Others

అలా చేయడం ఉత్తమం -దర్శకుడు కొమ్మి (డైరెక్టర్స్ చాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్ హీరోగా వచ్చిన ‘గణేష్’ చిత్రంతో ప్రారంభించి -ఎందుకంటే ప్రేమంట, జంక్షన్, మిస్టర్ రాస్కెల్ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా, కో-డైరెక్టర్‌గా పనిచేసి, దాదాపు 16ఏళ్ల అనుభవంతో కొమ్మి సూర్యనారాయణ తాజాగా రూపొందిస్తున్న చిత్రం -ఆమె అతడైతే. ఈ చిత్రంతో దర్శకుడిగా తనకు గుర్తింపు వస్తుందంటున్న కొమ్మితో చిట్ చాట్.

* మీ నేపథ్యం?
- మాది నెల్లూరు. చదువక్కడే. తరువాత దర్శకత్వంవైపు వచ్చాను. చదువుకుంటున్న టైంలోనే సినిమా ఫ్యాషన్ పెరిగింది.
* దర్శకుడు కావాలన్న ఆలోచన?
-నాగార్జున శివ చూశాక నాలో చాలా ఆలోచనలు రేకెత్తాయి. దర్శకత్వం గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెట్టా. ఏ సినిమా చూసినా డైరెక్షన్ ఎలా వుందన్న విషయంపైనే దృష్టి ఉండేది.
* తొలి అవకాశం?
-ఆమె అతడైతే నిర్మాతలు మలినేని మారుతిప్రసాద్, నెట్టెం రాధాకృష్ణ. వీళ్లద్వారానే దర్శకుడిగా అవకాశం.
* ఇష్టమైన జోనర్?
-ఏ జోనర్ అయినా దాన్ని అల్టిమేట్‌గా తీయడం ఇష్టం. సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్స్ అంటే ఇష్టం. ఏ జోనర్‌నైనా డీల్ చేయగలనన్న నమ్మకం, అనుభవం ఉన్నాయి.
* లవ్ అండ్ హర్రర్ ట్రెండ్ ఎలావుంది?
-లవ్, హారర్ అనే కాదు, ఏ జోనర్‌నైనా సరిగ్గా డీల్ చేయగలిగితే ప్రేక్షకుడు ఆదరిస్తాడు. ఆడియన్స్‌కు జోనర్ ముఖ్యం కాదు.
* పరిశ్రమలో సమస్యలు
-కొన్ని ప్రాక్టికల్ సమస్యలున్నాయి అనేది నిజమే! థియేటర్లు చిన్న చిత్రాలకు దొరకాలంటే, పెద్ద చిత్రాల తాకిడి లేకుండా చూసుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో పెద్ద చిత్రాలు లేక థియేటర్లు వెలవెలపోయిన సంగతీ మనకు తెలిసిందే.
* తరువాతి చిత్రాల?
-తొలి అవకాశం ఇచ్చిన నిర్మాతలే, నాపై నమ్మకంతో రెండో చిత్రాన్ని చేయమన్నారు. అనుకున్న బడ్జెట్‌లో, సకాలంలో చేయడం ఇక్కడ ముఖ్యం. రెండోది సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుంది. రివెంజ్ స్టోరీతో రాజ్ తరుణ్ హీరోగా ఒకటి చేయాలన్న ఆలోచనా ఉంది.
* దర్శకుడంటే?
-రాజు (నిర్మాత) నమ్మకాన్ని నిలబెట్టేవాడు. లక్షలమంది సైన్యానికి (24 క్రాఫ్ట్స్) బాధ్యత వహించేవాడు.

-శేఖర్