Others

ఇంకానా? ఇకపై చెల్లదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు దశాబ్దాల క్రితం... అందమైన కశ్మీర్ లోయ నుంచి లక్షల మంది హిందువులు (పండిట్లు) స్థానచలనం కావడం, ముస్లిం ఉగ్రవాదులు, అతివాదులు వారిని ఊచకోత కోయడం, విధ్వంసానికి పాల్పడటం, హిందూ స్ర్తిలపై అత్యాచారాలకు పాల్పడటం, ఆస్తులను ధ్వంసం చేయడం, ఆలయాలను నేలమట్టం చేయడం నేటికి చాలామంది కళ్ళముందు కదలాడుతోంది. ఆ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఇటీవల ఢిల్లీలో భారీ ప్రదర్శన జరిగింది. భారతదేశంలో అంతర్భాగమైన అందమైన లోయలోని పండిట్ల పరిస్థితి ఇంత దయనీయంగా కొనసాగినా ఆనాటి పాలకులు కిమ్మనకపోవడం, ఇప్పుడు హిందూ-ముస్లిం భాయిభాయి అంటున్న హైదరాబాద్ ముస్లిం నాయకులు, సిఏఏ వ్యతిరేక ఉద్యమకారులు అప్పుడు పల్లెత్తి మాట్లాడకపోవడం దేన్ని సూచిస్తోంది? ఒక స్వతంత్ర దేశంలో ఇలా లక్షలాది మంది హిందువులను, వారి పిల్లలను, వృద్ధులను రాత్రికిరాత్రి ఇళ్ళను ఖాళీచేయించి ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీసేలా చేయడం దేన్ని తెలియజేస్తోంది? మెజార్టీగా హిందువులున్న భారత్‌లో ఇలాంటి పరిస్థితి దశాబ్దాలపాటు కొనసాగితే మైనార్టీగా హిందువులున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితి ఎలా ఉందో.. ఉండేదో ఇట్టే ఊహించవచ్చు. అలా మత దౌర్జన్యాలకు, అత్యాచారాలకు, అవమానాలకు, ఊచకోతలకు గురై హిందువులు మరికొందరు మైనార్టీలు శరణార్థులుగా భారతదేశానికి ఐదు సంవత్సరాలకు ముందు వచ్చిన వారికి పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన చట్టాన్ని (సిఏఏ) వ్యతిరేకించడం ఎంత విచిత్రం! గతంలో సమర్ధించిన నోళ్ళే ఇప్పుడు దుయ్యబట్టడం ఎంత విడ్డూరం!
భారతదేశంలో అంతర్భాగమైన కశ్మీర్‌లో హిందువులకు భద్రత లేదు... పొరుగున ఉన్న దేశాల్లో హిందువులకు (మైనార్టీలకు) భద్రత లేదు.. ఇదెక్కడి న్యాయం? ఏ రకంగా ఇది ఆమోదయోగ్యం? ఏ ప్రమాణాలకనుగుణంగా ఇది అనుసరణీయం? 1990 సంవత్సరంలోనే ఆర్థిక సరళీకరణతో ప్రపంచాన్ని అనుసరించేందుకు భారత్ సిద్ధపడినవేళ దేశంలోని మెజార్టీ ప్రజలకు చెందినవారు ఒక ప్రాంతంలో ఇంతటి దౌర్జన్యానికి, దగాకు, దారుణాలకు గురికావడం దుర్మార్గంగాక ఏమవుతుంది? ప్రపంచంలో ఏ నాగరిక దేశంలోనైనా ఇలాంటి దుశ్చర్యకు అవకాశముందా? అలాజరిగితే ఎవరైనా ఎలా వౌనంగా ఉంటారు? పాలకుల పక్షపాత వైఖరికిది నిదర్శనం కాదా? ఊచకోతను, మానవహననాన్ని, దాడులను, అత్యాచారాలను, ఆస్తుల ధ్వంసాన్ని, ఆలయాల విధ్వంసాన్ని అరికట్టేందుకు ఏవైన లోపభూయిష్టమైన నిబంధనలు, చట్టాలు, దుర్మార్గపు నియమాలుంటే వెంటనే వాటిని తుంగలోతొక్కి, పండిట్ల మానవ హక్కులను, మాన ప్రాణాలను కాపాడకుండా దశాబ్దాలపాటు మీనమేషాలు లెక్కించడం చూస్తే మనం ఆధునికయుగంలో ఉన్నామా? మధ్యయుగాల్లో మత ఛాందసవాదుల పాలనలో ఉన్నామా? అనిపిస్తోంది. అలాంటి అమానవీయ, అకృత్య- అనాగరిక, అహేతుకమైన పద్ధతులను మొగ్గలో తుంచేస్తే ఇంతటి విషాదం, మానవ విధ్వంసం జరిగేదికాదు కదా?
