Others

నవ్వేవాళ్ల అదృష్టం (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని, సావిత్రి జోడీగా వచ్చిన ఎన్నో అద్భుత చిత్రాల్లో -అర్ధాంగి ఒకటి. 1955లో విడుదలై విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం. అర్ధాంగి చిత్రం కోసం ఆత్రేయ కలం నుంచి -నవ్వేవాళ్ల అదృష్టమేమని ఏడ్చేవాళ్లని ఏడవనీ అంటూ ఓ పాట జాలువారింది. ఆత్రేయ చెప్పిన అక్షర సత్యానికి పి లీల తన గళంతో ప్రాణం పోసింది. బి నరసింహారావు, అశ్వత్థామలు -ఆ అద్భత బాణీకి స్వరకర్తలు. మన’సుకవి అనిపించుకున్న ఆత్రేయ.. గొప్ప వేదాంతి కూడా అని చెప్పడానికి ఉదహరించాల్సిన గొప్ప పాట ఇది. ఈ గీతం కోసం ఆత్రేయ రాసిన పదాలు -అమ్మ మాటల్లో అర్థవంతంగా ఉంటాయి. జ్ఞానబోధ చేస్తూ ఆలోచింపచేస్తాయి. -నవ్వండీ/ నవ్వేవాళ్లతో నవ్వండి/ నాలుగు ఘడియల నరజీవితం నవ్వుల తోటగ చేయండి -అంటూ పిలుపునిస్తాడు. -వచ్చిన వాళ్లు పోతారు/ పోయినవాళ్లు రాబోరు/ ఈ రాకపోకల సందున ఉంది ఒక రంజైన నాటకము.. బ్రతుకంతా ఒక నాటకము.. కదిలిస్తే అది బూటకము అంటూ వేదాంతిలా హెచ్చరిస్తాడు. -అదంతా ఎందుకు చక్కగా జీవితాన్ని మలచుకోండి/ రేపన్నది రూపేలేనిది/ ఊడిపోతారు ఏ క్షణమైనా/ ఈరోజే నీకుండేది.. అని చెబుతూనే, పాట చివరిలో.. -ఏడ్చేవాళ్లని ఏడవనీ/ కడుపుమండి ఏడవనీ/ కుళ్లికుళ్లి ఏడవనీ/ ఏడవనీ ఏడవనీ ఏడవనీ -అంటూ మూడు ముక్కల్లో ముగిస్తాడు. గొప్ప కవుల కలానికి అవరోధాలు లేవనేలా.. కవ్వాలీ నడకలో పాట సాగుతుంటే కథలో ప్రతి నాయకుడైన జగ్గయ్య ఎదుట అద్భుత నటి సురభి బాలసరస్వతి నర్తిస్తూ అభినయించేలా ‘అర్ధాంగి’ చిత్రంలో ఈ పాటను అమర్చారు. సాధారణంగా ఇటువంటి పాటలు జనాదరణకు అంతగా నోచుకునేవి కావు. అందుకు ఉదాహరణే -జిక్కీ పాడిన ‘వద్దురా కన్నయ్యా‘, ‘ఎక్కడమ్మా చంద్రుడు’ వంటి పాటలతో సరిసమానంగా ఈ పాట అప్పట్లో వినిపించేది కాదు. కానీ, ఈ పాట నాకు చాలా ఇష్టం.
చిత్ర దర్శకుడు, నిర్మాత పి పుల్లయ్య శాంతకుమారిల రాగిణి సంస్థలో అర్ధాంగి చిత్రం రూపుదిద్దుకుంది. అక్కినేని అమాయక నటన, కథానాయిక మహానటి సావిత్రి, ప్రతి నాయకుడిగా జగ్గయ్య, గుమ్మడి, శాంతకుమారి, సురభి బాలసరస్వతిల అత్యద్భుత నటనలతో శోభిల్లి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కొత్త చిత్రంలా ‘అర్ధాంగి’ ప్రేక్షకులకు కనువిందు వీనుల విందు చేస్తుంటుంది. బెంగాలీలోని మనిలాల్ బెనర్జీ నవల స్వయంసిద్ధ ఆధారంగా నిర్మితమైన అర్ధాంగి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆణిముత్యమే.
-యంవిఆర్ కుమారి, హైదరాబాద్