Others

గురువే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః....తస్మైశ్రీ గురవేనమః - అని గురువును త్రిమూర్తి రూపంగా ఆరాధించే సంప్రదాయం గల భూమి మనది. గురుశిష్య పరంపరతో యుగయుగాలుగా ఈ భరత ఖండం వర్ధిల్లుతోంది. వీరిరువురి మధ్యగల సంబంధం ఎంతో పవిత్రమైనది. శుభకరమైనది. కాని నేడు ఈగురుశిష్య పరంపరకు మచ్చలేర్పడుతున్నవి. యుగప్రభావమో లేక పాపప్రేరిపితమో గాని నేడు ఈ గురుశిష్య బంధం పూర్తి వ్యాపారాత్మకంగాను, లోప భూయిష్టంగాను మారుతోంది. సద్గురువులు వెతికి వెతికినా కనిపించకుండా ఉంటున్నారు. గురుస్థానానికి చెడు పేరు తెచ్చే గురువులు కోకొల్లలుగా ఉంటున్నాయ.
పాటించవలసిన కనీస నైతిక సాంప్రదాయాలను కూడా చాలామంది విస్మరిస్తున్నారు. దీనివల్ల సమాజం ఎంతో కలత ఏర్పడుతోంది. గురుకుల వ్యవస్థలో నిస్వార్థపరులైన గురువులు ఉండేవారు. వారి ఇల్లాళ్లు లేదా గురుకులంలో స్ర్తి జనం తమ శిష్యులను కన్నబిడ్డలకంటే ఎక్కువగా చూసుకుంటూ లోక కళ్యాణానికి అవసరమైన సకల విద్యలను నేర్పి వారికి కర్తవ్య బోధచేసి వారి వారి జన్మస్థలాలకు క్షేమంగా తిరిగి పంపేవారు.
వారికి బోధించే శాస్త్రాలు, అధ్యయనాలు వేద వేదాంగాలనుండి ప్రకృతితో సహజీవనాన్ని మరియు స్వధర్మాచరణను పాటించే విధంగా ఉండేవి. స్వధర్మం ఎంత గుణోపేతమో చెప్పేవిగా ఉండేవి.. గురువు స్వయంగా ఆచరిస్తూ తన శిష్యులకుఆదర్శంగా ఉంటూ నీతులను బోధించేవారు. స్వధర్మాచరణలోని సత్యాన్ని విశదపరచి వారిని కార్యోన్ముఖులుగా చేసి సమాజంలోకి పంపేవారు. ముఖ్యంగా ఈ స్వధర్మం తీరు నాలుగువిధాలుగా ఉండేది. పరిపాలన మరియు రక్షణ, జ్ఞాన సముపార్జన మరియు బోధన, సంపదల సృష్టి మరియు పంపిణీ, వినియోగము మరియు సేవా రచన అనే నాలుగు ప్రయోజనాత్మకమైన అంశములుగా ఉండి గురుకుల వ్యవస్థ, విద్యాబోధన ఎంతో పటిష్టంగా ఉండేది.నేటి గుఠుశిష్య పరంపరలో వచ్చిన దోషంవలన గురు కులాలు, గురువులు సత్యాన్ని సమాజానికి అందించలేకపోతున్నారు. ఈ విశ్వాన్ని ఏక తాటిపై నిలబెట్టి సర్వ ప్రాణికోటిని ఉద్దరిస్తుందో దానిని అపహాస్యం చేసే చార్వాకబుద్ధి మళ్ళీ వేళ్ళూనుతోంది. ‘‘సత్యమేవ జయతే!’’ అనే భరత వాక్యమును నిత్యం మననం చేసుకోవలసిన సమయం ఆసన్నమయింది. సత్యమే జయిస్తుంది. ఆ సత్యమే పరమాత్మ. దీనిని ఎరుక పరిచే గురువులు కావాలి.
నిష్కళంక, నిస్వార్థ, నైతిక గురుతత్వం వెలుగులోకి రావాలి. వారు వీరు అనే తేడా ల్లేకుండా గురువులే పూనుకుని దేశోద్ధారణ చేయాలి. ప్రతి మనిషిలో సత్యం పట్ల ఆసక్తిని నైతిక విలువల, ధర్మంపట్ల నిష్టను నేర్పించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దీనినంతా కేవలం గురువులు మాత్రమే చేయగలరు కనుక సద్గురువులు పూనుకుని యువతలో సత్యధర్మాలను ప్రేరేపించాలి.
శిష్యులంతా కూడా తమలోని లోపాలను సవరించుకుని గురువు చూపిన మార్గంలో పయనించడానికి కృతకృత్యులు కావాలి. ధర్మమే ఏనాటికైనా నిలుస్తుంది కనుక ధర్మాచరణ పట్ల ఇప్పటికైనా పూనిక వహిం చాలి. గురువు ఆవశ్యకతను. గురువు ప్రాధాన్యాన్ని తెలుసుకొనమని ద్వాపరం కృష్ణుడు , త్రేతాయుగంలో రాముడు గురువు ల వద్ద విద్యను అభ్యసించడమేకాదు గురుకులాలల్లో నివసించడమే కాదు గురువులు చూపిన బాటలోనే తమ జీవితాన్ని చక్కదిద్దుకున్నారు. గురువు వాక్యాన్ని దైవవాక్యంగా భావించారు. కనుక ఈనాడు వారు దివ్యపురుషులుగా నిల్చున్నారు. కనుక మనమూ గురువులను ఆశ్రయద్దాం. ధర్మాచరణకు పూనుకొందాం. సత్యానే్న ధారణ చేద్దాం.

- శ్రీ