Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఎట్టి యవరోధములనైన బట్టుపట్టి
యధిగమింపంగ ఁ దలబోయ నందుకునెద
రద్భుతంబగు ఫలముల నంత కడకుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కార్య నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా దీక్షా పట్టుదలతో అధిగమించాలని తలబోసిన పక్షంలో చివరికి అద్భుతమైన ఫలితాలను అందుకుంటారనడంలో సందేహించవలసిన పనిలేదని కర్మసాక్షియైన ఓ సూర్యదేవా! లోకాన తెలియజెప్పుమయ్యా!
తే.గీ. చేయవలసిన కార్యాల ఁజేయఁ బోరు
చేయకూడని కార్యాల ఁ జేతురకట!
క్షణము యోచింప ఁ బోరెయిక్కాలమందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈ కాలంలో చాలామంది తాము చేయవలసిన పనులను చేయడానికి ఉత్సాహం చూపరు. పైగా చేయవలసిన పనులను చేయకుండా కాలయాపన చేసేవారెక్కువ. కానీ వీరిలో చాలామంది ఒక్కక్షణమైనా ఆలోచింపక నే చేయకూడని పనులు చేస్తున్నారు. యుక్తాయుక్తవిచక్షణాజ్ఞానాన్ని కలిగియుండాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈలోకానికి తెలియజేయుమయ్య.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262