Others

అప్పట్లో షూటింగ్ ఎలా జరిగేదంటే- (అలనాటి విచిత్రాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చిన నటీనటులందరినీ దర్శకుడు ఒకచోట సమావేశ పరిచి ఆయా పాత్రధారులను డైలాగులు చెప్పమని అడిగేవారు. అంటే నాటక ప్రదర్శనకు ముందు జరిగే ఫైనల్ రిహార్సల్స్‌లా జరిగేదన్నమాట. తర్వాత అందరిచేత వేషాలు వేయించేవారు. ఆర్టిస్ట్‌లకు టైమింగ్స్ ఉండేవి కావు. ప్రతిరోజూ ఉదయం అందరూ మేకప్ వేసుకుని తయారై ఉండేవారు. ఫ్లోరులో ఏ సెట్టు (అంటే ఆ రోజుల్లో నాటకాలకు ఉపయోగించే కర్టెన్లులాంటివన్నమాట) ఖాళీగావుంటే అక్కడికి ఆర్టిస్టులను పిలిచి షూటింగ్ జరిపేవారు. షూటింగ్ ఎలా చేయాలన్నది దర్శకుడు ముందుగానే నోట్స్ తయారు చేసుకుని వచ్చేవారు. దాని ప్రకారం షాట్స్ తీసేవారు. దర్శకుడు చెప్పమన్నంతవరకూ చెప్పడం, ఆగమన్నప్పుడు ఆగడం ఆర్టిస్టుల పని. ఇదేమిటని కానీ, ఇలా ఎందుకు చేయాలనికానీ అడిగే అవకాశం వారికి ఉండేది కాదు. ఆనాటి స్టూడియోలలో సౌకర్యాలు అంతంతమాత్రమే. కొన్నిచోట్ల తినడానికి, విశ్రాంతి తీసుకోవడానికి తగిన సదుపాయాలు ఉండేవి కావు. సెట్టులో పని లేనప్పుడు ఆర్టిస్టులు ఏ చెట్లకిందో చతికిలపడేవారు. బొమ్మలు మాట్లాడటమే ఒక వింత. అందులోనూ మనవాళ్లు మన భాష మాట్లాడటం మరీ వింత. ఆ కొత్త వింతను ప్రజలు విరగబడి చూశారు. ‘్భక్తప్రహ్లాద’ చిత్రానికి మంచి లాభం వచ్చింది. ఈ ధనలాభం బొంబాయికి పోటీగా సినిమాలు తీస్తున్న కలకత్తాలో కదలిక కలిగించింది. ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీ కూడా తెలుగు చిత్రం తీయడానికి నిర్ణయించుకుంది.
నిషేధం పాలైన రైతు బిడ్డ
రైతుబిడ్డ నిషేధానికి గురైన తొలి తెలుగు చిత్రం. ప్రకాశం పంతులు మద్రాసు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే జమీందారీ బిల్లుకు అనువైన ప్రచారంగా చిత్రం తోడ్పడింది. చిత్రంలో జమీందార్లపట్ల పూర్తి ఘట్టాలు లేకున్నా, వెంకటగిరి, బొబ్బిలి జమీందారులు చిత్ర నిషేధానికి నోటీసులిచ్చారు. 1939 ఆగస్టు 27న నెల్లూరులో రైతుబిడ్డ చిత్రం విడుదలైన రోజునే, వారి మద్రాసు లాయర్లు నెల్లూరు వచ్చి సినిమా చూసి నోట్స్ రాసుకెళ్లారు. చిత్ర నిర్మాతలకు జమీందారులు ముందే నోటీసులు పంపి తమ ఎస్టేటు ప్రాంతాలలో చిత్రప్రదర్శన చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బెదిరించారు. నెల్లూరుజిల్లా మెజిస్ట్రేట్‌ను పట్టుకుని అతనితో వెంకటగిరి టౌన్, ఆ తాలూకా ఆనాటి గూడూరు డివిజన్‌లో కూడా సినిమాటోగ్రాఫ్ చట్టం ప్రకారం చిత్రాన్ని ప్రదర్శించకూడదని నిషేధపు ఉత్తర్వులు జారీ చేయించారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన మెజిస్ట్రేట్, జమీందారు అక్రమాలకు వంతపాడటం ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. స్వార్థపరశక్తులు ఆటలు సాగనీయని ప్రజలు ఆ చిత్రాన్ని విపరీతంగా చూశారు. ఈ సినిమాకి ఆర్థిక నష్టం జరిగినా రైతాంగంలో మాత్రం చైతన్యం తీసుకొచ్చింది. రైతుబిడ్డలో పాటలు ఎంతో పాపులరయ్యాయి. అలాంటి పాటలు కూడా తమ గ్రామాల్లో పాడుకునే వీలులేకుండా జమీందారులు ఆంక్షలు పెట్టారంటే అప్పటి పరిస్థితిని అర్థం చేసుకొవచ్చు.

-కె శ్రీనివాసరావు, బి కాంతారావు