Others

మానవతావాది గాంగేయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీష్మ ఏకాదశి సందర్భంగా
*
పుణ్య ఆదర్శ పురుషుడు భీష్ముడు
కురుపితామహుడు భీష్మాచార్యుడు యావజ్జీతము విలువలతో బతికిన ఆదర్శమూర్తి. మహోన్నత మానవతామనీషిగా, మహోజ్వలంగా ప్రకాశించిన తేజోవిరాజితుడు. అధికార వాంఛారహితుడు. అందరిపట్ల సమదృష్టి, ఆదరభావం వున్న అగ్రగణ్యుడు. మహాపరాక్రమ, బల, శౌర్య, యుద్ధ కౌశల సంపన్నుడు. కఠోరమైన ప్రతిజ్ఞకు జీవితాంతం కట్టుబడిన బ్రహ్మచర్యవ్రతం పాటించిన గొప్ప నియమ నిబద్ధుడు. సత్య, ధర్మాలను, అనవరతము ఆచరించిన అకుంఠిత దీక్షాపరుడు. క్షాత్రవ ధర్మనిష్ఠుడు, పరమ భాగవతోత్తముడు. అంతకుమించి మహాపితృభక్తి తత్పరుడై శ్రీరామునికి సమానమైనవాడు. ధర్మాన్ని నాలుగు పాదాల నడిపి ధర్మదేవతకు ప్రియపుత్రుడైన పుణ్యపురుషుడు. హస్తినాపుర సింహాసనం పరాయిపాలు కాకుండా కంటికి రెప్పలా కాపాడి సువిశాల దివ్య, భవ్య, భరతఖండ మహాసామ్రాజ్యాన్ని సుస్థిరంగా కురువంశపాలన గావించిన భరతమత ముద్దుబిడ్డడు. చిత్రాంగదుడు నుంచి అభిమన్యుడివరకు ఎన్నో తరాల స్థితిగతులను చూసిన దీర్ఘాయుష్మంతుడు, స్థితప్రజ్ఞుడు. మహాభారత కథానాయకుడైన భీష్ముని జీవితం ప్రతీ వ్యక్తికి అనుసరణీయమైనది.
భీష్ముడు నడచిన దారి
కురువంశపు మహారాజు శంతనుడు గంగానది దేవిని పెళ్లిచేసుకుంటానని ఎంతో ప్రేమతో అడిగాడు. అందుకామె 3నేను ఏ చర్యకు పాల్పడినా నువ్వు ప్రశ్నించరాదు. అడ్డుపడరాదు.. అలా జరిగిన క్షణంలో నిన్ను విడిచి వెంటనే వెళ్లిపోతాను.. అలాగైతేనే నీతో వివాహానికి సమ్మతిస్తాను2 అంటూ షరతు విధించింది గంగాదేవి. ఇందుకు శంతను మహారాజు అంగీకరించాడు. ఈ క్రమంలో శంతనునికి, గంగాదేవికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది.
కొంతకాలానికి గంగాదేవికి ప్రథమంగా పుత్రుడు జన్మించాడు. ఆ పసికందును వెంటనే తీసుకెళ్లి గంగానదిలో విడిచింది. ఇలాగ తనకు జన్మించిన ఏడుగురు సంతానాన్ని గంగలో కలిపింది. ఈ క్రమంలో ఎనిమిదో బిడ్డ పుట్టగా, ఆ బిడ్డను గంగలో పడేయడానికి ప్రయత్నిస్తుండగా శంతనుడు ఆక్షేపించాడు, అడ్డుపడ్డాడు. తాను ఏమి చేసినా అడ్డుపడరాదన్న షరతును ఉల్లంఘించడంతో శంతనునిపై తీవ్రంగా ఆగ్రహించింది. ఆ బిడ్డను గంగలో విడువకుండా తనతో తీసుకెళుతూ, శంతనునితో తెగతెంపులు చేసుకొని వెళ్లింది గంగాదేవి.
అయితే తనకు పుట్టిన సంతానాన్ని గంగాదేవి గంగపాలు చేయడానికి ఎంతో బలమైన నేపథ్యం వుంది. అష్టవసువులు అనే ఎనిమిదిమంది దివిలోకవాసులు వసిష్ఠ మహర్షి ఆగ్రహానికి గురై శాపగ్రస్తులయ్యారు. దీంతో వారు గంగాదేవి గర్భంలో జన్మించి వెంటవెంటనే వారు గంగలో విడువబడటం ద్వారా మానవ జన్మలనుంచి పరిసమాప్తం పొంది తిరిగి వారి లోకాలకు చేరుకుంటారన్న శాపవిముక్తి వుంది. ఎనిమిదోవానికి మాత్రం మినహాయింపు వుంది. భర్త శంతన మహారాజునుండి విడివడి, అష్టమకుమారునికి గంగాదేవి 3దేవవ్రతుడు2 అని నామకరణం చేసింది. అతన్ని పెద్ద చేస్తూ పరశురామ భగవానుని వద్ద సకల యుద్ధ విద్యల్లో నిష్ణాతుని చేస్తుంది. అనంతరం అతన్ని తండ్రి శంతన మహారాజు అప్పగించి వెళుతుంది గంగాదేవి.
