Others

జీవన సాఫల్యతకు ప్రతీక తూనీగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైనోసార్లు భూమీద
ఆవిర్భవించక ముందే
పెద్ద రెక్కలతో
తూనీగల ఆనవాళ్లు
కలుషితం కాని నీరు
ఉన్నచోటు
నీటి మొక్కలు విరివిగా
ఉన్నచోటుగాలిలో
అపురూప విన్యాసాలు చేస్తూ
తూనీగలు
విస్మయం కలిగించేవి
ఆ తూనీగల జీవిత చక్రం
ఆద్యంతం ఉత్కంఠ భరితమే
లార్వాలు నెలలు
సంవత్సరాల తరబడి
నీటిలోనే జీవిస్తూ
పురిటి నొప్పులు పడుతూ
పది పదిహేను లార్వాదశలతో
మార్పు చెందుతూ
స్వేచ్ఛగా ఎగిరేది
మాత్రం కొద్దికాలమే
తూనీగల ఉనికి
పర్యారణ
పరిశుభ్రత కు సూచిక
గుండ్రటితలతో
ఉబికి వచ్చిన
రెండు నేత్రాలు
రెండు జతల
పారదర్శకపు రెక్కలు
ఎల్లవేళలా
విమానం రెక్కల్లాగా
తెరచి ఉంటాయి
మెదడు నిర్మాణం
అమరిక శక్తియుక్తులు
అమోఘమైన
సునిశిత దృష్టిలో నిక్షిప్తం
సంయుక్తనేత్రాలు
అన్ని కోణాల్లో దృష్టిసారిస్తూ
గాలిలో కంపనలతో
విన్యాసాలు చేస్తూ
కీటకాలను వేటాడుతాయి
ఎగిరే దోమలు,
ఈగలు, కీటకాలను
కాళ్లతో బంధించి
కళాత్మకంగా కబళిస్తాయి
నాలుగు రెక్కలు స్వయంప్రతపత్తితో
గాలిలో ఎగిరే కోణం మార్చి దిశానిర్దేశం చేస్తాయి
హెలికాప్టర్ లా
ఉపరిభ్రమణాలు చేస్తాయి
ఈ నైపుణ్యం
మరే కీటకాల్లోనూకానరాదు
రెక్కలపై శరీరంపై
ప్రసరించె కాంతితో వర్ణ దీప్తితో
ఇంపుగా ఎగిరే దృశ్యాలు
సొగసైన
అలంకరణలతో సాగిపోయే
బ్యాలట్ నృత్యంగా
కనువిందు చేస్తాయి.
జీవితంలో సాఫల్యతకు
ప్రతీక తూనీగ
జతకట్టే ఆడ మగ తూనీగలు
ఒకదాని వెనుక ఒకటి
గాలిలో ఎగిరి
వలయాకారంగా
సంగమించే భంగిమ
ఎక్రోబాటిక్
క్రీడా భంగిమను తలపిస్తుంది
ఇది కీటక సామ్రాజ్యంలోనే
క్లిష్ట ప్రక్రియ
గుడ్లు పెట్టే పరిసరాలు
నచ్చకపోతే
ఆడ తూనీగ జతకట్టటానికి
నిరాకరిస్తుంది
అనూహ్యంగా
జతగాడిని విడిచి సంగమిస్తే
జతకట్టిన మగతూనీగ
వెంటనే స్పందించి
నిర్దయగా
వీర్యకణాన్ని తొలగిస్తుంది
పైగా తన స్వంత వీర్యకణాల్ని నిక్షిప్తం చేస్తుంది
గుడ్లు పెట్టే వరకు
బాసటగా కాపలా కాస్తుంది
ప్రకృతిలో
స్వంతసంతతి వృద్ధికి
తూనీగలు పడే ప్రయాస
అద్భుతం ఎగిరే తూనీగలే
ప్రేరణాస్ఫూర్తితో తూనీగల్లా
తేలిపోయే రోబోట్లను
సృష్టించాలని ఇంజనీర్ల
చిరకాల స్వప్నం

-ఆచార్య పసుల వెంకట రెడ్డి 7013559809