాధారణంగా నర్తకులు మారుతూనే ఉంటారు. మళ్లీ కొత్తవారికి నేర్పిస్తున్నప్పుడల్లా ఆయన సృజనశైలి కొత్త అందాలను ఆవిష్కరిస్తుంది.
ఆవశ్యం స్వచ్ఛ పాలనం, లివింగ్ లెజెండ్స్ ఆఫ్ కూచిపూడి , నవదుర్గా విలాసం, గ్రేట్‌నెస్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్ , శివలీల, రాసలీల , అష్టవిధ నాయకులు మొదలైన వాటిలో ఆయన రూపకల్పనలు వైవిధ్య భరితంగా, వైభవోపేతంగా ఉంటాయి.
పసుమర్తి రామలింగ శాస్ర్తీగారికి ఎన్నో సన్మానాలు, సత్కారాలు లభించాయి. వీరు సింగపూర్, మలేషియా, మిచిగన్, వెస్లియన్, క్యాలిఫోర్నియా లాంటి వివిధ దేశాల్లో ప్రదర్శనలు, ఉదాహరణ పూర్వక ప్రసంగాలు ఇచ్చారు.
నాట్య కళాధర, నృత్య విద్వన్ మణి, వంటి బిరుదులు ఎన్నో వీరికి లభించాయి. 2012 లో ఉగాది పురస్కారం, 2016 ప్రతిష్ఠాత్మకమైన కళారత్న (హంస) అవార్డు 2018లో సంగీత నాటక అకాడమీ పురస్కారం పసుమర్తి రామలింగ శాస్ర్తీగారు అందుకున్నారు. అధ్యయనం అధ్యాపనంలో, విశి ష్టులైన వీరి శిష్యులు వీరి నిబద్ధత, క్రమ శిక్షణ తట్టుకోలేని పరిస్థితిని కూడా భయభక్తులలో అనుసరిస్తుంటారు. అది వీరి అపార పాండిత్యానికి నిరద్శనం.

- బ్నిం