మానవ నాగరికత, జీవన విధానం 70 ఏళ్ళక్రితం రెండవ ప్రపంచయుద్ధం ముగిశాక సంపూర్ణంగా మారింది. అక్కడక్కడ ఏవైనా అవరోధాలు, అడ్డంకులుంటే కొత్త ‘స్ఫూర్తి’తో పరిహరించాల్సింది మరిచి భయంతో, అదేదో బూచిని చూసి పసివాళ్ళలా జంకడం, జనహితం ఎలా అవుతుంది? రవి అస్తమించని బ్రిటీషు పాలకులను గడగడలాడించామని చెప్పుకున్న వారమేనా ఈ ఊచకోతలను, విధ్వంసాలను, మానవ జీవన విజ్ఞానాన్ని సామూహిక వలసలను కళ్ళప్పగించి చూసింది? ఆశ్చర్యం! సిగ్గుతో తలదించుకోవలసిన సందర్భం. ఓ గొప్ప నాగరికతకు, సంస్కృతికి, సంప్రదాయాలకు చిహ్నంగా నిలిచిన కశ్మీరీ పండిట్ల శోకం ఓ శ్లోకమై ఇంకా ప్రతిధ్వనించడం దారుణాతి దారుణం. ఇంతటి చీకటి అధ్యాయం ఇంకేదైనా ఉంటుందా? తాము ఏ పాపం చేయకపోయినా, చివరికి చీమకైనా అపకారంచేసి ఎరుగని లక్షలాది మంది కశ్మీరీ పండిట్లు ఎందుకు రక్తం చిందించాల్సి వచ్చింది? ఏ మానవ హక్కుల సంస్థలు, సంఘాలు దీన్ని సమర్థిస్తాయి? ఆధునిక భావజాలం గల ఏ మస్తిష్కం దీన్ని ‘సరే’నంటుంది?
మారితే ఇస్లాంలోకి మారండి.. లేదా కశ్మీర్ లోయను విడిచి వెళ్ళండి.. మొండికేస్తే కుత్తుకలు కోస్తాం.. అని నిస్సిగ్గుగా నిర్లజ్జగా, అనాగరికంగా, ఆటవికంగా తుపాకులతో బెదిరించడం 20వ శతాబ్దం చివర ఊహకందనిది. మసీదుల్లోని మైకుల్లోంచి అర్ధరాత్రి హెచ్చరించడం ధూర్తనాదంగాక ఏమవుతుంది? పసిపిల్లల ప్రాణాలుతీయడం పైశాచికత్వంగాక ఏమవుతుంది? వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న కశ్మీరీ పండిట్ల మూలాలను తొలగించ పూనుకోవడం అరాచకంగాక ఏమవుతుంది? ఈరకమైన వాతావరణం, ఊచకోత... విశృంఖలత్వం, మధ్యయుగాల మనస్తత్వాన్ని ఇంకా కొనసాగనివ్వాలని కొందరు ఇప్పటికే భావించడం ఎంతటి భావదారిద్య్రం? అసలు అలాంటివాళ్లు మనుషులని ఎలా అనిపించుకుంటారు? జ్ఞానపరంగా, నాగరికతపరంగా, మానవ హక్కులపరంగా ఎంతో ఉన్నత ఎత్తులకు చేరుకున్నామని భావిస్తున్న తరుణంలో ఇలాంటి రాక్షసకాండకు మద్దతుతెలపడం దుర్మార్గంగాక ఏమవుతుంది?
ఆ రోజుల్లో చోటుచేసుకున్న అకృత్యాలను తలచుకుని ఇప్పటికీ వణికిపోయేవారున్నారంటే ఆ చీకటి రోజులు ఎంతటి భయంకరమైనవో తేలిగ్గా ఊహించవచ్చు. తరతరాలుగా కూడబెట్టుకున్న ఆస్తులను, సంపదను దోచుకుని రిక్తహస్తాలతో తరిమికొట్టిన మూకలను, మత ఛాందసవాదులను, ఉగ్రవాదులను నిలువరించలేకపోవడం, వారికి అడ్డుకట్టవేయకుండా పొద్దుపుచ్చడమంటే అది ఏ రకమైన పాలన అనిపించుకుంటుంది? వర్తమాన అత్యాధునిక ఆయుధ సంపత్తికలిగి, మానవ హక్కులకు ఐక్యరాజ్యసమితి మొదలు అనేక సంస్థలు పెద్దపీట వేస్తున్న సందర్భంలో ఇలా నిర్లిప్తంగా, నిస్తేజంగా, నిర్వీర్య పద్ధతిలో పొద్దుపుచ్చటం రాక్షసత్వం తప్ప మరొకటి అవదు!
