Others

అంబేద్కర్ విజయం వెనుక.. ఆమె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు రమాబాయి అంబేద్కర్ జయంతి
*
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్. రమాబాయి 1897, మే 7న బికువలదకార్‌కు రెండవ కుమార్తెగా వాలంగ్ గ్రామంలో దపోలో దగ్గర జన్మించారు. వీరిది చాలా పేద కుటుంబం. తండ్రి కూలిపని చేసేవారు. బుట్టలో చేపలు పెట్టుకొని సముద్రపు తీరంలో ఓ బారులో అమ్మేవారు. అతని సంపాదన వారి తిండికి కూడా సరిపోయేది కాదు. అన్న కూలి పనిచేసేవారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. కొంత కాలానికి తండ్రి కూడా మరణించాడు. తర్వాత బొంబాయిలో ఉండే మేనమామ వీరిని పోషించారు. రమాబాయికి తొమ్మిదేళ్ళ వయసులో, అప్పటికే పదో తరగతి పూర్తిచేసిన పదిహేను సంవత్సరాల అంబేద్కర్‌తో పెళ్ళి జరిగింది. వారి వివాహం జరిగిన విధానం ఆ కాలంలోని పేద జీవితానికి అద్దంపడుతుంది. వారి వివాహం బైకుల్లా చేపల మార్కెట్ (బొంబాయి)లో జరిగింది. మార్కెట్ మూసిన తర్వాత, రాత్రిపూట మార్కెట్‌లోని ఓపెన్‌షెడ్‌లో వీరి వివాహం జరిపించారు. అంబేద్కర్‌గారు రమాబాయిగారితో గడిపిన కాలం తక్కువేనని చెప్పవచ్చు. అంత అరుదైన ఆమె సాన్నిహిత్యాన్ని కోల్పోయిన అంతులేని బాధని అంబేద్కర్‌గారు ఒక వ్యాసంలో ప్రస్తావించారు. బహిష్కృత భారత్ పత్రిక, 3 ఫిబ్రవరి 1928నాటి సంపాదకీయంలో ‘‘నేను స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆపత్కాలంలో తలపై పెట్టుకొన్న ఆ పేడ తట్టని ఆమె వదలాలని కానీ, వెనక్కీముందుకీ చూడాలని కానీ ఎన్నడూ తలంచలేదు. అలాంటి మమతామూర్తి అయిన సామాన్య స్ర్తితో రోజులోని 24 గంటల్లో అర్ధగంట కూడా గడపలేక పోయాను’’ అన్నారు.
తన తొమ్మిదవ యేటనే రమాబాయి అంబేద్కర్‌గారి జీవితంలోకి ప్రవేశించారు. బాయ్‌ఖిల్లా అనే ముంబాయి నగర సబ్ స్టేషన్‌లోని చేపల మార్కెట్‌లో హడావుడీ అంతా సద్దుమణిగాక బయట అరుగుల మీదనే రమాబాయి పెళ్లి అంబేద్కర్‌తో జరిగింది. పెళ్లి జరిగినప్పుడు అంబేద్కర్ పదవ తరగతి పూర్తిచేశాడు. నలుగురు సంతానాన్ని పెంచి పోషించే క్రమంలో రమాబాయిగారి మీద వయస్సుకి మించిన బాధ్యతలు పడ్డాయి. దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం ఒక స్ర్తి ఒంటరిగా బండెడు సంసారాన్ని మోయగలిగిందంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇరుగుపొరుగువారి సూటిపోటి మాటలు మనసుని కాల్చేస్తున్నా కడుపు నిండడమే చాలా కష్టంగా ఉన్నా చెదరని విశ్వాసంతో బిడ్డలని పెంచి పోషించారు రమాబాయి. తను పడుతున్న కష్టాలను అంబేద్కర్‌కి ఏనాడూ తెలియనిచ్చేవారు కాదు. ఆ విధంగా తెలియడం వల్ల భర్త చదువుకి ఆటంకంగా తయారవుతుందని భావించేవారు. అయినప్పటికీ ఓసారి తప్పనిసరి పరిస్థితుల్లో అబ్బాయి గంగాధర్ అనారోగ్యం విషయమై రమాబాయి అంబేద్కర్‌కి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం చేరడంతోనే అంబేద్కరు తనవద్ద ఉన్న దాంట్లోనే కొంత డబ్బుని తీసి వెంటనే ముంబాయికి పంపించారు. ‘్ధర్యం కోల్పోవద్దు. పిల్లలను కాపాడుకోవడానికి ఇంట్లోఉన్న నగలు అమ్మిఅయినా వారి ఆరోగ్యాన్ని కాపాడాలి, నేను తిరిగి వచ్చిన తరువాత మళ్ళీ వాటిని తిరిగి సంపాదించుకోగలం’అని లేఖ రాశారు.
