Others

జ్యోతిష్య విభవము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బృహజ్ఞాతకము, బృహత్పఠాశరహోర, సారావళి, హోరాసార, జాతక పారిజాతము, జాతక మార్తాండ కాళిదాసు ఉత్తరకాలామృతం మొదలగునవి. ఇంత చేసినా 50 శాతం శాస్తమ్రు, 40 శాతం అతీంద్రియ జ్ఞానముపై ఫలిత నిర్దేశము వుంటుంది. ఎంతోమంది జ్యోతిష్యవేత్తలు చెప్పే ఫలితాలు జరుగుటలేదు. బి.వి.రామన్ శతాధిక గ్రంథకర్త ఆస్ట్రాలజికల్ మాగజైన్‌లో ఇలా వ్రాశారు.
‘్ఫలానిగ్రహచారణ సూచయన్తి మనీషిణాః
కోవక్తాతార తస్యశ్య తమేకం వేధసం వినా
దోజ్ హూ కెన్ నో ఆస్ట్రాలజీ కెన్ ఓన్లీ ఇండికేట్ ఇన్ ఎ వే వాట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్, హూ ఎల్స్ ఎక్సెప్ట్ ది క్రియేటర్ బ్రహ్మ కెన్ సే ఇన్ ది సర్టెనిటీ వాట్ విల్ డిఫనెట్లీ హపెన్. ఇది జ్యోతిష్కులు గుర్తుంచుకొనవలసిన వాక్యము.
వశిష్ఠుడు, బ్రహ్మర్షి, శ్రీరామచంద్రుల వారి పట్ట్భాషేక నిర్ణయం చేస్తారు. కనా ఆ సమయంలో వైష్ణవ మాయ కమ్మి ఆ ముహూర్తమునకు రాములవారు అడవులకు వెళ్లిల కష్టాలు అనుభవించి రావణ వధతో లోకకల్యణము చేసారు. మరి కర్మ గొప్పదా? శాస్తమ్రు గొప్పదా? చెప్పినవాడు బ్రహ్మర్షి. శింశుమార చక్రం (షట్చక్రాలలో అనాహతం) వరకే గ్రహస్థితి. పంచభూతాలకు నవగ్రహాలకు షట్చక్ర సంబంధం వుంది.
భగవంతుడు గ్రహ, రాశి, నక్షత్రముల ద్వారా, 84 లక్షల జీవరాశులను (క్రిమి కీటక, పశు పక్షి, మరియు మానవులను) మహర్దశ, అంతర భుక్తుల రూపమున ఆగమ, సంచిత, ప్రారబ్ద కర్మలను అనుభవించుటకు సుఖ దుఃఖాలను ప్రసాదించుచున్నాడు. కావున ధ్యానం ద్వారా తేజస్సును పెంచుకొని ఆత్మానందము పొందవచ్చును. షట్చక్రాలలో మూలాధారము దగ్గర బుధుడు అపానవాయు నియంత్రణ (్భలోకంలో) స్వాధిష్ఠానము దగ్గర చంద్ర శుక్రులు వ్యాన వాయు నియంత్రణ (్భవర్లోకంలో), అనాహత చక్రం వద్ద శని ప్రాణవాయు నియంత్రణ (మహర్లోకంలో) విశుద్ధ చక్రం (జనోలోకం) వద్ద గురువు ఉదానవాయు నియంత్రణ చేశారు. గ్రహగతులు విశుద్ధ చక్రాన్ని దాటిపోలేవు.
ఇప్పటి జ్యోతిష్కులు అంతర్మధనము చేసుకొని ఆత్మావలోకనం చేసుకొని వారి స్థానము ఎక్కడో వారే నిర్ణయించుకొని ఆత్మశక్తిని పెంపొందించుకొనవలెను. మనము చూస్తున్నాము ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ముహూర్తాలు, పంచకరహితంగా, సప్తవింశతి దోషాలు లేకుండా పెట్టుతున్నారు. చివరకు అవి తుస్సుమనుటే కాక, మహాజటిలంగా తయారౌతున్నాయి. కారణము అహంభావము, ధనార్జన, సంఘంలో పలుకుబడి కోసం ఆరాటం. వికృతమైన పోటీ. అమాయకపు ప్రజల బలహీనతతో సొమ్ము చేసుకొంటున్నారు. శాస్త్ర దోషము లేకుండా ముహూర్త నిర్ణయము చేసినా తపశ్శక్తి చాలినంత లేకపోవడము వలన ఫలనిర్దేశము చేయలేకపోతున్నారు. జ్యోతిష్యశాస్తమ్రు ముందు చెప్పినట్టు, 50 శాతం శాస్తమ్రుతో 50 శాతం అతీంద్రియ శక్తిపై ఆధారపడి వుంది. లగ్నముకు తొమ్మిదవ రాశి పూర్వ పుణ్యస్థానము మరియు పితృస్థానము. దీనిలోని బలము అంతరదృష్టితో చూడవలసినదే.
