Others

మహామాఘి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్షత్ర మండల మార్గాన్ని అనుసరించి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ మార్గంలో లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి. సదరు మార్గాన్ని మన పూర్వీకులు ఇరవై ఏడు భాగాలుగా విభజించారు. అవి దాదాపు సమానంగా ఉంటాయి. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ భాగంలో ఎక్కువ కాంతివంతంగా ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ భాగానికి పేరు పెట్టారు. ఇరవై ఏడు నక్షత్రాలలో మఘ ఒకటి. అందులో ఐదు ప్రముఖ నక్షత్రాలు పల్లకి ఆకారంలో చెదరి ఉంటాయి. మాసానికి ఒకసారి చంద్రుడు ఆ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. కాని ఏడాదిలో ఒకేసారి చంద్రుడు పదహారు కళలతో ఒప్పుతూ మఘ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. అదే మాఘ పూర్ణిమ. దానినే 3మహామాఘి2 అంటారు. చంద్రుడు కాంతి నిస్తంద్రుడై ప్రకాశించే దినాలు ఏడాదికి పనె్నండు ఉంటాయి. అవే పదహారు కళలతో ఒప్పుతూ చంద్రుడుండే రోజులు. పనె్నండు పౌర్ణమిలలో ఒక్కొక్క నక్షత్రంతో చంద్రుడు కూడి ఉంటాడు. ఆయా నక్షత్రాలను బట్టి ఆపౌర్ణమిని పిలుస్తారు. మాఘ నక్షత్ర యుక్త పూర్ణిమను మాఘీయని, అలాగే ఫాల్గుణీ, చైత్రీ, వైశాఖీ, జ్యేష్ఠీ, ఆషాఢీ, శ్రావణీ, భాద్రపదీ, ఆశ్వయుజీ, కార్తీకీ, మార్గశీర్షీ అనే పేర్లతో పిలువబడేవి హిందువులకు పనె్నండు పర్వాలు. భోగ్యార్హమైన శుక్లపక్షం వెనె్నల ఊరికే పోకుండా మన పెద్దలు శుక్ల పక్షంలోనే పండువలు అధికంగా ఏర్పరిచారు.
దశావతారాల్లో ఒకటైన కూర్మావతారం, మహా భక్తుడైన హన్మంతుడు, మానవ ప్రపంచంలో మహనీయుడైన గౌతమ బుద్ధుడు పౌర్ణమిలయందే జన్మించారు. ఇక మాఘ పూర్ణమి విషయానికి వస్తే...మఘ నక్షత్రంలో చంద్రుడు పదహారు కళలతో ప్రకాశించే దినమే మాఘ పౌర్ణమి. దీనిని మహామాఘి అని పంచాంగ కర్తలు అంటారు. పార్వతీ దేవి ఈదినముననే ప్రాదుర్భవించినదని పురాణాధారం. దక్షప్రజాపతికి దక్షిణావర్తపు శంఖాకారపు పద్మ ఆకారాన్ని ధరించిన సతీదేవి, హస్తస్పర్శతో కన్యగా మారిన రోజే మాఘ పౌర్ణిమ. కావేరీ ఉత్తరాన స్వామిమలపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామి, తెలియని విషయాన్ని విద్యావేత్తయైన తన తండ్రికి చెప్పిన దినమైనందున అక్కడ ఈరోజు ఉత్సవం జరుగుతుంది. మహామాఘి అనబడే ఈ పర్వం పేరిటనే కుంభకోణంలో దాదాపు ఇరవై ఎకరాల వైశాల్యం కలిగిన ఒక కోనేరు ఉంది. తంజావూరు తెలుగు నాయక రాజులు ఆ కోనేటి చుట్టూ రాతి పావంచాలు, గట్టు చుట్టూ నలువైపులా పదహారు దేవళాలు కట్టించారు. అందులో విశ్వనాథ దేవాలయం ఒకటి. అది కోనేరు ఉత్తరాన ఉంది. ఆ ఆలయంలో శిలలపై గల శిల్పచిత్రాకృతులు ఉండగా, మాఘ పూర్ణిమ నాడు నవ నదులకు గొప్ప అర్చన జరుగుతుంది. మాఘపూర్ణిమ నాడు... కుంభకోణంలోని కోనేరులో గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, కావేరి, కృష్ణ, కుమారి, పయోషిణి అనే నవ నదులు ప్రవేశిస్తాయని, అందుకే పౌర్ణిమ నాడు సదరు కోనేట్లో తైర్థికులు స్నానాలాచరించడం పరిపాటి. మఘ నక్షత్రాధిపతియైన బృహస్పతిని ఈనాడు పూజించాలని చెపుతారు. మాఘ పౌర్ణమి ద్వాపర యుగాది యని కొన్ని గ్రంథాలు చెపుతున్నాయి. ఈపర్వదినం నాడు అరుణోదయ స్నానం, తిలపాత్ర కంచుక కంబళాది దానాలు చేయాలని, తిల హోమం, తిల దానం, తిల భక్షణం చేయాలని శాస్త్ర వచనం.

- సంగనభట్ల రామకిష్టయ్య