Others

మహామేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తజన సందోహంతో
అడవి పల్లె విరిసింది
వన దేవతల కొలుపుతో
మేడారం మురిసింది.
పసుపు కుంకుమతో
పుడమి పూత పూసింది
మునకులు, తలనీలాలతో
జంపన్న వాగు ఎగిసింది
జమిడిక డప్పు మోతతో
చిలకల గుట్ట చిందేసింది
నిలువెత్తు బంగారు రాశితో
తల్లిగద్దె తడిసి ముద్దయింది
సిగమూగు డోలి రాగాలతో
కొమ్మరెమ్మ ఊయలూగింది
ఎదురుకోళ్లు
మొక్కులు అప్పగింతతో
వెదురువనం పరవశించింది
ఓరుగల్లు జాతర
ధిక్కార స్వరపేటిక
పౌరుషాల రణ వేదిక
త్యాగల సుమ మాలిక
గిరిజనుల సంస్కృతి చిత్రిక
మూలపుట్టమ్మల శౌన్య ప్రతీక
మేడారం మహామేళా
ఆదివాసి సంబురాల కేలా
మనె్నం జీవన వికాస హేలా
సమ్మక్క సారలమ్మల మహా తీర్థం
సకల జీవ కోటికి ముక్తి ప్రసాదితం

- కోడిగూటి తిరుపతి 9573929493