Others

నాకు నచ్చిన పాట -- అలిగితివా సఖీ ప్రియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రసవంతమైన సరస శృంగార గీతం 1963లో విడుదలైన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలోనిది. విజయా సంస్థ ఆస్థాన విద్వాంసుడు, ఎన్నో హిట్ పాటల కవివరేణ్యుడు పింగళి నాగేంద్రరావు కలం నుంచి సుకుమారంగా జాలువారిన పాట ఇది. అటు పండిత లోకాన్ని ఇటు పామర జనాన్ని పరవశింపజేసింది. నాయకుడు శ్రీకృష్ణ పాత్రను ఎన్టీఆర్, అలకపాన్పు ఎక్కిన నాయిక సత్యభామ పాత్రను జమున పోషించారు. అలిగి పాన్పు ఎక్కిన సత్యను అనునయిస్తూ అమలిన శృంగారానికి ప్రతీకగా వినిపించే పాట ఇది. వౌనం పాటిస్తూనే సత్య హొయలొలికిస్తుంటే, సత్యాకృష్ణుల ప్రణయ సన్నివేశాన్ని చిలిపిగా, పసందుగా, హుషారుగా నభూతో నభవిష్యతి అన్నట్టుగా రూపొందించారు. ఘంటశాల గాత్రం ప్రణయ సన్నివేశానికి తగినట్టుగా అమరితే, సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు భాగీశ్వరి రాగంలో విరహ, విషాద, వియోగ భావాలు పలికించేలా బాణీకట్టారు. ఈ పాటకు జోడుగా పారిజాతాపహరణం కావ్యంలోని మధురమైన పద్యం ‘నను భయవదీయ దాసుని’ పద్యం అభేరీ రాగంలో ఘంటశాలే పాడటం, చక్కటి రాగాలాపన మరొక హైలెట్. పాటలని ప్రాసలు అంత్యంలో ‘కలత మానవా, ఏల జాలవా, తెలియనెంచివా, దయను జూడవా, ఎరుగవా, విధింతువా, కనికరించవా’ అన్న ప్రశ్నార్థకాలతో కూడిన ఈ పాటకు ప్రణయ కలహాల పాటల్లో అగ్రతాంబూలం ఇవ్వక తప్పదు. ఇంకొక విషయం- చిత్రంలో శ్రీకృష్ణునికి, అర్జునునికి సమరం సాగినా, శ్రీకృష్ణుడు, సత్యభామకు సరస శృంగార కలహమనే సమరానికి పట్టంగట్టి విజయం సత్యభామదైనా, సరస శృంగారమే కనిపిచడం మహోదాత్తమైనది. పండిత ప్రకాండుల ప్రశంసల వెల్లువ ఈ పాటకే రావడం రమణీయం.

-బి రాజేశ్వరమూర్తి