Others

ఓటు వేసేది బంగారు భవిష్యత్తు కోసమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యానికి దిక్సూచి ఓటు వినియోగించుకోవటం ప్రధాన కర్తవ్యం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన ఆయుధం. ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఓటు విలువ గురించి, ప్రయోజనం గురించి ఓటర్లకు తెలియచేస్తూ అవగాహన కల్పిస్తారు. కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకునే వారికి అవకాశం కల్పిస్తారు. ప్రపంచ దేశాలలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు వుంది. ఈ గుర్తింపు ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా సాధ్యమైంది. ప్రజావ్యతిరేక పాలన సాగించే వారిని, ప్రజల ప్రతినిధిగా ఉండకుండా తిరస్కరించే అవకాశం కూడా ఓటర్లకే ఉంది. అందుకే ఓటుహక్కు వజ్రాయుధంతో సమానమైనది. ఓటు హక్కు అనే రెండక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎన్నికలే కొలమానం. తమ ఆకాంక్షలను నెరవేర్చని ప్రభుత్వాలను ఓడించే హక్కు రాజ్యాంగం ప్రజలకు కల్పించింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటర్లే కీలక పాత్రదారులు. అందుకే ఓటరు జాతీయ దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలి. ర్యాలీలు నిర్వహించడంతో పాటు ఓటు విశిష్టత గురించి అవగాహన కల్పించాలి. ఒక ఓటు జీవితానే్న మారుస్తుంది. కాబట్టి యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటును వినియోగించకపోతే మంచి నాయకుణ్ణి కోల్పోయే అవకాశం ఉంది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, ఆర్థిక భేదభావం లేకుండా దేశంలో నివసించే మేజర్ అయిన ప్రతి యువతి, యువకుడు ఓటు హక్కు పొందే అవకాశం భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 కల్పిస్తున్నది. వయోజనులైన ప్రతి వ్యక్తికీ ఎలాంటి భేదభావాలు లేకుండా ఓటు హక్కును కల్పించింది మన రాజ్యాంగం. మంచి నాయకత్వం లేకుండా మంచి సమాజం ఏర్పడదని, మనలోనుంచే నేతలను ఎన్నుకునే అవకాశమున్నందున మంచివారిని గెలిపిస్తే అభివృద్ధికి బాటలువేసిన వాళ్ళమవుతాం. 1950 జనవరి 25వ తేదీన భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేయడం జరిగింది. దీన్ని స్ఫురణకు తెచ్చేలా.. ఓటు హక్కు విలువలను చాటి చెప్పేలా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓటర్ అయినందుకు గర్వంగా ఉందని స్లోగన్‌ను కొత్త ఓటర్లతో చదివిస్తారు. రాజకీయ ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే సాంఘిక, ఆర్థిక, సమానత్వాన్ని సాధించాలి. ఐదేళ్లకు ఒకసారి వచ్చినా, మన జీవితాలను, తల రాతను మార్చేది ఎన్నికలు. మనం వేసే ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడ నిర్ణయిస్తాయి. ఇతర దేశాల్లో మాత్రం ఓటువేయడం తప్పనిసరి. కానీ మన దేశంలో 100 కోట్ల మంది ఓటర్లు ఉంటే కేవలం 50 కోట్ల లోపు ఓటర్లే ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ నాయకుల తల రాతల్ని మార్చే ఆయుధం ఓటు. అందరూ ఓటు వేసినపుడే, రాజ్యాంగం కల్పించిన హక్కుకు సార్థకత లభిస్తుంది. ఓటు దేశ దిశ, దశను మారుస్తుంది. మనం ఓటువేసేది బంగారు భవిష్యత్తు కోసమే అనే విషయం మరచిపోకూడదు. అందుకే ఓటింగ్ గుర్తింపుకార్డు మనం తీసుకొందాం. ఓటును వేద్దాం - మన ప్రాంత, దేశ పురోభివృద్ధికి మంచి నేతను ఎన్నుకొని బంగారు బాటలు వేద్దాం.

- కె. రామ్మోహన్‌రావు