1989 సెప్టెంబర్ మాసంలో న్యాయవాది, పండిట్ల నాయకుడు టీకాలాల్ టప్లూను పట్టపగలు, బహిరంగంగా, అందరు చూస్తుండగా పథకం ప్రకారం వేర్పాటువాదులు కాల్చిచంపారు. భయోత్పాతం సృష్టించారు. అది లగాయతు హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, విధ్వంసకాండ విచ్చలవిడిగా సాగింది. జమ్ము-కశ్మీర్ విముక్తి సమాఖ్య (జెకెఎల్‌ఎఫ్) ‘ఆజాదీ కాశ్మీర్’ నినాద స్వరాన్ని మరింత పెంచింది. పాక్‌లో ముస్లింలే ఉండాలని, మతం మార్చుకోవాలని తుపాకులు పేలిస్తే అది పవిత్ర మతం ఎలా అవుతుంది?
ఇక పాకిస్తాన్.. మితవాదులు ఓటు బ్యాంకు రాజకీయాలను ఆశ్రయించారు. ఇస్లాం ప్రమాదంలో ఉందన్న ఓ ఉన్మాద నినాదం ఇచ్చి కశ్మీర్‌ను బుగ్గిపాలుచేశారు. స్వర్గతుల్యమైన ప్రాంతాన్ని నరక కూపంగా మార్చారు. ఈ మనస్తత్వం ఇప్పటికీ కొనసాగడం విషాదం. దేశ రాజధానిలోనూ ‘ఆజాదీ’ నినాదాలు, కశ్మీర్ హింస నచణకు మద్దతు వచనాలు, పాటలు పల్లవించడం చూస్తే ఇదెంత భయంకర స్థాయికి చేరుకుందో బోధపడుతోంది. ఇప్పటికీ పాక్ అనుకూల రాజకీయాలు చేసేవారు బోర విరుచుకుని తిరగడం విషాదం. పాకిస్తాన్ ఏర్పడిన మరుసటి రోజునుంచే అక్కడి అల్పసంఖ్యాకులపై అరాచకాలు పెరిగాయి. మతం పేర దుర్విచక్షణకు పాల్పడి, దేవాలయాలను, మందిరాలను ధ్వంసంచేసి, దౌర్జన్య పూర్వకంగా మత మార్పిళ్ళకు పాల్పడి, ఆడవారిపై అత్యాచారాలు జరిపి, పెళ్లికాని హిందూ ఆడపిల్లలను పెళ్ళాడి మతంమార్చే కార్యక్రమం అప్పటినుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. తాజాగా సిక్కు అమ్మాయిని బలవంతంగా పెళ్ళాడి మతం మార్చిన సంగతి దేశమంతటా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇది సర్వసాధారణమైనదని అక్కడి వారంటుంటే.. ఈ అన్యాయాన్ని కనీసం ప్రశ్నించేందుకు ‘‘సాహసం’’ చేయకపోవడం విడ్డూరం. ఇదిలా కొనసాగాలని కోరుకునేవారి మనస్తత్వం ఎంత క్రూరమైనదో, కిరాతకమైనదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మానవ మేధకు, కృత్రిమ మేధకు, జ్ఞానానికి, జ్ఞాన సంపదకు, మేలైన సౌకర్యాలకు, సదుపాయాలకు, సరికొత్త ఆవిష్కరణలకు, ఆధునిక విజ్ఞానానికి హద్దులులేవని చాటిచెబుతున్న, ‘రీ డిజైన్’ అయిన ఈ సమాజంలో అరాచకాన్ని, మధ్యయుగాల మనస్తత్వాన్ని, మతంపేర ఉన్మత్తతతో ఊరేగే వారిని, విధ్వంసాలకు పాల్పడే వారిని, మానవ హననానికి పూనుకునేవారిని, విస్థాపనకు ప్రోత్సహించే వారిని, మానవత్వ విరోధులను ‘కట్టడి’ చేయడం ఈనాటి ఆవశ్యకత! అందుకు కదం తొక్కడం నేటి అవసరం!
*
(కశ్మీర్ పండిట్ల మహావలసకు 30 ఏళ్లు)

-వుప్పల నరసింహం 99857 81799