Others

రిపబ్లిక్ డే.. 70 వసంతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత స్వాతంత్య్ర సమరయోధులు జాతీయ రాజకీయ ప్రముఖ నాయకులు 1930 జనవరి 26నే భారతదేశానికి స్వరాజ్య దినంగా పాటిస్తూ వచ్చారు. సంపూర్ణ స్వరాజ్యం అదే తేదీన ఇవ్వాలని బ్రిటీష్‌వారిని కోరినా కాదని వారు 1947 ఆగస్టు 15వ తేదీన ఇచ్చుట గమనార్హం. 1946 డిసెంబర్ 6న రాజ్యాంగం ఆవిర్భావం జరగటం. సమాంతర ప్రభుత్వ భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (్భరత జాతీయ కాంగ్రెస్) రాజ్యాంగ లక్ష్యాలను సూచించే తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టటం వివిధ రంగాల్లోని మేధావులు తనతోపాటు కార్మిక వర్గంనుంచి బాబూ జగజ్జీవన్‌రామ్, ముస్లీంలీగ్‌నుంచి మహమ్మద్ ఆలీ జిన్నా, షెడ్యూల్ కులాల నుంచి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, హిందూ మహాసభ నుంచి శ్యామాప్రసాద్ ముఖర్జీ, జయకర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, సరోజినీనాయుడు, టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, పట్ట్భా సీతారామయ్య, దుర్గాబాయ్ దేశముఖ్, కళావెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్.జి. రంగా, బొబ్బిలి రామకృష్ణ రంగారావులు పరిషత్ సభ్యులుగా ఎన్నికై డిసెంబరు 13న రాజ్యాంగ పరిషత్‌కి హాజరవటం ముదావహం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947 ఆగస్టు 29న డా. అంబేడ్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటవటం హర్షణీయం.
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, న్యాయస్రష్ట, తాడిత పీడిత జన బాంధవుడు, రాజ్యాంగానికి చక్కని దిశానిర్దేశం చేయగల మేధావి, మహాత్మాగాంధీజీకి నమ్మకస్తుడు, అప్పటికే న్యాయశాఖామంత్రిగా ఉన్న డాక్టర్ అంబేడ్కర్ గార్కి రాజ్యాంగ రచనా బాధ్యత అప్పగించుట శ్లాఘనీయం. గాంధీజీ నమ్మకానికి తగ్గట్టుగా 60 దేశాల రాజ్యాంగాల్ని సుమారు 3 సంవత్సరాలు సుదీర్ఘ మేధోమథనం చేసి, హిందీ, ఆంగ్లభాషల్లో రెండు ముసాయిదా ప్రతులను 115రోజులు చర్చించి 2,473 సవరణలు చేసిన అనంతరం రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న ఆమోదింపజేసిన అంబేడ్కర్‌గారి అవిరళ కృషిని వేనోళ్ళ కొనియాడదగినదనుటలో అతిశయోక్తి లేదు. బ్రిటన్, ఐర్లాండు, అమెరికా, కెన డా, ఫ్రాన్సు, జర్మనీ, యు.యస్.యస్.ఆర్ (రష్యా), ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, జపాన్‌ల 10 దేశాలను స్ఫూర్తిగా తీసుకొని పఠిష్ట ఘన రాజ్యాంగం తయారుచేయటం అంబేడ్కర్‌గారి చతురతకు నిదర్శనం.
ఇంత సుదీర్ఘ నిడివిగల పెద్ద లిఖిత రాజ్యాంగం 1. 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య ప్రకటన, 2. 1946 డిసెంబరు 6న రాజ్యాంగ పరిషత్ ఆవిర్భావం, 3. స్వాతంత్య్రానంతరం 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటు.. ముఖ్యంగా 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం, చివరగా 1950 జనవరి 26నే ‘రిపబ్లిక్ డే’గా అమలుకు నోచుకోవటం రెండు రాజ్యాంగ పర్వదినోత్సవాలు (2 రిపబ్లిక్ డేలు) జరుపుకోబోవటం ఎంతైనా సమంజసం. అందుకేనేమో 2015 సంవత్సరం అంబేడ్కర్ 125వ జయంతి స్ఫూర్తితో ప్రతి ఏటా నవంబరు 26న రాజ్యాంగం ఆమోద దినోత్సవం, జనవరి 26న అమలు దినోత్సవంగా జరుపుకోవాలనే మన భారత ప్రభుత్వ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నిర్ణయం ఈ 70 వసంతాల రాజ్యాంగ దినోత్సవం (రిపబ్లిక్‌డే) జరపబోవడం ఎంతైనా సబబేగదా!

- వి.ఆర్. వాసుదేవ, 9133013629