గర్భస్థకుండలి
ఈ విషయానికి వస్తే దీనిని గణించు పద్ధతి లేదు. కారణము దీని లగ్న సమయం, ఇన్‌స్ట్యూషన్ ద్వారానే కనుగొనవలెను. దీనిని గురించి ఒక వ్యాసము 1996 సం. ది ఇలెస్ట్రేటెడ్ వీక్లీలో ప్రచురించబడినది. నారాయణదత్త గంగూలి అనే మహారాష్టక్రు చెందిన వ్యక్తి ఏదో ఆధ్యాత్మిక దాహంతో తల్లి, భార్య కుటుంబాన్ని వదలి వారణాశి చేరి అక్కడ ఒక అవధూతను గుర్తిస్తాడు. 15 రోజులపాటు అతని వెంట వుంటాడు. ఆ అవధూత కసురుకొన్న, పిచ్చి పిచ్చిగా తిట్టినా అతనిని వీడక వుంటాడు. ఆ స్వామి వున్న చిన్న కుటీరంలో మట్టి పొయ్యి, పెనము తప్ప ఏమీ లేదు. తాము ఇంటినుండి తెచ్చుకొన్న పిండితో రొట్టెవేసి అవధూతకు పెట్టేవాడు. ఒకటి రెండు రోజులు విసిరిగొట్టినా తర్వాత ఆ ఆహారము స్వీకరిస్తాడు. ఆ అవధూత సంతసించి గంగూలీగారికి ఏమి కావాలో కోరుకొమ్మంటాడు. ఏది అనుగ్రహించినా సంతోషంగా స్వీకరిస్తానని గంగూలీ గారంటారు. అనర్గళంగా అవధూత 200 సంస్కృత శ్లోకాలు ఈ గర్భస్థ కుండలి గూర్చి చెప్పారు గంగూలీగారికి.
ఏ జ్యోతిష్య గ్రంథాలలో ఇది కనిపించదు. దీని సారాంశము మేల్ స్పెర్మ్, ఫిమేల్ ఎగ్ కలిసిన క్షణం లగ్నము. ఈ సమయము భార్యాభర్తలకు కూడా తెలియదు. నారాయణదత్తగారు ‘లగ్న’ గణను గ్రంథరూపాన ప్రచురిస్తారన్నారు. ఎందుకో అది వెలుగు చూడలేదు. ఈ లగ్నము యొక్క కచ్చితమైన సమయము (సెకండ్లలో) తెలిస్తే 100 శాతం శాస్త్ర ఆధారముతో భూత, భవిష్యద్వర్తమానాలు చెప్పవచ్చు అన్నారు. ఏ లోకం నుండి జీవుడు వచ్చాడు, పూర్వజన్మ ఏది, జననం నుండి జీవుడు పొందు సుఖ ఉఃఖాలు, మరణానంతరము ఏ జన్మ ఎత్తుతాడు, ఏ లోకానికి వెళ్తాడు, మరణము ఎప్పుడు సంభవిస్తుంది శాస్త్ర ఆధారముతో చెప్పవచ్చన్నాడు. ఇక్కడ నేను ఒక శ్రోత్రియ బ్రాహ్మణుని ఈ లగ్నము ఎలా కట్టవచ్చు అంటే వారు శిశువుకు ప్రాణప్రవేశము, శిశు జననము నుండి వెనుకకు వచ్చి వైద్య సహాయముతో తెలుసుకొని ఆ లగ్నముతో ఫలిత నిర్దేశము దగ్గరగా చేయవచ్చన్నారు. ఏది ఏమైనా ఈ లగ్న గణన అంతర్నేత్రముతో కనుగొనవలసిందే.
జ్యోతిష్యశాస్త్రం తెలుసుకున్న, జరుగుతున్న రాబోయే మంచి చెడు సంఘటనలను ఆపగలదా?