చాలామంది అంబేద్కర్ మిత్రులు సహాయ పడటానికి ముందుకొచ్చినా వారి సాయాన్ని రమాబాయి సున్నితంగా తిరస్కరించేవారు. అంబేద్కర్ సోదరుడు బలరాం ఒక చిన్న సంస్థలో ఉద్యోగంచేస్తూ ఈ పరిస్థితులను గమనించి ఇంట్లోవాళ్లందరికీ కొత్త బట్టలు కొనడానికి డబ్బులు ఇచ్చారు. రమాబాయికోసం కూడా కొత్త చీర తెచ్చుకొమ్మని డబ్బులిచ్చారు. కానీ ఆ డబ్బుతో రమాబాయి అంబేద్కర్‌గారికి ధోవతుల జత, ఒక పరుపు, దిండు, అన్నం తినేందుకు కూర్చునే పీట కొని తెచ్చారు. రమాబాయి కుమారులలో ఒకరైన యశ్వంత్‌రావుకి పోలియో రావడంతో వైద్య ఖర్చులు కూడా లేని స్థితిలో సంసారాన్ని ఈదడమే కష్టంగా మారింది. రమాబాయి ఎప్పుడూ చాలా తెలివిగా, బాధ్యతగా వ్యవహరించేవారు. కడు పేదరికంలో ఉన్నప్పటికీ, ఎప్పుడూ ప్రశాంత వదనంతో వుండేవారు. వివాహ సమయంలో ఆమెకు చదువురాదు. అంబేద్కర్ ఆమెకి చదవడం, రాయడం నేర్పించారు. అంబేద్కరంటే ఆమెకు అమితమైన ప్రేమ. అనురాగంతో కూడిన గౌరవం ఉండేది. నమ్మకం, త్యాగం, అర్థంచేసుకునే గుణం వీరిరువురినీ జీవితాంతం ఆనందంగా ఉండేట్లు చేసింది. అంబేద్కర్ ఆమెని రాము అని పిలిచేవారు. ఆమె తన భర్తని సాహెబ్ అని పిలిచేవారు. నిరంతర అధ్యయనంతో జ్ఞానసముపార్జనతో నిమగ్నమైన తన భర్తని చూసి ఆమె చాలా గర్వపడేవారు. ఆయన అభివృద్ధికోసం నిత్యం పరితపించేవారు. అంబేద్కర్ ఇంటికోసం అసలు సమయం కేటాయించేవారు కాదు. అయినా ఆమె సంసార బాధ్యతల్ని చక్కగా నిర్వహించేవారు. అంబేద్కర్ తనకిచ్చిన డబ్బును ముప్పై భాగాలుగా చేసేవారు. రోజుకొక భాగాన్ని మాత్రమే ఖర్చుపెట్టేవారు. పొదుపుగా యాభై రూపాయలు మాత్రమే ఇంటి ఖర్చులకు వాడి, మిగతా డబ్బును భర్త చదువు కోసం పొదుపు చేసేవారు. ఈమె కేవలం భార్యలా కాక ఒక తల్లిలా అంబేద్కర్‌ని కంటికి రెప్పలా కాపాడి భారత జాతికి ఓ మహోన్నత నాయకున్ని అందించడంలో చిరస్మరణీయురాలిగా మిగిలిపోయారు. అంబేద్కర్ పై చదువులకు అమెరికా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటిదగ్గర స్ర్తిలంతా రమాబాయికి పంపవద్దని చెప్పారు. అక్కడ వేరే స్ర్తిని పెళ్ళాడితే ఏంచేస్తావు? అని ప్రశ్నించారు. ఆమె అలాచేయక అంబేద్కర్ అమెరికా వెళ్ళటానికి సహకరించారు. ఇది ఆమెకు అతనిపై ఉన్న అచంచల విశ్వాసం, ప్రగాఢమైన నమ్మకానికి నిదర్శనం.
