Others

అర్థంలో పరమార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తీర్థోపవాసఃకర్తవ్యః , శిరసోముండనం తథా
శిరోగతాని పాపాని, యాన్తి ముండనతో యతః
పుణ్యక్షేత్రాలలో చాలామంది యాత్రికులు స్వామివారి దర్శనానికి ముందు తలనీలాలు సమర్పిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరినవారు కోరికలు తీరవలసిన వారు చాలాకాలం దీక్ష వహించి దీర్ఘకాలంలో వెంట్రుకలు పెంచుకున్నవారు, యాత్రకు వచ్చి అప్పటికప్పుడు సంకల్పించుకొన్నవారు. అలా అనేకులు పుణ్యక్షేత్రాలలో శిరోజాలను సమర్పించడం సంప్రదాయం. బిడ్డల పుట్టువెంట్రుకలు కూడ పుణ్యక్షేల్రలో తీయించే సంప్రదాయం వుంది. పురాణ ప్రమాణమును బట్టి పుణ్యస్థలాల్లో తలనీలాలు సమర్పిస్తే బుద్ధిపూర్వకముగా చేసిన పాపాలు కూడా నశిస్తాయని తెలుస్తుంది. వెంట్రుకలు సౌందర్యాన్ని పెంచుతాయి. అందువల్ల తాము అందంగా ఉన్నామనే గర్వానికీ, శరీర భ్రాంతికి కారణమైన వాటిని భగవంతునికి సమర్పించడం తమ అహంకారాన్ని తొలగించుకోవడానికి గుర్తుగా కూడ మనం గ్రహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ నలుగురినీ కలుసుకొన్నపుడు మనకున్నా తెలివిగలవారు, మనకన్నా పండితు లైనవారు ఉన్నారన్న విషయం తెలుస్తుంది. దానివల్ల మనలో ఎక్కడైనా అహంకారం ఉంటే అది దూరమై పోతుంది. ఆ అహకారం ఎంత అల్పమైందో తెలస్తుంది కూడా. భగవంతునికి సమర్పించడంలోని అర్థాన్ని తెలుసుకొని దేనినైనా సమర్పిస్తే పుణ్యపాప ఫలితాలు మనుషులను దరిచేరవు. ఏ ఒక్క ఫలితమున్నా తిరిగి జన్మను పొందాల్సి ఉంటుంది. కనుక విజ్ఞులు పాపపుణ్యాలనేవాటిని దరిచేరకుండా ఉండాలని చేసే కర్మలన్నిటికీ పరమేశ్వరుడినే కర్తను చేసి మరీ చేస్తుంటారు. *