Others

ముఖ్యమంత్రే ‘తప్పు’లో కాలేస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జాతిపితగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు, గౌరవం పొందారు. జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన మాటలను కేసీఆర్ విభేదించి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకించడం విచారకరం. ఆరు సంవత్సరాల క్రితం కేసీఆర్ మస్తిష్కంలోంచి వెలువడిన ప్రతి ఆలోచనా అద్భుతం. తిరుగులేనిది. అతని విరోధులను సైతం చకితుల్ని చేసింది. ఆ ప్రసంగాలు, భావాలు అగ్గి రాజేశాయి. ప్రపంచమే ఆయన వెంట నడిచింది. అలా ఎనలేని కీర్తిని ఆర్జించారు. తెలంగాణ సార్వస్వతమేగాక సర్వస్వం ఆయన చేతి వేలి కొసలమీద, నాలిక చివరన అలవోకగా కదిలింది. ఆ భాష, యాస, చణుకులు, చతురోక్తులు, సామెతలు, సందర్భోచిత పద్యాలు ప్రజల్ని ఉర్రూతలూగించాయి.
ఆయన ప్రయాణమంతా నిజం, సత్యం, వాస్తవాలతో కొనసాగడంతో దాన్ని ‘‘చణికీ’’ సాహసం ఎవరూ చేయలేకపోయారు. నిర్నిరోధంగా, ఓ అగ్నిశిఖలా జలిస్తూ,- కదులుతూ ఉన్నారు. కానీ ఇటీవల పత్రికా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. ‘‘పౌరసత్వ సవరణ చట్టం వంద శాతం తప్పు. అది రాజ్యాంగ వ్యతిరేకమైనది. దీనిని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కొట్టిపారేయాల’’ని తీవ్రంగా స్పందించారు.
ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. కేసీఆర్ స్పందనకు కొన్ని రోజులముందే సీఏఏ అమలుపై ‘స్టే’ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. మరి సుమోటోగా తీసుకుని కొట్టిపారేసే వీలెక్కడుంది? సీఏఏ వంద శాతం తప్పయితే, అది రాజ్యాంగ వ్యతిరేకమైనదే అయితే సుప్రీంకోర్టు కనీసం వెంటనే ‘స్టే’ ఇవ్వాలి.. కానీ అలా జరగలేదు. అలా జరగలేదంటేనే అది రాజ్యాంగ వ్యతిరేకం కాదని తేటతెల్లమవుతోంది. పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగింది. భారీ మెజార్టీతో బిల్లు పాసయింది, చట్టంగా మారింది. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో ఎంతో చర్చ జరిగింది. పిసరంత తప్పుదొరికితే పట్టుకుని బిల్లు పీచమణిచేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. మల్లగుల్లాలు పడ్డాయి. కాని ఆ బిల్లులో వ్యతిరేకించడానికి ఏమీ కనిపించలేదు. చివరకు మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ సైతం లక్షణమైన ఏ ఒక్క తప్పును కూడా ఆ బిల్లులోంచి వెలికి తీసి చూపలేకపోయారు. రాజకీయంగా వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకిస్తూ ఆవేశంగా ప్రసంగించడం తప్ప అందులోంచి కించిత్ తప్పును తీయలేదు. ఇట్లా ఎన్నో వడపోతల, చర్చల, వాదోపవాదాల అనంతరం వెలుగుచూసిన ‘‘పవిత్ర చట్టం’’ పనికిమాలినదిగా తేల్చేయడం ఏ రకంగా ధర్మమవుతుంది?
ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా 1947లో ఇండియా (్భరత్) విభజన జరిగింది. ఆనాడు జిన్నా కాపట్యం, ముస్లిం లీగ్ అధికార లాలస, కొందరు జమీందారుల, ధనవంతుల ప్రయోజనాల కోసం దేశం రెండు ముక్కలైంది. ఆ రకంగా ముస్లింలు పాకిస్తాన్ వైపు, హిందూ సమాజం భారతదేశంవైపు కదిలారు. ఇది అధికార పూర్వక విభజన.. బట్వాడా.. ఇందులో వివాదం ఏమీ లేదు. అయితే ఇక్కడే తిరకాసు వచ్చింది. ముస్లింలు అందరూ భారత్‌నుంచి పాకిస్తాన్‌కు వెళ్ళళేదు.. పాకిస్తాన్‌లోని హిందువులందరూ భారత్‌కు రాలేదు. దాంతో సమస్య జటిలమైంది. మత ప్రాతిపదికన సంపూర్ణ విభజన కాలేకపోయింది. పాకిస్తాన్‌ను ఇస్లాం (మత) దేశంగాకాక సెక్యూలర్ దేశంగా తీర్చిదిద్దుతామని ఆ దేశ జాతిపిత జిన్నా మాట ఇచ్చారు. అల్పసంఖ్యాక వర్గాలకు ఎలాంటి ‘హాని’ కలగదని, వివక్ష ఉండదని ప్రజాస్వామిక దేశంగా ముందుకు సాగుతామని భరోసా ఇచ్చాడు. దాంతో ముస్లిం లీగ్‌లోని జోగిందర్‌నాథ్ మండల్ లాంటి హిందూ నాయకులు పాక్‌లోని అల్పసంఖ్యాక వర్గాలకు ఆనాడు ధైర్యం చెప్పారు. సోదరభావంతో కలిసి నడుస్తామని చెప్పారు. కానీ పరిస్థితులు భిన్నంగా మారాయి. పాకిస్తాన్ ఏర్పడిన తొలి రోజుల నుంచే అల్పసంఖ్యాకుల పట్ల వివక్ష, అవహేళన, అణచివేత, చిన్నచూపు ప్రబలంగా కనిపించసాగింది. దాంతో కలకలం బయలుదేరింది.