మనము కర్మ జీవులం. మన జీవనము కాలము కర్మతో ముడిపడి వుంది. బ్రహ్మలోక పర్యంతము కాల చక్రంలో వస్తుందని గీతాచార్యులు చెప్పారు. ఈ జనన మరణ చక్ర పరిభ్రమణము నుండి బయటపడేంతవరకు ఈ రెండు కాలము, కర్మ జీవులను వెంటాడుతూనే వుంటుంది. ఈ కర్మ మూడు విధములు. 1.సంచితం 2. ప్రారబ్దము 3.ఆగామి. నిష్కామ కర్మతో శరణాగతితో పరమాత్మ పాద పంకజములను వేడుకుంటే ఆగామి, సంచితాలు తీసుకొనుటకు అతను వెనుకాడడు. ప్రారబ్ధ కర్మలు రెండు విధాలు. 1.ఆరబ్ధ కర్మలు 2.అనారబ్ధకర్మలు. ఆరబ్ధ కర్మలు మాత్రము జీవుడు అనుభవించవలసినదే. తాను అవతార పురుషుడైనా ఈ సృష్టి నియమము పాటిస్తాడు. అనారబ్ధ కర్మలు దగ్ధము చేస్తాడు. రాశి చక్రంలో 12 రాశులలో మొదటి రాశులు 4 సంచము, తర్వాత నాలుగు ప్రారబ్దము, మిగిలిన నాలుగు ఆగామిగా వుంటాయి. ఇంకా భగవంతుని పరిపూర్ణ భక్తితో ఆరాధిస్తే మంత్ర, తంత్ర, జప శాంతులతో ప్రారబ్ధాన్ని నిరోధించవచ్చు.
ప్రమాణం: ‘ఐ హైవ ఫలదం కర్మప్రారబ్ధం ప్రతిబద్ధ్యచ
ఫలం దదాతి స్వప్నేవ జాగ్రత్ కాలేధవ్యాః
మంత్ర, తంత్ర దీక్షులైన యోగులు, గురువులు ఆచరించు శాంతి, పౌష్టిక కర్మలు ప్రారబ్ధాన్ని నిరోధించగలవు. ఈ ప్రారబ్ద శేషం, స్వప్నములో గాని, దేహాంతరములోగాని అనుభవములోకి వచ్చును. ఇది కర్మ సిద్ధాంతము. నిరంతర ప్రయత్నము కర్మ ఫలాన్ని మార్చగలదు. యోగవాశిష్టం- ముముక్షు వ్యవహార ప్రకరణము పంచ సర్గ - 5వ శ్లోకంలో సమానబలం కలిగిన రెండు పొట్టేళ్ళు పరస్పరం పోట్లాడుకున్న సందర్భంలో తక్కువ బలం వున్న పొట్టేలు వెనుకకు ఒదిగినట్లుగా ప్రాక్తనకర్మలు, ఐహికకర్మలు, నిరంతరము పోట్లాడుకొని అందులో అల్పబలం కలిగిన కర్మఫలం పక్కకు తప్పుకొంటుందని వశిష్ఠుడు రామునితో చెపుతాడు. ఇదంతా నా కర్మ అనుకో పనిలేదు. అంతరంగ భక్తి, జ్ఞాన, వైరాగ్య, జ్వాలతో, పరమాత్మ తప్పక అనుగ్రహించి ప్రారబ్ధము అనుభవించినా దూదిపింజలాగ కష్టాన్ని తీసివేస్తాడు. గ్రహములన్నీ పరమాత్మ అనుహ్రమువల్ల సృష్టించబడినవి. అవి స్వతంత్రంగా ఏవీ ఇయ్యవు. మన కర్మ ఫలితము వలన వాటి పొజిషన్స్ ఖగోళంలో ఏర్పడతాయి.
శ్రీవిద్య ఉపాసకులు ఇలా అంటారు. శ్రీమాత అనుగ్రహిస్తే రాతలే కాదు, సూక్ష్మాంశల గ్రహాలు అనుకూల దిశకు వస్తాయి. శంకర భగవత్పాదులు రచించిన సౌందర్య లహరి 8వ శ్లోకము వ్యతిరేక గ్రహస్థితి మారి అనుకూల గ్రహస్థితులు ఏర్పడుతాయని జ్ఞానులు చెబుతారు.
శ్లో నఖైర్నాక స్ర్తిణాం కరకమల సంకోచశ శిభిః
తరూణాం దివ్యానాం హసత ఇవతేచండి చరణౌ
ఫలాని స్వస్థ్సేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం
దరిద్య్రే భ్యో భద్రాం శ్రీయ మనిశ మహ్నాయదదతౌ
తా ఓ చండికా! పేదలకు సిరులనిచ్చే నీ చరణాలను వేల్పుల హస్త పద్మ కాంతిని మించి నీ కాలిగోళ్ళు వేల్పులకు కోర్కెను తీర్చు కల్పవృక్షాలను మించి ఉన్నాయి.
జాతకాలు ఎవరో ఏదో చెప్పినా, నిర్భయంగా శ్రీమాత చరణాలను ఆశ్రయిస్తే సర్వశాంతులను ఆమె ప్రసాదిస్తుంది.
*
సమాప్తం

- కె. రఘునాథ్.. 9912190466