Others

సాధన... పర్యవసానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగం, యోగసాధన పలురకాలు. అందు కుంభకమును గురించి తెలుపు విషయాలు హఠయోగంలోని అంతర్భాగమైన ప్రాణాయామ ప్రకరణంలో ఉన్నాయి.
... విశ్వాంతరాళములో ఉన్న విశ్వశ్వాసను అనగా పరమాత్ముని శ్వాసను (మాక్రో ఎనర్జీ) ప్రాణశక్తిగా పరిణమించుతున్నది. ఈ సృష్టిలోని సమిష్టి స్థితి నుంచి జీవ చైతన్య వ్యష్టి స్థితికి వచ్చు శ్వాస ప్రక్రియ ప్రతి జీవిలోను ప్రకృతి సహజముగా ఉంటుంది. మనిషిలో ఈ శ్వాస క్రియను ప్రయత్నపూర్వకంగా నియంత్రించి ప్రాణశక్తిని వృద్ధి చేసుకోవడమే ప్రాణాయామం.
యోగాంగములలో నాల్గవది ప్రాణాయామము. దీని స్వరూపం తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేదః ప్రాణాయామః సూత్రములో ఆసన, స్థిరత లభించిన తరువాత శ్వాస ప్రశ్వాసలు సంబంధించిన స్వాభివికమగు ఏగమనము కలదో దానిని నిరోధించుట ప్రాణాయామము అని నిరూపించబడింది. ప్రాణమగు స్వాభావిక బాహ్య సంచారం చేసేటపుడు చిత్తం సహజంగానేబాహ్య సంచారమే చేస్తుంటుంది. అది విక్షేపమునకు హేతువు. కాన ప్రాణవాయువు యొక్క స్వాభావికి గతిని నిరోధించుట అవసరం. ఇట్లే వాయువు శాస్ర్తియమగు రేచక పూరకాది వ్యాపారములతో నిరుద్ధము కాగా దాని ననుసరించి చిత్తం కూడా నంతఃప్రవృత్తి కలదై వృత్తి నిరోధ లక్షణమగు యోగమునకు యోగ్యమగును. కాన ప్రాణాయామము ముఖ్యమైనదని చెప్పవచ్చు.
యోగః చిత్త వృత్తి నిరోధః అన్నారు కదా.
ప్రాణాయాము, పూరకం, కుంభకం, రేచకం - బాహ్యమగు వాయువును నాసాపుటాల ద్వారా లోపలికి తీసుకొని, తీసుకొన్న వాయువును దేహమధ్యమున స్త్భింపచేయుట, అంతస్తంభితమైన ఆ వాయువును తిరిగి బయటకు వదులుట అనే వ్యాపారములతో ఉంటుంది. ఇదే కాక కుంభకరూప ప్రాణాయామ మనికూడా ఇంకో ప్రాణాయామ భేదము కలదు. అది 34బాహ్యాభ్యంతర విషయాక్షేపీ చతుర్థః22 సూత్రములో నిరూపించబడింది. ఈ ప్రాణాయామాభ్యాస క్రమమును గూర్చి విశేషముగా తెలుసుకొన వలసి ఉంది.
ప్రాణాయామం మహాఫలదాయకం. వశిష్ఠ మహర్షి సైతం సహితం కేవలం వాసి కుంభకం నిత్యమభ్యసేత్ అన్నారు. ప్రాణాయామం నిత్యమూ అవశ్యమూ అభ్యసించవలసిందే అని ఆ మహర్షి శాసించారు. సతస్య దుర్లభంకించిత్ త్రిషులోకేషు విద్యతే - ప్రాణాయామ సిద్ధి కలవానిని ముల్లోకాల్లోనులభ్యం కానిదేదీయుండదని యోగసూత్ర భాష్యం ఇలా చెబుతోంది. తపోనపరం ప్రాణాయామాత్, తతో విశుద్ధిర్మలా దీనాం, దీప్తిశ్చ జ్ఞానస్య - తపస్సులలో ఉత్తమ తపస్సు ప్రాణాయాము. దాకంటే ఉత్తమ తపస్సు మరొకటి లేదు. ఈప్రాణాయామం వల్ల సమస్త మలములు దోషములు నశించి విశుద్ధి ఏర్పడుతుంది. ముక్తిహేతువగు జ్ఞాన దీప్తియే ఏర్పడుతుంది. ముముక్షువులగు వారిచే చక్కగా తెలుసుకొని ఉపాసించి స్వయంగా మహిమలను తెలసుకొనవలనెను.