ఏడు దశాబ్దాల క్రితం జాతిపిత చెప్పిన ప్రకారమే, కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనల మేరకు అక్కడి అల్పసంఖ్యాకులకు భారత పౌరసత్వం కల్పిస్తున్న సీఏఏను తెలంగాణ జాతిపిత కేసీఆర్ వ్యితిరేకించడం విడ్డూరం గాక ఏమవుతుంది? ఆయన కీర్తికిదొక మచ్చ. తానెంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. కానీ కేసీఆర్ భావధార, భాస్వరం లాంటి ఆయన ఆలోచనాస్రవంతిలో ఎక్కడో చిన్న అడ్డుకట్ట పడింది. అద్భుతమైన ఆయన విజన్‌ను ఓ చిన్న మంచు బొట్టు మసకబార్చింది.
మహాత్మాగాంధీయే కాదు ఆ తరం కాంగ్రెసు నాయకత్వమంతా ఆనాటి విషమ పరిస్థితులు, కల్లోల్లాన్ని నిశితంగా పరిశీలించి గాంధీ సూచన సరైనదేనని బహిరంగంగా ప్రకటించారు. తీర్మానాలు చేశారు. మానవత్వంతో స్పందించారు. ఉదారతను ప్రదర్శించారు. అకస్మాత్‌గా 2019 సంవత్సరంలో ఆ చట్టం పార్లమెంట్‌లో పాసయ్యాక కొన్ని రోజులకు అందులో ముస్లింలను ఎందుకు చేర్చలేదు? ఇది హిందూ ఫాసిస్టు ప్రభుత్వం కాబట్టి వారికి స్థానం కల్పించలేదు, భారతదేశాన్ని హిందూ మత దేశంగా మార్చేందుకు ‘‘కుట్ర’’ జరుగుతోందని ఒంటికాలి మీద కొందరు లేవడంతో.. అదే అదనుగా ఓ మంచి ఆయుధం దొరికింది కదా అని ప్రతిపక్షాలు, వామపక్షాలు, రాజకీయ నిరుద్యోగులు వీధుల్లోకొచ్చారు. రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకునే శక్తులు.. విచ్ఛిన్నకారులు విద్యార్థులను, యువకులను ఉసిగొల్పారు. ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల్లో అగ్గిరాజేశారు.
విచిత్రమేమిటంటే.. సెక్యూలర్ దేశంగా ఆవిర్భవించిన పాకిస్తాన్‌ను ఇస్లాం దేశంగా, మత వివక్ష చూపే దేశంగా ‘‘ఎందుకు మార్చారు?’’ అని ఏ ఒక్క వామపక్ష రాజకీయ నాయకుడు, లిబరల్ ఆలోచనాపరుడు, దేశ విభజనకు కారకులైన కాంగ్రెసు నాయకులు, వారి వారసులు పాక్‌ను ప్రశ్నించలేదు. సెక్యూలర్ దేశంనుంచి ఇస్లాం దేశంగా మారిన అనంతర పరిణామాల కారణంగా, జాతిపిత గాంధీ మరికొందరు ఇచ్చిన హామీవల్ల తమ సొంత దేశానికి అక్కడి అల్పసంఖ్యాకులు, ఐదు సంవత్సరాలకు పూర్వమే వచ్చి పౌరసత్వం లేక పడరాని పాట్లుపడుతూ, అభివృద్ధికి దూరంగా ఓ రకమైన ‘‘అస్పృశ్యులు’’ గా ఉన్న వారిని ఆదరించి పౌరసత్వం కల్పించి అక్కున చేర్చుకుంటే అదెలా అమానవీయమవుతుంది? అదెలా రాజ్యాంగ విరుద్ధమవుతుంది? అదెలా మతతత్వమవుతుంది?
