Others

ఎలా తెలుస్తుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెలబ్రిటీలు ఎక్కడికెళితే అక్కడ వారికన్నాముందుగా అభిమానులు వెల్లువెత్తుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సుందరీమణులు ఈ ఇబ్బందిని ఎక్కువ ఎదుర్కొంటున్నారు. అప్పటికప్పుడు మనసులో ఫలాన చోటుకువెళాలని అనుకుని వెళ్లినా, అక్కడా అభిమానులు ఎగబడుతున్నారు. ఇదేమి వింత చెప్మా అని ఎంత ఆలోచించినా ఈ ముద్దుగుమ్మలకు విషయం అర్థంకావడంలేదట. ఈ టాపిక్‌తో ఎక్కువగా ఇబ్బందిపడుతున్న బాలీవుడ్ స్టార్ కత్రినాకైఫ్. ఎలా వచ్చేస్తున్నారు వీళ్ళంతా అని ఎంత ఆరా తీసినా ఆమెకు అంతుచిక్కడం లేదట. తన పర్సనల్ లైఫ్‌ను లీడ్ చేసుకోవడానికి ఎక్కడా సరైన ఊరే లేదని వాపోతుంది. ఇక లాభం లేదని ఇదంతా ఎలా జరుగుతుందని, తాను ఎక్కడికివెళితే అక్కడికి అభిమానులు రావడంలో ఆంతర్యం ఏమిటని చెప్పి వాకబు చేసిందట. తీరా తెలిసిందేంటంటే, ఆమె కారు డ్రైవరే ఎప్పటికప్పుడు ఆమె సమాచారాన్ని చేరవేస్తున్నాడట. ఈ విషయాన్ని గుర్తించిన కత్రినా, తానే డ్రైవింగ్ నేర్చుకోవడమో, లేక డ్రైవర్‌ని మార్చడమో చేయాలని ఆలోచిస్తుందట. ఏవైనా ఇలాంటి ఇబ్బందులు పగవాడికి కూడా రాకూడదు కదా!