Others
భోగవస్తువునే..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 10 February 2020
- జంధ్యాల రఘుబాబు

అవును కాలాల తరబడి
నేనెప్పడూ భోగవస్తువునే
ననే్నదో విధంగా నీభోగానికి
వాడుకునే బొమ్మనే నేను
ఒకసారి సంగీతమంటావు
మరొకసారి నాట్యమంటావు
ఒకమారు ఇంకో కళ అప్పగిస్తావు
మరోమారు సైరంధ్రని చేస్తావు
నీకు సురాపానమందించి
శయ్యాసుఖాన్ని ధారబోసి
నాలోని ఒక్కోరక్తపుబొట్టూ
నీ సేవలో తరించాలి మరి
నేనెంత నియమబద్ధంగా ఉన్నా
నాపై నా నీడపై వెంటాడే
మీ కన్నులు కామపు చూపులు
ఎన్ని కీచక ఘట్టాలని
చూడలేదు ఈ అవనిపై
డేగ కన్ను ఆకాశాన్నుండి
సదా వీక్షించినట్టే
కారుకూతలు చుట్టుముట్టి
మీ మదపు కోరికల
పరిష్వంగంలో నలిగే
మేలిజాతి పుష్పాలం మేము