సత్యవతిపై శంతనుని పెళ్లి మక్కువ
ఈ నేపథ్యంలో శంతన మహారాజు ఒక రోజు వేటకు వెళ్లిన క్రమంలో సత్యవతి అనే బెస్త యువతి అందానికి ముగ్ధుడు అయ్యాడు. ఆమెను వివాహమాడటానికి నిర్ణయించుకున్నాడు. తన తండ్రి మనసెరిగి సత్యవతితో తన తండ్రి వివాహానికి పెద్దరికం చేశాడు. కానీ సత్యవతి తండ్రి 3మా కుమార్తెకు పుట్టిన బిడ్డే రాజుకావాలి, నీకు పుట్టే సంతానం హస్తినాపురం సింహాసనాధికారానికి అడ్డురారని మాకు స్పష్టమైన హామీ ఇచ్చినమీదటే మా కుమార్తెను నీ తండ్రికిచ్చి వివాహం చేస్తామని కరాఖండీగా చెప్పాడు.
భీష్మ ప్రతిజ్ఞ
దాశరాజు దంపతుల షరతులకు దేవవత్రుడు ఏమాత్రం సంకోచించకుండా అంగీకరించాడు. దేవతల సాక్షిగా.. నన్ను కన్న తల్లిదండ్రుల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా రాజ్యాధికారాన్ని త్యాగం చేస్తున్నాను. సత్యవతి మాతకు పుట్టిన బిడ్డనే కురువంశ వారసత్వ సింహాసనంపై రాజుగా అధిష్ఠింపజేస్తాను.. అంతేకాదు.. నేను యావజ్జీవితమూ బ్రహ్మచారిగా ఉండిపోతాను అంటూ భీకర భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు.
శంతన -సత్యవతి దంపతులకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఇచ్చిన మాట ప్రకారం భీష్ముడు చిత్రాంగదున్ని రాజును చేశాడు. కొంతకాలానికి అతన్ని శత్రువులు హతమార్చారు.
చిత్రాంగదుని మరణానంతరం రెండో తమ్ముడు విచిత్రవీర్యుని వివాహం చేసి పట్ట్భాషిక్తున్ని చేయాలన్న ప్రయత్నంలో ఉంటాడు. ఈ క్రమంలో కాశీరాజు కుమార్తెలు అంబికా, అంబాల్ని ఇద్దరినీ విచిత్రవీర్యునితో పెళ్లిచేశాడు. విచిత్రవీర్యుడు రాజ్యాధికార బాధ్యతల్ని విస్మరించి అహర్నిశలూ కామకేళీ విలాసాల్లో మునిగి అతి సంభోగంతో రోగాన్ని తెచ్చుకొని మరణించాడు. దీంతో ఇద్దరు కోడళ్ళు విధవలు కావడంతో కురువంశం ఇంతటితో అంతరించిపోతుందన్న దిగులూ, దుఃఖంతో తీవ్రగా ఆందోళన చెందింది సత్యవతి. దీంతో సత్యవతి తన పూర్వ జీవితంలో పరాశర మహర్షి మూలంగా తాను కన్న కుమారుడు వేదవ్యాస మహర్షిని ప్రార్థనతో రప్పించింది. విషయాన్ని వివరించింది. దీంతో వ్యాసుడు విధవలుగా వున్న రాజపత్నులు అంబా, అంబాలికలకు సంతానానికి అంగీకరించాడు. వ్యాసుని గడ్డాలు, మీసాలు చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకోవడంతో ఆమెకు పుట్టు గుడ్డివాడుగా ధృతరాష్ట్రుడు పుట్టాడు. అలాగే అంబాలిక అతన్ని చూసి గజగజవణికిపోతూ పాలిపోవడంతో పాలిపోయిన శరీరంతో పాండురాజు పుట్టాడు. ఇదే క్రమంలో అంబాలిక ధైర్యంగా వున్న తన దాసిని వ్యాసుని వద్దకు పంపడంతో ఆమెకు మహా వివేకి అయిన విదురుడు పుట్టాడు.
తనువు చాలించిన భీష్ముడు
శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతికరమైన ఉతరాయణ పుణ్యకాలం, మాఘమాసం, శుక్లపక్షం, అష్టమి తిథినాడు అంపశయ్య వద్ద స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతారమూర్తి అయిన శ్రీకృష్ణ భగవానుని దివ్య సన్నిధిలో స్వీయ రచనలో విష్ణు సహస్రనామాలతో స్తుతిస్తూ శ్రీకృష్ణ్భగవానుని కృపకు ప్రాతుడై పార్థివదేహాన్ని విసర్జించి తాను కోరుకున్న మరణంతో మోక్షాన్ని పొందాడు.
భీష్మ ఏకాదశి
అయితే భీష్ముడు మోక్షానికి వెళ్లింది అష్టమి తిథినాడు అయినా.. శ్రీకృష్ణ భగవానుడు తనకిష్టమైన ఏకాదశినాడు భీష్మాచార్యునికి మోక్షాన్ని ప్రసాదించాడు. అందువల్ల భీష్మ ఏకాదశి అయింది. అప్పటినుండి భీష్మ ఏకాదశికి ప్రాశస్త్యం ఏర్పడి ప్రపంచ ప్రజలు ఆ రోజున భీష్ముడిని ఆరాధించి తరిస్తున్నారు.

-తాళ్ళపల్లి యాదగిరిగౌడ్ 9949789939