Others

మొక్కుబడి వారోత్సవాలు ఎంతకాలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రహదారులపై రక్తం పారని రోజులు రావాలి. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి. మానవ తప్పిదంవల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని పూర్తిగా నియంత్రించాలి. మన దేశంలో వాహనాల సంఖ్య తక్కువగా ఉన్న 11% ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఇంటినుండి బయటకి వెళ్లిన వ్యక్తి సురక్షితంగా తిరిగి వస్తాడో రాడో తెలియని పరిస్థితి. ప్రమాదాల నివారణ భద్రతకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జనవరి 27నుండి ఫిబ్రవరి 2వరకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రతి మండల, జిల్లా కేంద్రాల్లో అట్టహాసంగా నిర్వహించాలి. రహదారి నిబంధనలు రోడ్డు భద్రతపై ప్రజలకు వాహన చోదకులకు అవగాహన కల్పించాలి. ప్రమాదాల నివారణ సురక్షితమైన డ్రైవింగ్ ఇతర అంశాలపై మోటర్ వెహికిల్ శాఖ, ఆర్టీసీ, పోలీస్ అధికారులు ప్రజలకు, వాహన చోదకులకు అవగాహన కల్పించాలి. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లకు కూడా అవగాహన కల్పించాలి. రోడ్డు భద్రత మన భద్రత ప్రమాద రహిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ ప్రచారం చేయాల్సి ఉంది. కొన్నిసార్లు వాహనం చోదకులు అత్యంత వేగంతో వెళ్లి ఇతరుల ప్రాణాలను తీస్తున్నారు. అట్టివారికి కఠిన శిక్షలు పడటం లేదు. భారీ వాహన చోదకుని తప్పువల్ల లైట్ వెహికల్ ఓనర్‌కు అందులో ప్రయాణిస్తున్న ప్రాణాలు కూడా గాలిలో కలుస్తున్నాయి. అట్టివారికి న్యాయం చేసే పరిస్థితులు లేవు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వంటివి లేకుండా వాహనాలు నడపడంవల్ల ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడంవల్ల అధికారులు సరైన చర్యలు తీసుకోనందువల్ల అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రతి సంవత్సరం వారంరోజులపాటు భద్రతా వారోత్సవాల పేరిట పోలీస్, రవాణా, ఇతర శాఖల అధికారులు తూతూ మంత్రంగా సమావేశాలుపెట్టి కాలయాపన చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయి. కానీ అధికారులు స్పందించిన పాపాన పోవడం లేదు. ఆర్టీసీలో ప్రతి సంవత్సరం డ్రైవర్ల నిర్లక్ష్యం అతివేగంవల్ల, రోడ్డు కండీషన్‌ను గుర్తించనందువల్ల అమాయకులైన ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. సెల్‌ఫోన్లో మాట్లాడుతూ, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, చిన్నపిల్లలచే డ్రైవింగ్ చేయించడంవల్ల ప్రమాదాలు ఏటా పెరుగుతున్నాయి. మైనర్లు వాహనం నడిపిచే వాహనదారుడికి, అతని తల్లిదండ్రులకు జైలుశిక్ష విధిస్తూ చట్టం చేశారు. కానీ తగిన ప్రచారం లేనందువల్ల అమలుకావడం లేదు. వాహనాలకు ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపవద్దు అని ప్రచారం చేస్తున్నా వాహన చోదకులు పట్టించుకోవడం లేదు. అందువల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. అధికారులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేయకపోవడం వాహనాల వేగం పెరగడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాహనాల స్థితిగతులను పరీక్షించే రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల కారణంగా ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే స్పందించి తనిఖీలు చేస్తున్నారు. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు పాఠ్యాంశాల్లో మోటారు వాహనాల చట్టం రోడ్డు భద్రత గురించి పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలి. ప్రయాణం ప్రమాదకరం కాకుండా ప్రతి ఒక్కరూ మనసా వాచా కర్మణే నిబంధనలను అమలు చేయాలి. ప్రమాద రహిత ప్రయాణాలను కొనసాగించాలి.

- రావుల లావణ్య