Others

శాంతినిచ్చే శే్వతాఠ్కగణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఘ్నంకరుడైన వినాయకుని పూజించనివారు ఎవరూ ఉండరు. అటువంటి వినాయకుడిని ప్రతి మంగళవారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9:30గంటల వరకు దేవాలయం నందు సామూహిక వినాయక వ్రతములు, గణపతి హోమము, మహార్చన, సాయంకాలర్చన గణపతిని ఉద్దేశించి అందరికీ అన్నదానము చేయడానికి వరంగల్ జిల్లా కాజీపేటలో ఉన్న స్వయంభూ శ్రీశే్వతార్కమూల గణపతి స్వామి ఆలయం ఉంది. గణపతికి ఎన్నో రూపాలున్నా, గణపతే పరమాత్మస్వరూపంగా భావించి కొలిచినా ఈశే్వతార్కగణపతి స్వయంభూగా వెలసి తన నిజభక్తుల కోర్కెలను ఈడేరేటట్టు చేస్తున్నాడు.
అసలీ శే్వతార్క మూర్తి ని గూర్చి నారదాది పురాణ గ్రంధాలలో తెల్లజిల్లేడు వృక్షం పరిపూర్ణంగా 100 సంవత్సరాలు పూర్తి కాబడి ఉండినచో ఆ వృక్షపు మూలములో గణపతి ఆకృతి తయారు అవుతుందని చెబుతున్నాయ.
ఇలాంటి వృక్షం దొరకడం అట్టి రూపాన్ని లభించుకోవడంకూడా కొంత దుర్లభమని పెద్దలంటారు గణపతి ఉపనిషద్‌లో చెప్పినట్టుగా త్వం మూలధారే స్థితోనిత్యం అన్నట్టుగా సహజ సిద్దంగా ఉండే చెట్టు, గణపతి ఆకృతిలో అన్ని అవయవములతో తయారు కావటమే విశేషంగా చెప్పవచ్చు. హనుమంతుని విషయంలో కూడ పారిజాత తరుమూల వాసితం అని ఉంది. అంటే ఆంజనేయస్వామివారి ఆకృతి పారిజాత (పూలు) చెట్టు మూలంలో లభ్యమవుతుందని తెలుస్తుంది. అ ట్లానే శే్వతము అనగా తెలుపు అని, అర్కము అనగా జిల్లేడు అని, మూలము అనగా వేరు మొదట్లో నుండి ఈ వినాయకుని రూపం లభ్యమవుతుందన్నట్టుగానే ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలో శే్వతార్క మూర్తి ఆవిర్భివించి పురాణ కథలు సత్యప్రమాణాలే అని చెప్పినట్టు అనిపిస్తుంది. వరంగల్ జిల్లాలోగల కాజీపేట పట్టణమునందు స్థిర నివాసంతో వేలాది మంది భక్తులకు దర్శనమిస్తూ
ఏదైనా ఒక పనిని సంకల్పించుకుని ఈ వినాయకుడికి గరికలతో ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక తప్పక ఈడేతుందన్న విశ్వాసాన్ని అనేక మంది భక్తులకు ఇక్కడ వెల్లడిస్తారు. అందుకేఈ శే్వతార్క మూర్తిని సకల కార్యసిద్ది కరుడుగా కీర్తిస్తారు. ఈ శే్వతార్క మూలగణపతి స్వామివారు సర్వాయవ సంపూర్ణుడుగా చెక్కడములు, మల్చడములు లేకుండా స్పష్టంగా నేత్రములు, నుదురు, దంతములు, జ్ఞాన దంతములు, కాళ్లు, పాదములు, చేతులు, తల్పము, సింహాసనము, మూషికం (ఎలుక), మోదకములతో ఆకృతిని పొంది దర్శనమిస్తున్నాడు. ఈ స్వామి వారిని సరిగ్గా తూర్పు ముఖంగా కూర్చుండి చూస్తే స్వామి వారు చూపు ఈశాన్యం వైపునకు కైలాస స్థానాన్ని చూస్తున్నట్లుగా సమస్త వాస్తు దోష నివారణ ఉండటం ఈ స్వామిలోని విశిష్టత. కాగా ఈ స్వామి వారి రూపంలో మూషికాసుర యుద్ద సమయంలో తనకుడి దంతాన్ని బయటకు లాగి సంగం విరిచి (శత్రువుపై) వేసినట్లుగా, శత్రువు తన పాదముల చెంత చేరినట్లుగా, యుద్దాంనంతరం శ్రీ గణేషుడు, సుఖాసీనత పొందినట్లుగా పురాణ చరిత్రను కలిగి ఉండటం ఇక్కడ మరో విశేషం. ఐదుగురు పీఠాధిపతులు సమక్షంలో వేదమూర్తుల సమక్షమున 18న్నర కిలోల వెండితో కవచములు తయారు చేసి స్థిర ప్రతిష్టను చేయబడినవి.
ఈ దేవాలయంలో విశేషపూజలు నిత్యపూజలు రెండూ విశేషంగా జరుగుతుంటాయ. ముఖ్యంగా చైత్ర శు॥ ఉగాది రోజున ఉదయం 5గంటలకు పంచామృతాభిషేకము- అలంకారము, తీర్థ ప్రసాద వితరణ, పంచాంగ శ్రవణము చైత్ర శు॥ శ్రీరామ కళ్యాణోత్సవము వైశాఖ శు॥ శ్రీ స్వామివారి వార్షిక వసంత్సోవములు, కళ్యాణోత్సవము. త్రయాహ్నిక దీక్షతో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భాద్రపద శు॥ చవితి నవరాత్రోత్సవములు, కళ్యాణోత్సవము ఆశ్వయుజ శు॥ దేవీనవ రాత్రోత్సవములు రోజున హరిద్రాగణపతి అలంకారము, శతాధిక దీపారాధనోత్సవం కార్తీక మాసంలో ఒక రోజున (్భక్తులతో) తీర్థయాత్ర సత్యవ్రతం, వన భోజనం జనవరి నెలలో మొదటి మంగళవారం రోజున శతాధిక రుచికర చిత్రాన్నపూజ (200 కిలోలకు పైగా పులిహోర నివేదన) మాఘమాసంలో మహాశివరాత్రి రోజున ఏక ధారాభిషేకము కూడా నిర్వహిస్తుంటారు.
ఈ శే్వతార్కమూల గణపతిని దర్శించుకున్న భక్తులకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ జ్ఞానముద్ర సరస్వతి అమ్మవారు, ( ఇక్కడి అమ్మ వారికి చేతిలో వీణలేకుండా జ్ఞాన ముద్రను కలిగి ఉంటుంది) శ్రీ సంతోషిమాత దేవి, శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామి, శ్రీ షిర్డి సాయిబాబ, శ్రీ వేంకటేశ్వర దేవాలయములు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నవగ్రహములు, అయ్యప్ప, ఆంజనేయస్వామి, సత్యనారాయణ స్వామి ఇలా వివిధ దేవీదేవతలను దర్శనం చేసుకోవచ్చు.

- చివుకుల రామమోహన్