Others

మాఘ విశిష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి అంతశ్శుద్ధి, బాహ్య శుద్ధి కావాలంటారు పెద్దలు. శివనామాన్ని నోటితో జపిస్తే అటు మనస్సు శుద్ధి అవుతుంది. నదీస్నానం లాంటివి ఆచరించినపుడు శరీరం శుద్ధి అవుతుంది. ఏపని చేసినా అది ఈశ్వరార్పణాబుద్ధితో చేస్తే భగవంతునికి ప్రీతి పాత్రులవుతారు. అటువంటి వారు సజ్జనులు, మహానుభావులు అని కీర్తింప బడుతారు. ప్రతివారు ఈ ఈశ్వరార్పణ బుద్ధిని ప్రతినిముషమూ ధరించి ఉండలేరు. కనుక పెద్దలు కొన్ని ప్రత్యేక మాసాల్లో అటు హరుని కాని ఇటు హరినికాని పూజిస్తే పుణ్యమూ పురుషార్థము లభ్యమవుతుందని శాస్తన్రిర్మాణము చేసారు. అట్లాంటి మాసాల్లో మాఘమాసం ఒకటి. ఈ మాసంలో దానం చేయడానికి, శివనామం జపించడానికి ప్రసిద్ధిచెందిన కాలం.
లింగోద్భవం జరిగిన మహా మహత్తరమైన చతుర్దశి మహాశివరాత్రిగా భావించి పరమశివునకు ప్రత్యేకంగా అభిషేకాదులు, జాగరణలు, ఉపవాసాలు చేస్తారు. శివారాధనకు అతిముఖ్యమైన మాసం మాఘం. లింగోద్భవకాలాన్ని పురస్కరిం చుకుని రాత్రి అంతా శివభజనలతో గడిపి శివాలయాలు అన్నీ లింగోద్భవకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తాయ. జ్ఞానవాహిని యైన శివనామ స్మరణతో తెల్లవార్లు జాగరణ చేస్తారు
మాఘ శుద్ధ పంచమి అనగా వృద్ధి చంద్రుడు. పంచమి అంటే అయిదు. ఐదు సంఖ్యకు అధిపతి- బుధుడు విజ్ఞాన కారకుడు. ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడిన మాఘ శుద్ధ పంచమి శ్రేష్ఠమైనదని శాస్తమ్రులు పేర్కొన్నాయి. ఉత్తరాభాద్ర మీన రాశిలో ఉంటుంది. మీనరాశికి అధిపతి గురుడు. విద్యాకారకుడు గురుడు. విద్యాదేవత మహా సరస్వతి. ఉత్తరాభాద్ర నక్షత్రాధిపతి- శని కనుక రుూరోజు సరస్వతీదేవి పూజతో పిల్లలలో భావవ్యక్తీకరణ బాగా వస్తుంది. కనుక ఈ రోజున సరస్వతీదేవిని అర్చించి అక్షరాభ్యాసాలు చేయస్తారు. సరస్వతీ దేవిని స్మరించినవారికి సకల విద్యలూ కరతలామలకం అవుతాయ. మాఘమాసంలో సూర్యారాధన అత్యంత విశిష్టమైన ఫలాలనిస్తుంది. సర్వసాక్షియైన సూర్యభగవానునికి నమస్కరించినా ఆ సర్వేశ్వర నికి నమస్కరించినట్లే జాతికి వెలుగును ప్రసాదించే సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి ఆ సూర్యభగవానుని జయంతి కూడా మాఘశుద్ధ సప్తమినాడే.
‘‘మాఘే మాసేతే పక్షే సప్తమీ కోటేభాస్కర కుర్యాత్ స్నానార్ఘ్యదానేభ్యః’’ మాఘమాస సప్తమినాడు నదీ స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యమిచ్చి, దానములు చేస్తే ఆయురారోగ్య సంపదలు కలుగుతాయని పురాణములు పేర్కొన్నాయి.
