Others

సర్వవిద్యాప్రదాత సరస్వతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని ‘‘వాగేశ్వరీ, వాగ్వాదినీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, నకులీ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’ అనే రూపాలుకలిగిన శ్రీ సరస్వతీ దేవిని ఆరాధించిన వారికి సకల విద్యలూ కరతలామలకం అవుతాయ. బుద్ధి, జ్ఞానశక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి ‘సరస్వతి’కనుక ‘శ్రీపంచమి’న విశేషంగా ఈ తల్లిని అర్చించి ఆమె కృపకు పాత్రులై తరించడానికి ఈ శ్రీపంచమి ఉత్తమమార్గమని చెబుతారు.
అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ కనుక ఈ తల్లిని జ్ఞానప్రాప్తికోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. పంచమి నాడు విద్యాదానం చేసిన వారికి వచ్చే పుణ్యాన్ని లెక్కకట్టలేమని పురా ణాలు చెబుతున్నాయ. విద్యవల్లనే అధికారము, ధనము సంప్రాప్తవౌతాయని వాటిని మరలా వాటిని సక్రమమార్గంలో వినియోగించడానికీ కూడా ఆ తల్లేమార్గం చూపించాలని అందుకే మాఘ పంచమినాడు లక్ష్మీ సరస్వతు లను పూజించాలనీ పెద్దలవాక్కు. తెల్లని పూలతో అంటే జాజి, మల్లెలాంటి పూలతో పూజించి, అమ్మవారిని శే్వత వస్త్రాలతో అలం కరించి, సరస్వతీ అష్టోత్తరశత నామావళిని పఠించి అమ్మ వారికి తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నాన్ని, నేతి పిండి వంటలను, చెరకును, అరటి పండ్లను, నారి కేళాన్ని నివేదన చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పెద్దలవాక్కు సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు. వంగదేశంలో ఎక్కువగా చేసే ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని మదన పంచమి అనే పేరిట సరస్వతీ దేవిని ఉపాసిస్తారు.
శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘ మాసంలో పంచమి తిథినాట సరస్వతీ దేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజ లు చేయడం అనాదిగా వస్తున్నదే. పూర్వం వ్యాసవాల్మీకాదులు అశ్వలాయ నుడు, ఆదిశంకరాచార్యులు ప్రసిద్ధులైన వాగ్గేయకారులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.

- వాణీ మూర్తి 9849481823