Others

శాంతి, సమరం మధ్య ‘యురేనియం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యురేనియం.. ప్రపంచ మానవాళికి గనుల ముడి ఖనిజంగా ప్రకృతి ప్రసాదించిన అద్భుత భూగర్భ సంపద. 1896లో ఫ్రెంచ్ శాస్తవ్రేత్త బెక్యులర్, తొలి రేడియో యాక్టివ్ మూలకంగా పరిశోధించి యురేనియంను కనిపెట్టాడు. యురేనియంను అణు రియాక్టర్లలో వినియోగించి శక్తిగా మార్చి, అణు విద్యుత్ ఉత్పత్తిని సాధించగలం. ప్రప్రథమ అటామిక్ బాంబ్‌ల తయారీ, యురేనియం వినియోగ ఫలితమే. మానవ విధ్వంసంతో ద్వితీయ ప్రపంచ మారణ సంగ్రామంలో అణు బాంబ్‌లు సృష్టించిన మృత్యు విలయం నుంచి 1955లో జినీవా అగ్రదేశాల అణుశక్తి, శాంతియుత ప్రయోజనాల సదస్సు మానవ కల్యాణం వైపు మలుపుతిప్పింది. అణు విద్యుత్ ఉత్పాదన, వాటిలో ప్రధాన ప్రయోజనకర అంశమైంది. శిలాజ ఇంధన రకాలైన బొగ్గు, చమురు, సహజవాయువు, యురేనియం పునరుత్పత్తి సాధ్యంకాని ఇంధన వనరులు కాగా సౌర, పవన, జల, తరంగ, టైడల్, భూతాప, జీవ ఇంధన, బయోగ్యాస్ శక్తి పునరుత్పాదక ఇంధన వనరులుగా ఉపయోగించబడుతున్నాయి. ప్రస్తుతం అణు విద్యుత్‌కు సంబంధించి 6780 మెగావాట్లతో దేశంలోని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో, 2 శాతం కలిగి ప్రపంచంలో మన దేశం 12వ స్థానంలో వుంది. ప్రస్తుతం 22 అణు రియాక్టరులు, 7 విద్యుత్ ప్లాంట్‌లు ఉన్నాయి.
1939లో రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. 1941లో ప్రపంచ రణరంగంలో శత్రు దేశాల వినాశనం, పరాజయం లక్ష్యం నాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ ఎజెండాలో అణ్వాయుధాల ప్రయోగ ప్రజ్వలనానికి నాంది అయింది. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్తవ్రేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్, యురేనియం అణు విచ్ఛేదం చైన్ రియాక్షన్ సృష్టించగల అపార అణ్వాయుధ శక్తిని, శత్రు దేశాల కంటే అమెరికా ముందుగా స్వాధీనం చేసుకోవాలని సూచించటంతో రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ‘మన్‌హట్టన్’ ప్రాజెక్టు అంకురించింది. 1945 నాటికి ఆటంబాంబు జపాన్ నగరాలపై విరుచుకుపడి, శత్రు దేశాన్ని మట్టుపెట్టింది. అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ రసాయనిక ప్రతి క్రియ చర్య, మహా విస్ఫోటన విలయశక్తి ఆవిర్భావంలో యురేనియం 235 కీలకమైంది. భూసంబంధిత గనుల తవ్వకంలో లభించే ముడి ఖనిజం యురేనియం రసాయనిక అటామిక్ నంబర్ 92గా శాస్తజ్ఞ్రులు నాడు నిర్ధారించారు.
రేడియో ధార్మిక శక్తి కలిగిన ప్రప్రథమ రసాయనిక మూలకంగా శాస్తజ్ఞ్రులు పరిశోధనలలో కనుగొన్న యురేనియం-235 పరమాణువులోని న్యూక్లియస్‌లో న్యూట్రాన్‌ల విచ్ఛితి నమ్మశక్యంకాని అపార శక్తివంతమైన విలయ అణుబాంబ్‌ల సృష్టికి 1945 జూలై 16న అలమొగొర్టొ, న్యూమెక్సికోలో శాస్తజ్ఞ్రులు నాంది పలికారు. ఆగస్టులో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి మహానగరాల ఆహుతి హననం రెండవ ప్రపంచ సంగ్రామం విషాదాంతంగా ముగిసింది. అయినా అగ్ర దేశాల అమ్ముల పొది, హెడ్రోజన్ బాంబ్‌లతో మరింత అణ్వాయుధ మారణ వినాశనానికి మరింత శక్తివంతంగా సాగుతోంది.
ఎన్‌రిచ్డ్ యురేనియం
యురేనియం అణు విస్ఫోటనంలో ‘ఎన్‌రిచ్డ్ యురోనియం’ అంతర్జాతీయంగా అగ్రరాజ్యాల అణు ఒప్పందాలలో అత్యంత ప్రధానమైనది. సహజంగా ముడి ఖనిజంగా లభించే యురేనియంను, గనుల నుంచి వెలికితీసిన తరువాత శుద్ధిచేసే కర్మాగారాలను నెలకొల్పి, యురేనియం-238ను క్షీణింపచేసి, యురేనియం-235 స్వచ్ఛ సంపన్న నాణ్యత పొందటం అత్యంత ఆవశ్యకంగా అణ్వాయుధ ప్రగతి సాధించిన అగ్రరాజ్యాలు ధృవీకరించాయి. అటువంటి క్రిటికల్ పరిమాణంలో, సాధించే చైన్ రియాక్షన్ అత్యంత అపారశక్తిని సృష్టించగలగటంతో, ఎన్‌రిచ్డ్ యురేనియం ప్రస్తుత 21వ శతాబ్దంలో అణు ప్రగతికి కీలకమైంది. మన దేశానికి సంబంధించి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్ర అటవీ, అటామిక్ ఎనర్జీ డిపార్టుమెంటు యొక్క అటామిక్ మినరల్స్ డైరక్టరేట్ వంటి సంస్థల సంయుక్త సహకారంతో వేలాది టన్నుల యురేనియం గనుల నుంచి వెలికితీస్తోంది. దేశ అవసరాలకు యురేనియం దిగుమతి కూడా కొనసాగుతోంది. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశంలో 13 ప్రాజక్టులకు వేలాది కోట్లు పెట్టుబడి వినియోగిస్తోంది. జార్ఖండ్‌లో 3,000 టన్నుల ఉత్పత్తి సాధిస్తోంది.