‘‘యస్మాన్మ న్వంతరాదేతు రథమాపుః దివాకరః మాఘమాసస్య సప్తమ్యా తస్మాత్యా రథ సప్తమీ’’- మాఘ మాస సప్తమి రోజున సూర్యుడు రథాన్ని అధిరోహించి భూమి మీద తొలిసారిగా సాక్షాత్కరించాడని మాఘశుద్ధ సప్తమిని రథ సప్తమి అని పిలుస్తారు. ఆరోజే సూర్య జయంతి అని పురాణములు పేర్కొన్నాయి.రథ సప్తమినాడు, సప్త అశ్వములకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులను ధరించి స్నానం చేస్తారు. రేగి ఆకులలోను, చిక్కుడు ఆకులలోనూ, సూర్యశక్తి నిక్షిప్తంగా ఉంటుంది. రేగి ఆకులను కూడా శిరస్సున ఉంచుకొని, స్నానం చేస్తారు.
త్యాగమే మానవలక్షణంగా ఉండాలని చెప్పే మహాభారతంలో ప్రతిపాత్రా అమృతత్వసిద్ధిని పొందడానికి మార్గంకూడా త్యాగమే నంటుంది. భీష్ముడు మహాభారతంలో ముఖ్యమైన పాత్ర. తన తండ్రి కోసం తన జీవితానే్న తృణప్రాయంగా ఎంచి భీషణ ప్రతిజ్ఞ చేసినవాడు భీష్ముడు. సత్కళానిధి, ఆదర్శ పురుషుడు, గొప్పకర్మయోగి తన మరణానికి తానే మూహూర్తం నిశ్చయంచుకున్నాడు. కదన రంగంలో అపశయ్యపై పడుకుని స్మరించి నంత మాత్రానే కరుణించే అపార దయాంబురాశి యైన మహావిష్ణువు సహస్రనామావళిని ధర్మరాజును నెపంగా పెట్టుకొని అఖిలలోకాలకు అందించాడు. కురుక్షేత్ర మహాయుద్ధంలో అర్జునుడు నిర్మించిన అంపశయ్యపైనే కాలం వెళ్లదీస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించిన తరువాత మాఘశుద్ధ సప్తమి మొదలుకొని ఒక్కొక్క ప్రాణానే్న వదులు తూ మాఘశుద్ధ ఏకాదశినాటికి మహావిష్ణువులో ఐక్యమెపోయాడు. ఆ గాంగేయుని స్మరించు కుంటూ భీష్మ పంచకమని, ఈ ఏకాదశిని పాటిం చాలి. ఇలా ఎవరైతే భీష్మునికి తర్పణ విధులు ఆచరిస్తారో వారి వంశోన్నతి, సకల సంపదలు ఒనగూరుతాయని మహావిష్ణువు వరాన్ని ప్రసాదించాడు. కనుక బీష్మ ఏకాదశిని ప్రతివారు పాటిస్తారు. సర్వ కార్య జయమును చేకూర్చే విష్ణు సహస్రనామావళి ఆవిర్భావం జరిగిన రోజుకూడా ఈ మాఘంలోనే వస్తుంది.
మాఘమాసంలో వచ్చే మరో ముఖ్యమైన పర్వదినం మాఘి. దత్తాత్రయే జన్మదినంగా ఈ పౌర్ణమిని సంభావిస్తారు. ఈ మాఘపూర్ణిమ నాడు సకలలోకారాధ్యుడైన శ్రీకృష్ణుని జగద్గురువుగా భావించి ఆరాధిస్తారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ దైవభక్తి ప్రతి మనిషికి ఉండాలని తద్వారా దేశభక్తి ప్రతివారిలో కలుగుతుందని చాటిచెప్పిన గొప్ప మహానుభావుడు రామకృష్ణ పరమహంస. ఈ రామకృష్ణుని జయంతి మాఘ మాసంలోనే వస్తుంది. సద్గురువులను పూజించడానికి మాఘం మహిమాన్వితమైనదనిఅంటారందుకే సనాతన ధర్మాన్ని చాటుతూ విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షించిన ప్రతిభాశాలి లోకహితులు శ్రీ దయానంద సరస్వతి. వారి జయంతి కూడా మాఘమాసంలో వస్తుంది.

- వాణీ మూర్తి 9849481823