Others

ప్రకృతి.. ఆరాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి పురుషుడు ఇద్దరూ పరస్పరాధారితాలు. పరస్పర సహయకారులు. ప్రకృతి లేకుంటే పురుషుని ఉనికి లేదు. పురుషుడు లేకుంటే ప్రకృతి ఉనికీ అగమ్యగోచరమే. ఇక్కడ పురుషుడంటే కేవలం మానవుడు అనే అర్థం గ్రహించాలి. గ్రహాలు, వృక్షాలు, పర్వతాలు, నదులు, జలపాతాలు, గాలి మొదలైన అనేకానేక అణువులో విశ్వం ఏర్పడింది. ఆ విశ్వంలో జీవన పరిణామక్రమానికి ప్రకృతి ఎంతో సహాయపడుతూ వస్తోంది. ఆ ప్రకృతిని మనిషి కాపాడుకోవడంలో అంతర్భాగమే ప్రకృతారాధన.
జీవరాశులు జీవించడానికి అత్యవసరమైన ‘ప్రాణవాయువు’ ముఖ్యంగా వృక్ష సంపదనుంచే లభ్యవౌతోంది. పర్యావరణంలో ఎప్పటికప్పుడు జరిగే రసాయనిక, భౌతిక, నైసర్గిక మార్పులను నియంత్రించడంలో చెట్లు భూమికను గుర్తించి ‘‘వృక్షోః రక్షత రక్షితః’’ అన్నారు. చెట్లు మనకు ఆహారానే్న మాత్రమే కాదు ప్రాణవాయువునిస్తున్నాయి.
మనకు అవసరమైన యంత్రాలనో ఉపయోగించడం వల్లనో లేక మనకు వదిలేసిన గాలి తిరిగి మనం పీలిస్తే అది మనకు హానికరంగా మారుతుంది. ఇట్లాంటి హానికరమైన గాలిని చెట్లు తీసుకొని మనకు బతకడానికి అవసరమైన ప్రాణ వాయువు నిస్తాయ. అంటే మనిషి చెట్లు లేనిదే జీవించలేడన్న నిజం ఇక్కడ బహిర్గతమవుతున్నదికదా.
మన పూర్వీకులు హిమాలయాల్లో సాధువులుగా వుంటూ ప్రకృతి ఆరాధన చేసేవారిని చరిత్ర చెబుతోంది. ఆదిమానవుడు అడవిలోకి వెళ్లి క్రిందపడిపోయిన కట్టెలు ఏరుకొని అడవితల్లికి నమస్కరించి తిరిగి వచ్చేవాడు. రాను రాను మనిషిలో స్వార్థం పెరిగి అధిక లాభాల కోసం చెట్లను నరకడం ఆరంభించాడు. ప్రకృతిని వికృతిగా మార్చడం మొదలైంది. సృష్టికి మూలమైన ప్రకృతి తనంత తానుగా ఎప్పుడూ ప్రళయాన్ని సృష్టించదు. మానవ తప్పిదాల మూలంగానే అనర్థాలు జరుగుతుంటాయ.
ఇట్లా జరగకూడదనే భావనతోనే పూర్వులు మనకు వృక్షాలను పూజించమని చెప్పారు. అందులోని అంతరార్థం ఆ చెట్లు మనకు బతుకునిస్తాయ కనుక వాటిని రక్షించడం ముఖ్య కర్తవ్యంగా మార్చుకోవాలి అని అన్నారు. మర్రి, తులసి, వేప, రావి వంటి వృక్షాలను దాదాపుగా కులమత భేదం లేకుండా అందరూ వీటిని ఏదో రకంగా పూజిస్తుంటారు. భారతీయ సంప్రదాయంలో ప్రకృతి ఆరాధన తరతరాలుగా వస్తోంది
పూర్వకాలంనుంచి గ్రహపూజలు, చెట్లకు మొక్కడాలు, పర్వతాలను పూజిస్తూ గిరి ప్రదక్షిణలు చెయ్యడం, నదులకు హారతులివ్వడం కూడా ఆచారంగా ఉంది అంటే ఇందులోని అసలైన అర్థాన్ని తెలుసుకొని ఆ విధంగా తమ జీవితాలను మలుచుకోమని పెద్దలు చెబుతూనే వస్తున్నారు.
కానీ మనిషి ఆధునిక జీవనానికి అలవాటు పడి ప్రకృతికే ద్రోహం చేస్తున్నాడు. తన ప్రాణవాయువునిచ్చే చెట్లను బతకడానికి కూడా ఆస్కారం లేకుండా తన నిర్మాణాలను సాగిస్తున్నాడు.. ధనకాంక్షవల్ల, పనుల ఒత్తిడివల్ల ఆధునిక సౌకర్యాలు సమకూర్చుకోవడంలోనూ మనిషి ప్రకృతి ఆరాధనకు స్వస్తి పలికి స్వంతరక్షణ గురించి ఆలోచిస్తున్నానుకొంటూ కూర్చున్న కొమ్మనే నరుక్కునే చందానికి వస్తున్నాడు. మన పండుగలు, పబ్బాలు, తీర్థయాత్రలు, వనభోజనాలు ఇలా దేనిలోనైనా సరే ప్రకృతి పరిరక్షణచేసే బుద్ధిని ఉద్దీప్తం చేసే సంస్కృతి వస్తోంది. కనుక వాటిని మరవకుండా ఇప్పటికైనా పెద్దల మాట సద్దిమూట అనడంలో అంతరార్థాన్ని తెలుసుకొని మసలుకుంటే ప్రకృతి, పర్యావరణమూ బాగుంటాయ. మనిషి అధునాతనమైన ఆలోచనలతో ముందుకు వెళ్తాడు. ప్రకృతి మాత్రం విస్మరిస్తే ముందుకు పోవడం కాదుకదా. అసలు మనుగడ సాగించడం కష్టమైపోతుంది. కనుక ప్రతిమానవుడు ప్రకృతిని పూజించడం, ప్రేమించడం లేదా ప్రకృతి పట్ల తన కర్తవ్య నిర్వహణను మరవకుండా ఉండాలి. అపుడే ప్రకృతి పురుషుడు ఇద్దరూ బాగుంటారు. ద్వాపరంలోను కృష్ణ్భగవానుడే రేపల్లె వాసులందరి చేత ప్రకృతిని ఆరాధింప చేశాడు. త్రేతాయగ రాముడు కూడా వనాల్లో నివసిస్తూ వనరక్షణ రాజుదే అని ఖరాఖండిగా వ్యవహరించాడు. ఇలా పురాణ పురుషులు సైతం ప్రకృతి ఆరాధించినవారే . ఆరాధించ మని ప్రబోధించినవారే కనిపిస్తారు.
కలియుగంలోని మానవుడే భక్తి ఉందంటూనే ప్రకృతిని ఆరాధిస్తున్నామంటూ ప్రకృతి విధ్వంసకర వస్తువులను ఉపయోగిస్తున్నాడు. కనుక ఇప్పుడైనా మనిషి తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని తన పూర్వజులు నడిచిన దారిలో నడవడానికి ప్రయత్న శీలుడవ్వాలి.

- కె. వాణి