Others

నిర్దిష్ట జీవన లక్ష్యమై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యం అహింస మొక్కవోని
పట్టుదలే జీవనాధారంగా చేసుకో
బాపుకన్న కలలన్నీ
సమూహమై సాకారం చేసుకో
బాపూ ఓ అఖండ జ్యోతి
విశ్వమే ఆ వెలుగులో దేదీప్యమానవౌతోంది
బాపు ఓ ఆలోచన
జగమంతా ఉద్విగ్న భరితమై కదులుతోంది
బాపు దార్శనికతే
మనదై మమేకమై భారతీయతను విస్తరించు
దృక్కులన్నీ ఆ వైపుకే
బాపుజీ చూపిన దారుల వైపే
కదం తొక్కు తూ వడివడిగా అడుగులు
బాపూ చూపిన దారుల వైపే
కార్యకార్యాచరణల అంతరాలను
అంతం చేసి ఆత్మోద్ధారణ చేసుకో
ఆంగ్లేయులకెదురళ్లి ఎదుర్కొన్న ఓ సత్తా
ఓ అఖండ అద్భుతమే బాపూ
బాపు ఓ వ్యక్తికాదు అద్వితీయ అంతశే్చతన
కథనమో మరణమో నిర్దిష్టజీవన లక్ష్యమై
కదులుతూ పో!

- డా. కీర్తికాలె
అనువాదం : డా. ఎస్. శైలజ
(ఆకాశవాణి హైదరాబాద్ సర్వభాషాకవి సమ్మేళనం -2020 లో చదివిన కవిత)