కుంభకం కసరత్తుకాదు. ఆరోగ్యమనకు సంబంధించినదికాదు. మోక్షమునకు సంబంధించినదికాదు. మనోప్రవృతత్తుల మాలిన్య ప్రక్షాళనకే కుంభకం అనిపే. మానసిక వైకల్యం తొలిగి కైవల్యం వైపు దారి చూపు చిత్తవృత్తి నిరోధమునకు మార్గమైన పనిముట్టు.
మనస్సును ఒకే ఆలోచన మీద ఏకాగ్రం చేయడమే చింతన. ఈచింతనమే చింతలతో కూడిన చిత్త వృత్తులను నివృత్తి చేయుట. ఈ మార్గపయనమే కుంభకం. దీని వలననే హృదయము కల్లోల రహితమై ప్రశాంతమగును.
కుంభకం వౌనానికి భాష. భావనారాహిత్య స్థితి. మనస్సు, సాహిత్యం, సంగీతం, నాదం, వేదం మొదలగునవి కుంభకం లో ఏమీ ఉండవు.ప్రాణం ఆత్మలో లయమగుటయే కైవల్యం. విష్ణుపదప్రాప్తి. కుంభకం వలన తలుపువిడిపోయి కైవల్య, కైలాస తలుపులు తెరుచుకుని బాహ్య ప్రపంచ విషయ వాసనల ద్వారాలు మూసుకొని పోవును. కుంభక సాధన వలన కొంతకాలానికి కేవల కుంభకస్థితి ఏర్పడును. ఈకుంభకములో ఆరోచనారాహిత్యమైనటువటి మనోలయాత్మకమైన స్థితి ఏర్పడును.
ఇడా, పింగళా, సుషుమ్నా అనే మూడు నాడులూ మూలాధార చక్రంలోనుంచి ప్రారంభమవుతాయి. వీటిలో ఇడా నాడి ఎడమ ముక్కురంధ్రంలోకి ప్రవేశిస్తుంది. వీటి ద్వారానే ఉచ్చ్వాస నిశ్శ్వాసలు జరుగుతూ ఉంటాయి. సుషుమ్నానాడి సూటిగా బ్రహ్మరంధ్రంలోనుంచి పైకి ప్రసరించి బ్రహ్మలోకంలో అనుసంధానాన్ని పొంది ఉంటుంది. ఈసుషుమ్నా నాడి కింద కుండలినీ శక్తి సర్పాకారంలో మూడున్నర చుట్టలు కలిగి నిద్రాణ స్థితిలో స్తబ్ధుగా పడి ఉంటుంది. సర్పాకారంలో ఉన్న ఈకుండలినీ శక్తియొక్క పడగ , సుషుమ్నా నాడియొక్క ద్వారానికి అడ్డంగా పడి ఉంటుంది. అందువల్ల ఈ ద్వారం మూసుకొని పోయి ఉంటుంది.
హఠయోగంలో అనేకరకాల కుంభకా ఉంటే ఉండుగాక. కానీ కేవల కుంభక యోగానికి ఉన్న గౌరవం మరొక దానికి లేదు. ఇది కుంభకాల్లో కెల్లా ఉత్తమ కుంభకం. -ప్రాణ వాయువుకు ఉండే ప్రాకృత రేచక పూరకాలుగానీ, వైకృత రేచకపూరకాలు గానీ ఈకుంభకంలో ఉండవు.
ఒకసారి పూరణ చేసి కుంభిం చి తరువాత రేచన చేస్తే దాని పేరు అంతః కుంభకం. అలాగాక మొదట రేచన చేసి లోపల వాయువు లేకుండా కుంభకం చేసి, ఆ తరువాత పూరణ చేస్తే దానిపేరు బహిః కుంభకం. ఇలా రకరకాల కుంభకాలున్నాయి. ఎన్ని కుంభకాలున్నా, వాటన్నింటికీ రేచనతోనూ, పూరణ తోను ఏదో ఒక రూపంగా సంబంధం ఉండి తీరుతుంది. యోగాభ్యాసం కోసం కావాలని చేసే రేచక పూరకాలు వైకృత రేచక పూరకాలు అంటారు. అలాకాక సహజసిద్ధంగా జరిగే రేచక పూరకాలను ప్రాకృత రేచక పూరకాలు అంటారు. ఈరెండూ రకాల రేచకపూరకాల్లో ఓ ఒక్కటి ఉన్నాసరే మనస్సులో ఎంతో కొంత చిత్తవృత్తి సంచలనం కలిగే తీరుతుంది. కుంభక స్థితిలో ఉన్న యోగికి మనస్సులో విషయ వృత్తి చలనం రవ్వంత కూడా ఉండదు. అందువల్ల కేవల కుంభకం అనేది కుంభకాలన్నింటిలోకి ఉత్తమమైనది.
- ఇంకా ఉంది

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899