భారత రాజ్యాంగంలో ‘లౌకిక’ అనే పదం తరువాత చేర్చారు. అలాగని అంతకుముందు ఆ భావన లేదని కాదు. వేల సంవత్సరాలుగా భారతదేశ ఆత్మ ఇదే! అయినప్పటికీ రాజ్యాంగంలో పొందుపరచాలన్న ఒత్తిడితో పొందుపరిచారు. అంతకుముందు.. ఆ తరువాత ఈ విషయమై వ్యతిరేకత లేదు. కేసీఆర్ లాంటి మేరునగధీరుడు సీఏఏ విషయంలో తప్పటడుగువేయడం విషాదం. ‘తప్పు’, (పప్పు)లో కాలేయడం జీర్ణించుకోలేని అంశం. కేసీఆర్ నోట సీఏఏ రాజ్యాంగ వ్యతిరేకమన్న మాట ఆశ్చర్యాన్ని కలిగించింది. అనేక పుస్తకాలు, రాజ్యాంగాన్ని ఔపోసన పట్టిన కేసీఆర్ ఆ చట్టమెలా రాజ్యాంగ వ్యతిరేకమో వివరించలేదు. భారత రాజ్యాంగం భారత ప్రజలకు సంబంధించినది. వారిని శాసించేది, సవరించేది. సీఏఏ మాత్రం పాక్, అఫ్ఘన్, బంగ్లాదేశ్ అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించింది. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. మరి అదెలా రాజ్యాంగ విరుద్ధమవుతుంది? రాజ్యాంగానికిది మరింత వనె్న తెచ్చే చట్టం.. దాన్ని ఇంతగా ద్వేషించడం.. భవిష్యత్‌లో దీని ఆధారంగా పౌరులకు ‘‘ముప్పు’’ కలుగుతుందని, ఏవేవో కాగితాలు చూపించమంటారని, పూర్వీకుల ఆధారాలు తెలపమంటారని ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడానికి మించిన దారుణం మరొకటి కనిపించదు.
సీఏఏ వ్యతిరేకత దేశాన్ని విభజించాలన్న జిన్నా ఆలోచనల్ని మరోసారి ప్రేరేపిస్తోంది. థర్డ్‌ఫ్రంట్‌తో దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆశించిన కేసీఆర్ ఆనాటి విశే్లషణల, వింగడింపు, డేటా, దూరదృష్టి అంతా ఏమయింది? ఉన్నతమైన భావాలు, ఆలోచనలు, అబ్బురపరిచే రాజకీయ విద్వత్, చతురత, ఆగామి సంగతులను ‘ముందుగానే పసిగట్టే నైపుణ్యం’ ఇలా దుబారాగా ఖర్చుచేయడం, ఊహాత్మక సమస్యపై ఊగిపోవడం పూర్తిగా విడ్డూరం. అవసరమైతే పది లక్షల మందితో సభ జరుపుతామనడం మరింత నివ్వెరపరిచే అంశం. ఈ విషయమై అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే పది లక్షల మందితో హైదరాబాద్‌లో ‘‘మార్చ్’’ నిర్వహించారు. అనేకమందికి అసౌకర్యం కల్పించారు. మరలా అలాంటి ‘దృశ్య’మే కేసీఆర్ పునరావృత్తం చేస్తాననడం సబబుగా ఉంటుందా? అంతేగాక ప్రాంతీయ పార్టీల సి.ఎం.లతో సీఏఏపై సదస్సు ఏర్పాటుచేస్తాననడం.. ‘‘సారు’’ విజ్ఞతకే వదిలేయాల్సిన అంశం. ‘‘దేశంలో ఉన్న అన్నివర్గాల ప్రజలు సమానం అని రాజ్యాంగం చెబుతోంది. అలాంటప్పుడు ముస్లింలను మాత్రం పక్కకుపెడతాం అంటే ఎలా?’’ అన్నది కేసీఆర్‌తోపాటు సీఏఏను వ్యతిరేకించే వారందరి ప్రశ్న. అందరేమో గానీ అద్భుత చూపుగల, ఆలోచనగల, కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్ ‘అవగాహన’ ఇంత బలహీనంగా కనిపించడమే బాధకలిగిస్తోంది. ఇప్పటికే భారీ జనాభా భారత్ అభివృద్ధి వైపు ‘‘్భరం’’గా కదలుతోంది. తాజాగా వచ్చినవారు వేలల్లో ఉంటారు. కేసీఆర్‌గాని, సీఏఏని వ్యతిరేకించేవారు చెప్పేదాని ప్రకారం వచ్చేవారు లక్షల్లో, కోట్లల్లో ఉంటారు. వారందరి ఆలనా పాలన ఎవరు చూస్తారు? ఇప్పటికే దేశంలో ఎన్నో సమస్యలున్నాయన్న కేసీఆర్ మరో కొత్త సమస్యను ఆహ్వానించడం.. ‘‘న్యాయం’’కాదు! ఆ ‘తప్పు’లో ముఖ్యమంత్రి కాలుపెట్టరని ఆశిద్దాం!

- వుప్పల నరసింహం, 9985781799