Others

భక్తి, శ్రద్ధ, ఓర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా ఉపదేశాల్లోనే అత్యం త ముఖ్యమైనది. ఎపుడూ ఓర్పు గురించే బాబా ఎక్కువగా చెప్పే వారు. భక్తి ఉండాలి. పని చేసేటపుడు, లేదా విద్య నేర్చుకునేటపుడు శ్రద్ధ తప్పని సరిగా ఉండాలి అని పదే పదే చెప్పేవారు. ఓసారి బాబా అన్నారు - ‘‘ఈ ఒక్క ఉపదేశాన్ని విను, చదువు, మననంచేయి, ధ్యానము చేయుము. భగవంతుడు నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు’’. కానీ ఎవరికీ ఏమంత్రాన్ని బాబా ఉపదేశించే వారు కాదు. నీ కర్తవ్యాన్ని నీవు చేస్తూ ఉంటే చాలు భగవంతుడు ఫలితాలను ఇస్తాడు అని చెప్పేవారు. ఓసారి ఆయన దగ్గరకు ఓ భక్తురాలు రాధాబాయ్ దేశ్‌ముఖ్ అనే ఆవిడ ఎంతో ఆతురతతో వచ్చింది. ఆమెకు ఎవరో మంత్రం గురువు ఉపదేశించిన తర్వాత మననం చేసేస్తే అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుందని చెప్పారు. దానితో
రాధాబాయ్ దేశ్‌ముఖ్ బాబావద్ద మంత్రోపదేశం పొందాలనే ఆత్రుతతో షిర్డీ వచ్చింది. బాబాకు తన మనసులోని మాట చెప్పింది. తనకు మంత్రం ఉపదేశించాలని మొండిపట్టు పట్టింది. బాబా చిరునవ్వు నవ్వి అమ్మా మంత్రాలు ఏమీ లేవు. నీ మాటే మంత్రం. నిష్టగా సత్యవ్రతాన్ని ఆచరించు. భగవంతుడు నీ కోరికలను తీరుస్తాడు అని చెప్పాడు. కానీ ఆమె ఏ మాత్రం వినలేదు. పైగా మంత్రం చెప్పకపోతే ఉపవాసాలుండి చచ్చిపోతానని మొండికేసింది. అపుడు బాబా ఆమెతో ఇలా మాట్లాడారు.
‘‘అమ్మా! నాకు తల్లివంటి దానివి. నేను చెప్పేది శ్రద్ధగా విను. నాకు ఓ గురువు ఉండేవారు. ఆయనెంతో దయార్ద్రహృదయులు. నేను చాలాకాలం ఆయనకు సేవ చేశాను. నేను అపుడు నీలాగా ఏదైనా ఉపదేశం పొందాలనుకొనేవానిని. వారివద్ద ఉపదేశం పొందాలనేది నా ఆశ పడ్డాను. కానీ, వారి మార్గం వేరు. వారు నాకు గుండు చేయించారు. అంటే అహాన్ని తొలగించారు. రెండు పైసల దక్షిణ అడిగారు. అంటే డబ్బు గాదు. ఒకటి- దృఢ విశ్వాసం, రెండు- సహనం. నేను ఆ రెండింటినీ వారికి భక్తితో సమర్పించాను. అలా పనె్నండేళ్లు గురుసేవలో తరించాను. కానీ, మంత్రం చెప్పలేదు. వారి ధోరణి చూసి నాకు వారు మంత్రం కన్నా వారు చూపిన దారిలో నడవడమే వారికిష్టం అనుకొన్నాను. కనుక నేను కూడా ఇక మంత్రం గురించి మర్చిపోవాలని నిశ్చయంచుకున్నాను. అందుకే నన్ను నేను వారికి అంకితం చేసుకొన్నాను. వారి సేవే నాకు పరమావధి అనుకున్నాను. వారిని నేను సంపూర్తిగా నమ్మాను. వారి మాటే నాకు వేదం అయంది. వారి సాంగత్యంలో నాకు అన్నవస్త్రాలకు లోటులేదు. వారు పరిపూర్ణ ప్రేమావతారం. అలాంటి గురువు నాకు ఇంతవరకు కనిపించలేదు. నిరంతరం నేను వారు చెప్పినట్టు ధ్యానంలోనే గడిపేవాడిని. ఆయన కూడా ధ్యానంలోనే ఉండిపోయేవారు. వారు ఇహలోకంలోకి వచ్చినపుడు నేను వారికి కావలసిన సాయం చేస్తుండేవాడిని. వాని ధ్యానానికి భంగం కలిగించకుండా నేను ప్రయత్నపూర్వకంగా సాయంగా ఉండేవానివి.
రేయింబవళ్లు నిద్రాహారాలు మాని వారివైపే చూస్తుండేవాడ్ని. గురువును చూడని రోజున నాకు మనశ్శాంతి ఉండేదికాదు. వారి ధ్యానం, సేవ తప్ప నాకింకొక పనిలేదు. నా మనసెప్పుడూ వారిపైనే ఉండేది. ఇదే వారడిగిన ఒక పైసా దక్షిణ. అంటే నిష్టతో కూడిన భక్తి. ఓర్పు అంటే సబూరి (సంతోష స్థైర్యాలతో కూడిన సహనం) అనేది రెండో పైసా. ఈ ప్రపంచమనే సాగరాన్ని ఓర్పు అనే ఓడ సురక్షితంగా దాటిస్తుంది. సబూరి అత్యంత ఉత్తమ లక్షణం. అది పాపాల్ని తొలగిస్తుంది. కష్టాలను ఎడబాపుతుంది. సబూరి అనేది సుగుణములకు గని. మంచి ఆలోచనలకు పెన్నిథి. నా గురువు నా నుంచి ఏమీ ఆశించలేదు. సర్వకాల సర్వావస్థల్లో కేవలం దృష్టి చేతనే నన్ను అనుగ్రహించే వారు. అపుడు నాకు తెలియలేదు కానీ తర్వాత గురు బోధవల్ల నాకు తెలిసింది. అది ఎట్లా అంటే తాబేలు వాటి పిల్లలను రక్షించినట్లే గురువుకూడా తన శిష్యులను రక్షించుకుంటారు. దానికోసం వారికి ఏ మంత్రాలు, సాధన పరికరాలు అక్కర్లేదు. కేవలం శిష్యుడు నమ్మకంతో ఉంటే చాలు. గురువే సర్వావస్థలయందు రక్షించుతాడు.. కనుక మనమూ గురువుపై విశ్వాసంతో ఉంటూ గురువు చూపిన బాటలో నడుద్దాం. పరమాత్మను అన్నిచోట్లా చూడడానికి ప్రయత్నం ఆరంభిద్దాం.

- జి. వెంకట్రావ్ 8885622196