ఇంగ్లాండ్‌కెళ్ళిన కొద్దిరోజులకే అంబేద్కర్‌వద్ద ఉన్న డబ్బు అయిపోయింది. ‘ఇక్కడ నా పరిస్థితి ఏమీబాగోలేదు. తినడానికి తిండి లేదు. నాదగ్గర డబ్బు కూడా పూర్తిగా అయిపోయింది. మీకు పంపలేను, నీ దగ్గర ఉన్న నగలు అమ్మివేయి. నేను తిరిగి వచ్చాక మరల కొనుక్కోవచ్చు’ అని రమాబాయికి ఉత్తరం పంపారు. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినా భర్తకు అండగా నిలిచారు రమాబాయి. తర్వాత అంబేద్కర్ ఎన్నో డిగ్రీలు పొందారు. అవన్నీ రమాబాయి త్యాగనిరతికి ప్రతీకలుగా చెప్పవచ్చు. వీరికి ఐదుగురు పిల్లలు. కొడుకులు రమేష్, గంగాధర్, యశ్వంత్, రాజరతన్, కూతురు ఇందు. ఒక్క యశ్వంత్ తప్ప మిగిలిన వారందరూ మరణించారు. పిల్లల మరణం ఆ దంపతుల్ని కుంగతీసింది. దాంతో రమాబాయి అనారోగ్యానికి గురయ్యారు. ముఖ్యంగా రాజరత్న మరణం ఆమెను తీవ్ర అనారోగ్యానికి గురిచేసింది. 1935 మే 27న వారి దాదర్ రాజగృహంలో అంబేద్కర్ ప్రేమతో ‘రామూ’గా పిలుచుకునే రమాబాయి 38 సంవత్సరాల వయసులోనే అంబేద్కర్‌కి శాశ్వతంగా దూరమయ్యారు. పవిత్రమైన నిర్మలమైన మనసు మూగబోయింది. ఆమె మరణించిన తర్వాత అంబేద్కర్ కన్నీరు మున్నీరుగా విలపించారు. చివరకు సన్యాసం తీసుకోవాలని భావించారు. ఎంతోమంది మిత్రులు నచ్చచెప్పి అంబేద్కర్‌ని మామూలు మనిషిగా మార్చారు. ఈ విధంగా కటిక దారిద్య్రంలో జీవితం కొనసాగించిన రమాబాయి ఏ రకమైన ప్రలోభాలనూ తన దరిదాపుల్లోకి రానివ్వలేదు. తన భర్త బారిష్టరైనా ఆమె పిడకలు చేసి సంసారాన్ని నడిపించారు. ఆమె ఇవన్నీ చేస్తూ కేవలం తన బాధ్యతలను నెరవేరుస్తున్నానని అనుకున్నారు. కానీ తనకు తెలియకుండానే ఆత్మగౌరవంతో, మానసిక నిబ్బరంతో జీవించారు. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ జీవన గమనంలో రహదారిగా మారారు. ఇలాంటి ధన్యజీవి రమాబాయి జీవితం అందరికీ ఆదర్శం.

- వాసిలి సురేష్, 9494615360