AADIVAVRAM - Others

నీటి పాము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫచ్చని చీర కట్టుకున్న
కేరళ రాష్ట్రంలోకి
నీళ్ల పాము జొరబడింది.

నీళ్లు నీళ్లు బతుకులపై నీళ్లు
చెంపలపై మాత్రమే కాదు
జీవితాలపై కొడుతున్న నీళ్లు
విషమే కాదు కొన్నిసార్లు నీళ్లు కూడా
మనుషులను చంపేస్తాయి

బుసలు కొట్టే పామును
అదుపు చేయాలి; కాలుష్యం
పాము విడిచిన కుబుసం
-కుళ్లిన వాసన
కుబుసంపై జీవనం దరిద్రానికి చిహ్నం.

గట్లపై గతి తప్పుతున్న అడుగులు
అడుగుల్లో విరుగుతున్న మట్టి
మట్టి కింద నీళ్ల పాము జరిగిన శబ్దం
పామును మచ్చిక చేసుకోవడం అసాధ్యం.

మనిషికే కాదు నీళ్ల పాముకు కూడా
స్వేచ్ఛను ఇవ్వాల్సిందే
వరండాలో పామును కట్టేసుకోవాలనుకోవడం
పిచ్చితనం, అమాయకత్వం
చేతులు కావాలి
లోపలే కాదు బయట కూడా నూకేయడానికి...
*

-దీప నాదెండ్ల..deepanadentla@gmail.com