Others

మా ఇలవేలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన తల్లి అవస్థ జూసి కాలడి శంకరుడు
నదినే తన ఇంటి గడపని తాకినట్లు జేసె
అంత శక్తి నాకు లేదా గానీ అమ్మా
పుట్టిన రోజున నేను నీ పాదాల మీద ఆన
ఆకలితో, కోపంతో, అవివేకంతో
నీమీద ఆవేశపడినందుకు పశ్చాత్తాప పడుతూ
తల్లిని మించిన దైవం అన్న మాటను
నేడు నేను అనుభవంతో తెలుసుకుంటున్నానమ్మా
నీవు నేడు లేవు గానీ నా జ్ఞాపకాల్లో నీవున్నానమ్మా
తల్లీ దండ్రీ సర్వప్రపంచమని తెలివిడి వచ్చిందమ్మా
మీ దీన వదనాల్లో చిరుహాసాలు తెప్పిస్తానమ్మా
అమ్మా కన్నతల్లిని నేను -
అందరం కలసి నేలతల్లిని - బాథపెడుతున్నామమ్మా
చేపలు నిండిన వలని భుజాన వేసుకొని వెళ్లిపోతున్నట్టు
తెలుగు అక్షరాలని మూట అట్టుకు పోతున్నారమ్మా
‘‘మెకాల్’’2ముఖాల ముసుగులు తొడిగి
ఇల్లరికపు అల్లుళ్ల వ్యక్తిత్వ రహిత
జీవితాలని మిగుల్చుతున్నారమ్మా
యుగ యుగాల మహానుభావుల
తలకట్టు అయిన తెలుగు భాషని
పూరెక్కలని నలిపేసినట్లు రాల్చేస్తున్నారమ్మా
ఓటు వేట తెలుగు తోటని ధ్వంసం జేసినా
తెలుగు నాట ఇంగ్లీష్ ఆట వంటి బట్టినా
వంటింటి మాటలు కూడా వెటకారమై పోతున్నా
బాగున్నారా అని తెలుగులో బాగోగులు గురించి
మాట్లాడితే వెర్రి బాగుల వాళ్లలా జమకడుతున్నా రమ్మా
కన్నఋణం తీర్చుకోవడానికి కంకణం కడతానమ్మా
కన్ననేలకి దండాలు దండిగా పెడతానమ్మా
ఎట్లాగైనా తల్లి భాషని ఇలవేలుపుగా చేస్తానమ్మా

ఒబ్బిని సన్యాసిరావు 9849558842