Others

మేనుకు మెరుపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరటిపండ్లను, అరటికాయ, దూటలతో చేసే కూరలను ఇష్టపడనివారు అరుదుగా ఉంటారు. అరటిపండు అజీర్ణానికే కాదు చర్మం సొగసును పెంచటానికి దోహదం చేస్తుంది. వయసును కనబడనీయకుండా, వన శోభతో చర్మాన్ని వెరిపింపజేసే గుణం అరటికి సొంతం అని వేరే చెప్పనవసరం లేదు.
అరటిపండు గుజ్జుకు కొంచెం దోసగింజల పొడి, పాలు చేర్చి పేస్టులా చేసి ముఖానికి రాసుకుంటే, ఎండవల్ల దుమ్మువల్లా చర్మంలోకి చేరిన మాలిన్యాన్ని పోగొట్టవచ్చు. ఈ మిశ్రమ పేస్టులో పాలకు బదులు పెరుగును జత చేసి వాడుకోవచ్చు లేదా ఒక చెంచా తేనెనూ కలిపి రాసుకోవచ్చు. దీనివల్ల చర్మం మృదువుగా తయారై కాంతివంతమవుతుంది.
ఇంకా అరటిపండు గుజ్జుకు, రెండు చుక్కల నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లని సొన కలిపి ముఖానికి బాగా రాసి, ఆరిపోయిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయటంవల్ల చర్మంలోని నలుపు, కళ్ళకింది నల్లని వలయాలు పోతాయి. ఒక చెంచా పాలు, రెండు చెంచాలు గోధుమ పిండి ఒక అరటిపండు గుజ్జుకు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తరువాత నూలుబట్టను (కాటన్ క్లాత్) పాలలో ముంచి ముఖానికి అదిమి మెల్లగా తీసివేయాలి. ఇలా చేయడంవల్ల చర్మానికి అదనపు కాంతి వచ్చి చేరుతుంది. ఇది మామూలు చర్మంగలవారికి చిట్కా. అదే జిడ్డు చర్మం గలవారైతే గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
కురులు రాలిపోతూంటే అరటిపండ్లతో కండిషనర్ తయారుచేసుకోవాలి. ఒక పండిన అరటి పండును మిక్సీలో మెత్తగా రుబ్బి, దానికి మూడు చెంచాల ఆలివ్ నూనె, ఒక నిమ్మకాయ రసం, రెండు చెంచాల మెంతి పొడి చేర్చి మిశ్రమంలా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అంటే కురులకు ప్యాక్‌లా వేసుకుని పది నిముషాల తరువాత బాగా కడిగేయాలి. ఈ విధంగా రెండు మూడుసార్లు చేస్తే రెండు వారాలలో కురులు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. కురులు అందంగా మెరుస్తూంటాయి. *