రాయలసీమలో యురేనియం వికృత సంక్షోభం
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం ఖనిజ వనరుల సిరిసంపదలకు నిలయంగా విలసిల్లుతోంది. కడప జిల్లా తుమ్మలపల్లి గనులు, కానంపల్లి యురేనియం ఖనిజ సంపద 21 కిలోమీటర్ల పొడవు మైనింగ్ బ్లాక్‌గా విస్తరించి కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకట్టుకొంటోంది. రోజుకు ప్రస్తుతం 3,000 టన్నుల ఉత్పత్తి సాధిస్తున్న తుమ్మలపల్లి మైనింగ్‌ను 4,500 టన్నులకు విస్తరణకు రానున్న నెలల్లో యుసిఐఎల్ పబ్లిక్ హియరింగ్ ద్వారా చట్ట ప్రకారం ప్రజామోదం పొందవలసి వుంది. సమీపంలోని కానంపల్లి దేశంలోనే అతిపెద్ద యురేనియం గనిగా రోజుకు 6,000 టన్నుల యురేనియం ఉత్పత్తి సాధించే అవకాశాలున్నాయి. కానంపల్లికి రు. 6,000 కోట్లు పైగా వినియోగించటానికి కేంద్ర సంసిద్ధత వ్యక్తం చేయటంతో యుసిఐఎల్ సంస్థ మైనింగ్ లీజ్ సరిహద్దులు నిర్ధారించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులకు చురుకుగా పావుల కదుపుతోంది. పూర్తిస్థాయి యురేనియం ఉత్పత్తి సాధించటానికి కనీసం ఏడు సంవత్సరాలు పట్టే పరిస్థితి నెలకొనివుంది. ఈ బ్లాక్‌లోని 51 శాతం ఖనిజంలో 3.17 లక్షల టన్నుల యురేనియం లభించగలదని అంచనా వేయబడింది. ప్రస్తుతం తుమ్మలపల్లి గనుల నుంచి 70 శాతం స్వచ్ఛమైన నాణ్యత కలిగిన యురేనియం లభిస్తోంది. కానంపల్లి గనులకు కూడా తుమ్మలపల్లి ప్రాజెక్టు నిర్వహణ పద్ధతిలో మైనింగ్‌కు, మిల్లుకు భూసేకరణ చేయవలసి వుంది. ప్రస్తుతం తుమ్మలపల్లి మైనింగ్‌కు సంబంధించి మైన్ లీజ్ ప్రాంతం 2,405 ఎకరాలు, టైలింగ్ చెరువులు 148 ఎకరాలలో వున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో చిట్రియాల్ ప్రాజెక్టుకు రు. 2,000 కోట్లు ప్రణాళికగా మైనింగ్ లీజ్ సరిహద్దులు నిర్ణయించవలసి వుంది. ఇంటర్నేషనల్ ఎటామిక్ ఎనర్జీ ఏజెన్సీ భద్రతా రక్షణ నిబంధనల రియాక్టర్‌లకు మాత్రమే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకొన్న హైగ్రేడ్ యురోనియం వినియోగానికి అర్హత కలిగివుండటంతో మన దేశం ఎన్‌రిచ్డ్ యురేనియం ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తోంది. 2032 నాటికి భారత ప్రభుత్వం 63,000 మెగావాట్లు అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం సాధించాలంటే సాంకేతికత, నాణ్యమైన స్వచ్ఛ యురేనియం, స్వయం సమృద్ధిగా సాధించే తక్షణ కార్యాచరణ అత్యవసరంగా చేపట్టవలసి వుంది.
శాంతియుత ప్రయోజనాలకు ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తికి న్యూక్లియర్ రియాక్టరులను నెలకొల్పుకొని ప్రగతి సాధించటంలో మన దేశానికి అత్యవసరమైన యురేనియం, యుద్ధ విధ్వంసనలతో మానవాళిని మృత్యు ముఖంలోకి నడిపించే అణ్వాయుధాల సృష్టికి కూడా ప్రాధాన్యత వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వెస్టింగ్ హౌస్ దివాళా కారణంగా ఆరు అణు విద్యుత్ రియాక్టర్‌లు వెనక్కి పోయాయి. పర్యావరణ విపత్కర పరిణామాల కారణంగా, విపత్తులు, ప్రజారోగ్యానికి ముప్పు తెచ్చే మృత్యు సంక్షోభం నెలకొని వుండటంతో రాష్ట్ర ప్రభుత్వం బాక్సింగ్ తవ్వకం నల్లమల ప్రకృతి వినాశనం, రాయలసీమ జిల్లాలలో మృత్యు సంక్షోభం కారణంగా ప్రజావ్యతిరేకత, ఆందోళనల సంక్షోభం తల ఎత్తుతోంది. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తత అమెరికా - ఇరాన్‌ల మధ్య అణు ఒప్పంద ఆంక్షల విధింపులో కూడా ఎన్‌రిచ్డ్ యురేనియం ప్రస్తావన ప్రధానాంశమైంది.

- జయసూర్య